IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Director Sukumar: ఇది చూసి కన్నీరు ఆగట్లేదు, ఇంత అభిమానమా - సుకుమార్ భావోద్వేగం

Sukumar: డైరెక్టర్‌ సుకుమార్‌పై అభిమాన్ని భిన్నమైన రితీలో ప్రదర్శించి ఓ అప్ కమింగ్ హీరో అందరి దృష్టిని ఆకర్షించాడు. 50 రోజులు కష్టం తర్వాత తన అభిమాన దర్శకుడి రూపాన్ని ప్రపంచానికి చూపించాడు.

FOLLOW US: 

Pushpa Director Sukumar Fan: మామూలుగా హీరోలకి వీరాభిమానులు ఉంటారు. తమ అభిమానాన్ని ఎన్నో రకాలుగా చూపుతుంటారు. రాజకీయ నాయకులకు కూడా హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు. వారు కూడా పాలాభిషేకాలు, గజమాలలు, ఫ్లెక్సీలు లాంటి ఎన్నో పద్ధతుల్లో నేతలపై తమ ఇష్టాన్ని ప్రకటించుకుంటారు. ఇంకొంత మంది వారిని ప్రసన్నం చేసుకొనే ఉద్దేశంతో కూడా ఇవన్నీ చేయొచ్చు. కానీ, హీరోలు, పొలిటికల్ లీడర్లు సరే. సినిమా దర్శకులకు కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారని ఈ యువకుడు చాటాడు. సాధారణంగా దర్శకులపై ఓ మోస్తరు స్థాయిలో అభిమానం చూపించడం సహజమే. కానీ, తెలుగులో ఓ స్టార్ డైరెక్టర్‌ విషయంలో మాత్రం వినూత్న స్థాయిలో ఓ అభిమాని తన ఇష్టాన్ని ప్రకటించాడు.

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌పై అభిమాన్ని భిన్నమైన రితీలో ప్రదర్శించి ఓ అప్ కమింగ్ హీరో అందరి దృష్టిని ఆకర్షించాడు. 50 రోజులు కష్టం తర్వాత తన అభిమాన దర్శకుడి రూపాన్ని ప్రపంచానికి చూపించాడు. ఈ అరుదైన దృశ్యానికి కడప జిల్లా బోరెడ్డిగారి పల్లి గ్రామం వేదిక అయింది. కడపకు చెందిన సువిక్షిత్‌ బోజ్జా ‘దూరదర్శిని’ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ సువీక్షిత్ దర్శకుడు సుకుమార్‌కు వీరాభిమాని. ఈ క్రమంలోనే తన అభిమానాన్ని చాటుకునేందుకు బోరెడ్డిగారి పల్లిలోని తన రెండున్నర ఎకరాల పోలాన్ని వేదికగా చేసుకున్నాడు. 

అందులో వరిసాగు చేస్తూ సుకుమార్‌ రూపం వచ్చేలా వరి పంట సాగు చేశాడు. 50 రోజలు అనంతరం డ్రోన్‌తో ఈ దృశ్యాన్ని చిత్రీకరించాడు. ఇందులో సుకుమార్‌ రూపంతో పాటు ‘పుష్ప 2’ మూవీ టైటిల్‌ ఉండేలా చూశాడు. ఈ వీడియో మొత్తం పూర్తయ్యాక బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రత్యేక పాట కూడా యాడ్ చేసి సిద్ధం చేశాడు. ఈ అరుదైన దృశ్యాన్ని సుకుమార్ వద్దకు వెళ్లి ఆయన కార్యాలయంలోనే కలిశాడు. అది చూడగానే తనకు నోట మాట రాలేదని, తన కళ్లలో ఒక్కసారి నీళ్లు తిరిగాయని సుకుమార్‌ ఎమోషనల్‌ అయ్యారు. అంతేకాదు ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా? అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు.

Published at : 17 Mar 2022 11:39 AM (IST) Tags: kadapa news Tollywood News director sukumar Sukumar New Movies Pushpa Director Sukumar paddy cultivating

సంబంధిత కథనాలు

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?

Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య

Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు

Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు

Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు