యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ‘మిషన్ తషాఫి’ - కొత్త వెబ్ సీరిస్ షూటింగ్ ఆరంభం
హై ఇంటెన్స్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘మిషన్ తషాఫి’ కు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సిరిసీ ను ఓటీటీ ప్లాట్ ఫ్లామ్ జీ 5 రూపొందిస్తుండగా, దీనికి ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ చేయనున్నారు.
Mission Tashafi: ప్రముఖ్ ఓటీటీ ప్లాట్ ఫ్లామ్ Zee 5.. ఇప్పుడు సరికొత్త యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ తషాఫి’ సీరిస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎంగేజింగ్, థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సీరిస్‌ను తెరకెక్కిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ లో సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా, ఛత్రపతి శేఖర్, భూషణ్ కళ్యాణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రధాన తారాగణంగా నటించబోయే నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. హై ఇంటెన్స్ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ ‘మిషన్ తషాఫి’... ఒరిజినల్ రెగ్యులర్ షూటింగ్ జూన్ 17 నుంచి ప్రారంభమైంది.
'మిషన్ తషాఫి’ వెబ్ సిరీస్ లో 8 ఎపిసోడ్స్ ఉండనున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇక సిరీస్‌ను ఫిల్మ్ రిపబ్లిక్ బ్యానర్‌పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటి వరకు రూపొందని సిరీస్ గా ఈ హై ఇన్‌టెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌ను జీ 5 భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుందని వెల్లడించారు. ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు చిత్రీకరించని సరికొత్త లొకేషన్స్‌లో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తుందని వెల్లడించారు.
#MissionTashafi, the next big #ZEE5 original directed by the talented @PraveenSattaru begins shooting. Produced by @ipranathireddy under @thefilmrepublic banner, this spy thriller has high-octane action performances designed by renowned stunt masters!@ZEE5Telugu @ZEE5India… pic.twitter.com/d6l11wliHz
— Ramesh Bala (@rameshlaus) June 18, 2023
తెలుగు చిత్ర పరిశ్రమలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరై ప్రవీణ్ సత్తారు.. 'లైఫ్ బిఫోర్ వెడ్డింగ్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయ్యారు. అప్పట్నుంచి 'రొటీన్ లవ్ స్టోరీ', 'చందమామ కథలు', 'గుంటూరు టాకీస్', 'పీఎస్వీ గరుడ వేగ', ‘11th అవర్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. చివరిగా 'కింగ్', అక్కినేని నాగార్జున హీరోగా ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Read Also : Adipurush Controversy: ‘ఆదిపురుష్’పై సర్వత్రా విమర్శలు, సినీ అభిమానులకు కోపం తెప్పించిన 10 మిస్టేక్స్ ఇవే!