అన్వేషించండి

OTT Releases : నవంబర్​లో OTTకి రానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఇవే.. తంగలాన్ నుంచి వేట్టయాన్ వరకు

నవంబర్​లో థియేటర్​కే కాదు.. ఓటీటీకి కూడా అదిరే సినిమాలు వచ్చేస్తున్నాయి. సౌత్​లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సినిమాలు ఇక వరుసగా రానున్నాయి. అవేంటో.. ఎక్కడ స్ట్రీమ్ కానున్నాయో ఇప్పుడు చూసేద్దాం. 

OTT Releases this Month : దీపావళి సందర్భంగా ఇప్పటికే నవంబర్ మొదటి వారంలో థియేటర్లు ఫుల్ బిజీ అయిపోయాయి. రెండోవారంలో కంగువ కూడా వచ్చేస్తుంది. అయితే ఈ నవంబర్​లో కేవలం థియేటర్లకే కాదు.. ఓటీటీలో కూడా కొన్ని క్రేజీ సినిమాలు వస్తున్నాయి. ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న 5 మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఓటీటీల్లోకి రానున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి? ఏయే OTT ప్లాట్​ఫ్లామ్​లో విడుదల కాబోతున్నాయి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

తంగలాన్ ఓటీటీ (Thangalaan OTT Date)

ఆగస్టులో విడుదలైన ఈ క్రేజీ మూవీ.. ఎప్పుడెప్పుడా ఓటీటీలోకి వచ్చేదా అని ఎదురు చూస్తున్నారు సినిమా అభిమానులు. పా రంజిత్ దర్శకత్వంలో.. చియాన్ విక్రమ్ నటించిన ఈ సినిమాకు సినీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. విక్రమ్ ప్రాణం పెట్టి చేసిన ఈ సినిమా ఆడియన్స్​ను న్యూ వరల్డ్​లోకి తీసుకెళ్లింది. ప్రేక్షకులకు థియేటర్లలో డిఫరెంట్ ఎక్స్​పీరియన్స్ ఇచ్చింది. అందుకే ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత తంగలాన్ ఓటీటీలోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రబృందం ఇంకా ఎలాంటి అప్​డేట్ ఇవ్వకున్నా.. ఇది నవంబర్​లో వస్తుందని చూస్తున్నారు. ఓటీటీలో వస్తే నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమ్ కానుంది ఈ సినిమా. 

వేట్టయన్ ఓటీటీ (Vettaiyan OTT Date) 

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా.. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా వేట్టయన్. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మలయాళ భాషల్లో విడుదలై ప్రేక్షకులను ఓ రేంజ్​లో ఆకట్టుకుంది. బిగ్​ బి, రజినీని చూసేందుకు ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపించారు. ఈ క్రేజీ సినిమా ఓటీటీరైట్స్​ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. నవంబర్ 7వ తేదీన ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. 

మార్టిన్ ఓటీటీ (Martin OTT Date)

పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన మార్టిన్ సినిమా ప్రేక్షకుల అంచనాలు అంత అందుకోలేకపోయింది. కానీ అదిరే విజువల్స్​తో, భారీ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలోకి వస్తే చూసేందుకు మాత్రం సిద్ధంగానే ఉన్నారు. ఇప్పటికే జీ నెట్​వర్క్,  ZEE5 శాటిలైట్, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సంపాదించుకుంది. అయితే ఈ సినిమా నవంబర్ ఎండింగ్​లో ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ నెలలోనే సినిమా ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. 

Bougainvillea ఓటీటీ (Bougainvillea OTT Date)

ఫాహద్ యాక్టింగ్​కు, సినిమాలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఏ లాంగ్వేజ్​లో నటించినా.. డబ్బింగ్​లో లేకున్నా సరే సినిమాలు చూసే ఉన్నారు. సినీ ప్రేక్షకులు ప్రస్తుతం Bougainvillea సినిమా గురించి కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విడుదలైన 45 రోజుల రన్ తర్వాత సినిమా ఓటీటీలోకి రావొచ్చు కాబట్టి.. నవంబర్ చివరిలో ఓటీటీలోకి ఈ సినిమా వచ్చే అవకాశముంది. 

ఏఆర్ఎమ్ ఓటీటీ (ARM OTT Date)

టోవినో థామస్ నటించిన ఏఆర్ఎమ్ సినిమా కూడా నవంబర్​లో ఓటీటీలోకి రానుంది. మలయాళం సినిమాలు ఇష్టపడే సినీ ప్రేక్షకులకు టోవినో సినిమాలు మంచి కిక్​ ఇస్తాయి. అందుకే అతని సినిమాలకు ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. పైగా కృతి శెట్టి మలయాళంలో హీరోయిన్​గా చేసిన మొదటి సినిమా ఇది. థియేటర్​లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. నవంబర్ 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్​లో స్ట్రీమ్ కానుంది. ఎనిమిది వారాల థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. 

ఈనెలలో పండుగలేమి లేకున్నా.. సినీ ప్రేక్షకులకు మాత్రం థియేటర్లలోనూ.. ఓటీటీలోనూ మంచి కిక్​ ఇచ్చే సినిమాలే వస్తున్నాయి. సమంత నటించిన యాక్షన్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ కూడా ఈ వారంలోనే రానుంది. డిసెంబర్​లో ఇండియాలోని ప్రతి సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తోన్న పుష్ప 2 సినిమా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభమే కాదు.. ఎండింగ్ కూడా సినీ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇస్తోంది.

Also Read : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? - ఇలా చేస్తే ఎక్కువ సేపు వస్తుంది!
ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? - ఇలా చేస్తే ఎక్కువ సేపు వస్తుంది!
Embed widget