By: ABP Desam | Updated at : 02 Dec 2022 09:23 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@bubblesbublu/twitter
బాలీవుడ్ లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ 'సర్కస్'. షేక్స్‌పియర్ నవల 'ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్' ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ డ్యుయెల్ రోల్ చేస్తున్నారు. పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ, టికు తల్సానియా, జానీ లివర్, సంజయ్ మిశ్రా, వ్రాజేష్ హిర్జీ సహా పలువురు కీ రోల్స్ చేస్తున్నారు. దీపికా పదుకొనే ఐటెమ్స్ సాంగ్ తో ఆకట్టుకోబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ మొదటి నుంచి చివరి దాకా ఆడియెన్స్ ను కామెడీతో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది.
రణ్ వీర్, రోహిత్ శెట్టి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా
రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, టి-సిరీస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రోహిత్ శెట్టితో రణ్ వీర్ సింగ్ ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నారు. ఇప్పటికే సింబా, సూర్యవంశి సినిమల్లో నటించారు. ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ కామెడీతో ఆకట్టుకున్నాయి. వీరి కాంబోలో వచ్చిన రెండో సినిమా సూర్యవంశి ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సర్కస్ ట్రైలర్ సినీ లవర్స్ ను ఓరేంజిలో ఆకట్టుకుంటోంది. ఇక ‘సర్కస్’ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రణ్ వీర్ తోపాటు వరుణ్ కూడా డ్యుయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కరెంటును ముట్టుకున్నా షాక్ కొట్టని వ్యక్తిగా రణ్ వీర్ ఈ సినిమాలో కనిపించనున్నారు.
ఐటెమ్ సాంగ్ తో దుమ్మురేపిన దీపిక
ఇక ఈ సినిమా ట్రైలర్ ఎండింగ్ లో స్పెషల్ సాంగ్ తో దీపిక పదుకొనే తళుక్కున మెరిసింది. పింక్ శారీలో క్యూట్ క్యూట్ గా కనిపించింది. రణ్ వీర్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. నిజానికి 1982లో వచ్చిన ‘అంగూర్’ మూవీ ఆధారంగా ‘సర్కస్’ మూవీ తెరెక్కించారు. అటు ‘అంగూర్’ సినిమా 1968లో వచ్చిన ‘దో దూనీ చార్’ మూవీ రీమేక్ కావడం విశేషం.
‘సర్కస్’పై ఆశలు పెట్టుకున్న పూజా, రణ్ వీర్
అటు ఈ సినిమాపై బుట్టబొమ్మ పూజా హెగ్డే చాలా ఆశలు పెట్టుకుంది. ‘సర్కస్’ సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకోవాలని భావిస్తోంది. సౌత్ లో సత్తా చాటిన ఈ బ్యూటీ, ఇప్పుడు నార్త్ లోనూ జెండా పాతేయాలనుకుంటోంది. ఇప్పటికే హృతిక్ రోషన్‌తో కలిసి ‘మొహంజొదారో’ సినిమాలో నటించినా పెద్దగా హిట్ కాలేదు. ప్రస్తుతం పూజా తెలుగులో మహేష్ తో కలిసి ‘ఎస్‌ఎస్‌ఎంబీ 28’ సినిమా చేస్తోంది. హిందీలో సల్మాన్ తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ మూవీలో నటిస్తోంది. అటు రణ్‌వీర్ చివరి సినిమా ‘జయేష్ భాయ్ జోర్దార్’ కూడా పెద్దగా ఆడలేదు. ఆయన కూడా ‘సర్కస్’ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత కరణ్ జోహార్‌తో కలిసి ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ మూవీ చేయబోతున్నారు. ఇందులో రణ్ వీర్ సరసన అలియా హీరోయిన్ గా చేస్తోంది.
Read Also: RRR నటి ఒలివియా నటించిన వెబ్ సీరిస్ ‘ది హెడ్’ రిలీజ్‌కు రెడీ - కానీ, ఒక బ్యాడ్ న్యూస్!
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్
Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?
Pathaan movie: అమెరికాలో ‘పఠాన్’ జోరు, థియేటర్లో ఆ నోటీస్ చూసి ఫ్యాన్స్ షాక్ - బాలయ్య ఎఫెక్టేనా?
Janaki Kalaganaledu January 30th: తోపుడు బండి మీద వ్యాపారం మొదలుపెట్టిన రామా- అవమానించిన కన్నబాబు, బుద్ధి చెప్పిన జానకి
Adhire Abhi Comments: మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి, ‘జబర్దస్త్’పై అదిరే అభి కామెంట్స్!
కృష్ణా జిల్లా వైఎస్ఆర్‌సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు
2002 Gujarat Riots: గుజరాత్ అల్లర్ల డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ పిటిషన్ - విచారణకు సుప్రీంకోర్టు ఓకే
Budget 2023: సుకన్య సమృద్ధికి బడ్జెట్లో బూస్ట్ - అలాంటి వారికీ ఛాన్స్ ఇస్తారట!