(Source: ECI/ABP News/ABP Majha)
Zanai Bhosle: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న శ్రద్ధా కపూర్ కజిన్ - ఆమె సింగర్ ఆశా భోస్ మనవరాలు కూడా!
Zanai Bhosle: ఎన్నో భాషల్లో ఎన్నో వందల పాటలు పాడి అలరించిన ఆశా భోస్లే వారసురాలు జనాయ్.. ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీకి సిద్ధమయ్యింది. తను శ్రద్ధా కపూర్‌కు కజిన్ కూడా అవుతుంది.
Asha Bhosle Grand Daughter Zanai Bhosle: ఈరోజుల్లో యాక్టర్ల వారసులు మాత్రమే కాదు.. దర్శక నిర్మాతలు, సింగర్ల వారసులు కూడా హీరోహీరోయిన్లు అవ్వాలన్న కలతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా అలాంటి స్టార్ల వారసులను ఎంకరేజ్ చేయడానికి బాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా మరో స్టార్ వారసురాలు కూడా తన యాక్టింగ్ డెబ్యూకు సిద్ధమయినట్టు తెలుస్తోంది. ప్రముఖ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జనాయ్ భోస్లే.. హీరోయిన్‌గా తన డెబ్యూకు సిద్ధమయ్యింది. తను శ్రద్ధా కపూర్‌కు కజిన్ అవుతుంది. అందుకే జనాయ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి శ్రద్ధా ముందుకొచ్చింది. అంతే కాకుండా జనాయ్.. తన మొదటి సినిమాతోనే ఛాలెంజింగ్ రోల్‌లో ప్రేక్షకులను పలకరించనుంది.
పెద్ద రిస్క్..
ఎన్నో ఏళ్లుగా ఆశా భోస్లే మూవీ, మ్యూజిక్ లవర్స్‌కు చాలా దగ్గరయిన వ్యక్తి. ఎన్నో భాషల్లో వందల పాటలు పాడి ఇప్పటికీ పాడుతూ.. అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటారు ఆశా. ఇక తన మనవరాలు జనాయ్ భోస్లే కూడా ఆశాలాగానే సింగర్ అయ్యి అందరినీ అలరిస్తుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ జనాయ్ మాత్రం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రావడానికి వేరే రోల్‌ను ఎంచుకుంది. హీరోయిన్‌గా తన టాలెంట్‌ను నిరూపించుకోవాలని నిర్ణయించుకుంది. అంతా బాగానే ఉన్నా.. తన మొదటి సినిమాతోనే జనాయ్.. పెద్ద రిస్క్ తీసుకోనుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ బయోపిక్‌లో జనాయ్ భోస్లే లీడ్ రోల్ చేయడానికి సిద్ధమయ్యింది.
స్వయంగా ప్రకటన..
బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలు నిర్మిస్తూ పాపులర్ అయ్యాడు సందీప్ సింగ్. తాజాగా డైరెక్షన్‌లోకి కూడా అడుగుపెట్టాడు. తన దర్శకత్వంలో త్వరలోనే ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ - ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే సినిమా తెరకెక్కనుంది. అందులో జనాయ్ భోస్లే.. శివాజీ మహారాజా భార్య అయిన రాణీ సాయి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. జనాయ్‌ను తన సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయాన్ని సందీప్ సింగ్ స్వయంగా ప్రకటించాడు. జనాయ్, ఆశా భోస్లేలతో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశాడు. దీంతో బాలీవుడ్ స్టార్లు అంతా జనాయ్ డెబ్యూకు ఆల్ ది బెస్ట్ చెప్పడం మొదలుపెట్టారు.
View this post on Instagram
ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే..
జనాయ్ భోస్లే ఇప్పటివరకు వెండితెరపై అడుగుపెట్టలేదు. కానీ తనకు బాలీవుడ్‌లో చాలానే కాంటాక్ట్స్ ఉన్నాయి. తరచుగా స్టార్లను కలుస్తూనే ఉంటుంది. ఇక బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కుకున్న శ్రద్ధా కపూర్‌కు జనాయ్ కజిన్ అవుతంది. అందుకే జనాయ్‌కు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆల్ ది బెస్ట్ తెలిపింది శ్రద్ధా. ‘మనందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి నా చెల్లెలు సినిమాల్లోకి వచ్చేస్తోంది. ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే’ అని రాసుకొచ్చింది. ఇక అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ - ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా 2026 ఫిబ్రవరీ 19న విడుదల అవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
Also Read: వేణు స్వామిని కలిసిన అనన్య - క్షుద్రపూజల కథతో తీసిన 'తంత్ర' కోసం!