By: ABP Desam | Updated at : 17 Mar 2022 07:25 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రజనీకాంత్, ధనుష్‌లతో ఐశ్వర్య (ఫైల్ ఫొటో) (Image Credits: Aishwarya Rajnikanth Twitter)
కోలీవుడ్ స్టార్ ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ధనుష్ సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్‌గా లేరు. విడిపోతున్నట్లు ట్వీట్ చేసిన అనంతరం తన కొత్త సినిమా ‘మారన్’ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన ఒక్క ట్వీట్ మాత్రం పెట్టారు. అయితే ఇప్పుడు ధనుష్ మరో ట్వీట్ చేశారు. అది కూడా ఐశ్వర్య గురించే కావడం విశేషం.
జానీ మాస్టర్, ఢీ ఫేం శ్రష్టి జంటగా ‘పయని’ అనే మ్యూజిక్ వీడియోకు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. తమిళ వెర్షన్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా... తెలుగు వెర్షన్ ‘సంచారి’ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మలయాళ వెర్షన్ ‘యాత్రక్కారి’ని మోహన్ లాల్ రిలీజ్ చేశారు. ఈ వీడియో గురించి ధనుష్ ట్వీట్ చేశారు.
‘పయని మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించినందుకు నా స్నేహితురాలు ఐశ్వర్యకు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్’ అని ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే విడిపోయాక కూడా ఐశ్వర్య తన ట్విట్టర్ యూజర్‌నేమ్‌లో ధనుష్ పేరును అలానే ఉంచేశారు. ధనుష్ చేసిన ట్వీట్‌పై అతని ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. ‘తను ఇంకా నీ పేరును తీయలేదు. కానీ నువ్వు ఫ్రెండ్ అంటున్నావా?’, ‘మళ్లీ తిరిగి కలిసిపోండి’, ‘ఫ్రెండా అన్నయ్యా?’ ఇలా రకరకాలుగా ఈ ట్వీట్‌పై రియాక్ట్ అవుతున్నారు.
ఈ వీడియో గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. ‘మళ్లీ దర్శకత్వం వహించినందుకు శుభాకాంక్షలు. ఈ పాటను పూర్తిగా ఎంజాయ్ చేశాను.’ అని మహేష్ బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. సంచారి, పయని, యాత్రక్కారి పేర్లతో విడుదల అయిన ఈ పాటలను యూట్యూబ్‌లో చూడవచ్చు.
Congrats my friend @ash_r_dhanush on your music video #payani https://t.co/G8HHRKPzfr God bless
— Dhanush (@dhanushkraja) March 17, 2022
My best wishes to Aishwarya garu for #Sanchari song. My regards to Jani Master, Sagar and the rest of the cast and crew.https://t.co/ojeJPeealW@ash_r_dhanush@officiallyAnkit@AlwaysJani@verma_shrasti@sagar_singer@DOP_VishnuR@EditorElayaraja
— Allu Arjun (@alluarjun) March 17, 2022
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్
Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు