Mem Famous OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మేమ్ ఫేమస్' - స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
సుమంత్ ప్రభాస్ హీరోగా లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన 'మేం ఫేమస్' సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయింది.
టాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ లో బాగా హైప్ క్రియేట్ చేసిన మూవీ 'మేం ఫేమస్' రిలీజ్ కి ముందే ఈ సినిమా విపరీతమైన పాజిటివ్ బజ్ ని తెచ్చుకుంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా యూట్యూబ్ లో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. ఒక విధంగా ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ గా ఒకేసారి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారని చెప్పొచ్చు. 'మేజర్', 'రైటర్ పద్మభూషణ్' వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించాయి. శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహర్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా పలువురు స్టార్ హీరోలతో ఈ సినిమాని ప్రమోట్ చేయించడంతో సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.
విజయ్ దేవరకొండ, నాని, నాగచైతన్య, అడివి శేష్, నవీన్ పోలిశెట్టి, దగ్గుపాటి రానా, విశ్వక్ సేన్ లాంటి హీరోలంతా ఈ సినిమాని ప్రమోట్ చేయడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వీళ్ళే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి లాంటి అగ్రతారాలు కూడా ఈ సినిమాని ప్రశంసించారు. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. మే 26న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వీకెండ్ మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేస్తుంది. ఆ తర్వాత ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందనను కనబరిచింది. తెలంగాణ నేటివిటీతో కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. ముగ్గురు స్నేహితుల మధ్యన నడిచే సరదా సంభాషణలు, వాళ్ళు ఫేమస్ కావడానికి పడే పాట్లు ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకున్నాయి.
అయితే కథ, కథనంలో లోపాలు ఉన్నా కూడా యాక్టర్స్ తమ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంది. కాగా తాజాగా ఈ మూవీ ఓటిటి రిలీజ్ కి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో 'మేమ్ ఫేమస్' చిత్రం జూన్ 30 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఇదే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది. థియేటర్స్ లో ఈ సినిమాని మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు.
'మేం ఫేమస్' కథ విషయానికొస్తే.. ఇది ఓ పల్లెటూరిలో జరిగే ముగ్గురు యువకుల కథ. బండ్ల నరసంపల్లి అనే పల్లెటూర్లో ముగ్గురు స్నేహితులు బాధ్యతరాహితంగా తిరుగుతుంటారు. అంజి మామ అనే ఒక అతను వాళ్లని ఏదో ఒక పని చేయమని చెప్తాడు. దాంతో ఆ యువకులు టెంట్ హౌస్ బిజినెస్ పెడతారు. కానీ చివరకు ఆ వ్యాపారం కాస్త దెబ్బ తింటుంది. దాంతో ఆ ముగ్గురు యువకులలో ఒకడు బ్రతుకుతెరువు కోసం సిటీకి వెళ్తాడు. మిగిలిన ఇద్దరు యువకులు 'ఫేమస్ టీవీ' అనే యూట్యూబ్ ఛానల్ పెడతారు. ఆ యూట్యూబ్ ఛానల్ తో వాళ్ళు ఏం సాధించారు? వాళ్ళ ఊరిలో ఫేమస్ అవ్వడానికి ఏం పనులు చేశారు? చివరికి వాళ్ళు ఫేమస్ అయ్యారా? లేదా అనేదే ఈ సినిమా కథ.
Also Read: ఉదయనిధి, వడివేలు మూవీ ‘మామన్నన్’ వివాదానికి కారణం ఏమిటీ? కోర్ట్ ఏం చెప్పింది?
View this post on Instagram