అన్వేషించండి

Dhanush - Aishwarya Rajinikanth Divorce : ధనుష్, ఐశ్వర్య కలిసి ఉండేది లేదట, విడాకులే కావాలట.. విడిపోవడానికే కోర్టుకు వెళ్లారు

Dhanush Divorce : విడిపోవడం అంటూ జరిగాక మళ్లీ కలవడం కుదరదు అన్నట్లుగానే ఉంది ధనుష్, ఐశ్వర్య  పరిస్థితి. తాజాగా వారు కలుస్తారనే వార్తలు వినిపించాయి కానీ కోర్టులో వాళ్లు విడిపోతామని తేల్చి చెప్పేశారు. 

Dhanush - Aishwarya Divorce Updates : తమ పెళ్లి జీవితానికి చెక్ పెట్టి.. విడిపోవాలని అనుకుంటున్నారు ధనుష్, ఐశ్వర్య. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ జంట బ్రేక్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించగానే.. అందరూ షాక్​కి గురయ్యారు. ఇటీవల వారు కలిసిపోతున్నారు.. విడాకులు ఏమి లేవు అనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ తాజాగా జరిగిన విడాకుల కేసు విచారణకు ధనుష్, ఐశ్వర్య హాజరై.. తాము విడిపోవాలనుకుంటున్నట్లు న్యాయస్థానంలో తెలిపారు. 

చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఎదుట ధనుష్, ఐశ్వర్య  హారయ్యారు. మళ్లీ కలిసిపోయారనే వార్తలకు చెక్ పెడుతూ.. లేదు మేము విడిపోవాలనుకుంటున్నామని.. తమ తమ రీజన్స్ తెలిపారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం తుది తీర్పును ఈనెల 27కు వాయిదా వేసింది. ఫ్రెండ్స్​గా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. 18 ఏళ్లు వీరు ఐడియల్ కపుల్​గా కనిపించారు. కానీ సడెన్​గా విడిపోతున్నట్లు ఇన్​స్టాలో పోస్ట్​ ద్వారా తెలిపారు. 

ఈ నవంబర్ 18తో వీరికి పెళ్లి జరిగి 20 సంవత్సరాలు. కానీ ఎంతకాలం కలిసి ఉండి ఏమి లాభం. విడిపోవాలి అనుకున్నాక.. మళ్లీ ఏమి జరిగినా కలవడమంటూ ఉండదనే రేంజ్​లో ఇద్దరూ విడిపోతామంటూ న్యాయస్థానానికి తెలిపారు. ఈ రిలేషన్​లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకుండా.. మ్యూచువల్ అండర్​స్టాండిగ్​తోనే విడిపోతున్నట్లు గతంలోనే పోస్ట్​ ద్వారా తెలిపారు. తమ తమ కెరీర్​లో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు పోస్ట్​ ద్వారా వెల్లడించారు. 

గతంలో న్యాయస్థానంలో జరిగిన విచారణకు వీరిద్దరూ రాలేదు. దీంతో వారు టైమ్ తీసుకుంటున్నారు. మళ్లీ కలుస్తారనే వార్తలు ఎక్కువగా వచ్చాయి. రజినీకాంత్ వీరిద్దర్ని కలిపేందుకు ట్రై చేస్తున్నారని కూడా కోలివుడ్లో వినిపించాయి. కానీ తాజాగా జరిగిన విచారణకు ఇద్దరూ హాజరయ్యారు. కలిసి ఉండాలని లేదని తెలిపి.. దానికి తగిన రీజన్స్ చూపిస్తూ.. విడాకులు కోరారు. వారి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నవంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. వచ్చేవారం జరిగే చివరి విచారణతో వీరికి విడాకులు మంజూరు అవుతాయి.

సెలబ్రెటీల్లో పెరుగుతున్న విడాకులు.. 

అప్పటివరకు ఐడియల్​గా కనిపించిన కపుల్ అంతా సడెన్​గా పోస్ట్​లు పెట్టి.. మేము విడిపోతున్నాము.. మమ్మల్ని అర్థం చేసుకోండి అంటున్నారు. ఫ్రెండ్స్​గా ఉంటూ.. ప్రేమించుకుని.. పెద్దల్ని ఒప్పించుకుని పెళ్లి చేసుకుని.. సడెన్​గా విడిపోతున్నామంటున్నారు. టాలీవుడ్​లో క్యూట్​గా, లవ్లీగా కనిపించిన చైతన్య, సమంత కూడా ఇలానే విడిపోయారు. ధనుష్ - ఐశ్వర్య పరిస్థితి కూడా దాదాపు అంతే. ఏఆర్ రెహమాన్ కూడా తాజాగా తన పెళ్లిజీవితాన్ని ఎండ్ చేస్తున్నామంటూ రాసుకొచ్చారు. అభిషేక్ బచ్చన్-ఐశ్వర్య రాయ్​ కూడా విడిపోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.  

Also Read : Gen Zలకు సోకుతున్న డేంజర్ డిసీజ్‌- ట్రెండ్‌గా మారుతున్న డివోర్స్ ఇన్​ ద ఎయిర్

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ranabaali Teaser Review : శింగనమల బొబ్బిలి... రణబాలి - బ్రిటిష్ దొరల తలలు తెంచే వారియర్‌ వచ్చేశాడు
శింగనమల బొబ్బిలి... రణబాలి - బ్రిటిష్ దొరల తలలు తెంచే వారియర్‌ వచ్చేశాడు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి పేరు మీద ఆస్తి రాసేసిన విహారి! అంబిక ప్లాన్ బీ కూడా ఫెయిలా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరి పేరు మీద ఆస్తి రాసేసిన విహారి! అంబిక ప్లాన్ బీ కూడా ఫెయిలా!
Veerabhadruni Rahasyam Part 2 OTT : వీరభద్రుని ఆలయం మిస్టరీ రివీల్ అవుతుందా? - ఓటీటీలోకి పార్ట్ 2 స్ట్రీమింగ్
వీరభద్రుని ఆలయం మిస్టరీ రివీల్ అవుతుందా? - ఓటీటీలోకి పార్ట్ 2 స్ట్రీమింగ్
Kavya Shree: 'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన
Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
BRS MLAs: మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
మగ పోలీసులు మాపై ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు: 'నిజం గెలిచింది' అంటూ నారా లోకేష్ భావోద్వేగ పోస్ట్
Lust Stories 3 Trailer : బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
బోల్డ్ అంథాలజీ లస్ట్ స్టోరీస్ 3 ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్ విత్ కామెడీ డైలాగ్స్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కైనెటిక్ స్కూటర్లకు బిగ్ అప్‌గ్రేడ్.. కొత్త బ్యాటరీతో ఇప్పుడు ఏకంగా 132 కి.మీ. రేంజ్!
కైనెటిక్‌ స్కూటర్ల కెపాసిటీ పెరిగింది, ఇప్పుడు సింగిల్‌ ఛార్జ్‌తో 132km రేంజ్‌!
Deepika Padukone Baby Bump: కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
కడుపులో ఓ బిడ్డ... కళ్ళముందు మరో బిడ్డ... భర్తతో దీపిక... వైరల్ బేబీ బంప్ & బర్త్‌డే ఫోటోషూట్
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
పితృ పక్షంలో పెళ్లి షాపింగ్ చేయాలా , వాయిదా వేయాలా?
Embed widget