అన్వేషించండి

Maamannan: ఉదయనిధి, వడివేలు మూవీ ‘మామన్నన్’ వివాదానికి కారణం ఏమిటీ? కోర్ట్ ఏం చెప్పింది?

‘మామన్నన్’ సినిమాను నిలిపివేయాలంటూ రామ శరవణన్ అనే సినిమా నిర్మాత కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ మూవీ రిలీజ్ పై గందరగోళం నెలకొంది. అయితే ఈ కేసుపై విచారించిన కోర్టు..

Maamannan: తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ రీసెంట్ గా నటించిన సినిమా ‘మామన్నన్’. ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 29న థియేటర్లలో విడుదల అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ ను నిలిపివేయాలని రామ శరవణన్ అనే సినిమా నిర్మాత కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ మూవీ రిలీజ్ పై గందరగోళం నెలకొంది. అయితే ఈ కేసుపై విచారించిన కోర్టు ‘మామన్నన్’ సినిమాను నిలిపివేయాలంటూ వచ్చిన పిటిషన్ పై కోర్టు స్పందించింది. మూవీపై ఎలాంటి నిషేదం విధించేది లేదని కోర్టు పేర్కొనడంతో ఈ వార్త ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. 

‘మామన్నన్’ సినిమా వివాదం ఏమిటి?

‘మామన్నన్’ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా ప్రమోషన్స్ లో ‘మామన్నన్‌’ తన చివరి సినిమా అని స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఇకపై సినిమాలు చేయనని, రాజకీయాల్లోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానంటూ ప్రకటించారు. అయితే రామశరవణన్ అనే నిర్మాత ఉదయనిధిపై మద్రాసు హై కోర్టులో కేసు వేశారు. ఆయన నిర్మాణంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా, ఆనంది, పాయల్ రాజ్‌పుత్ లు హీరోయిన్స్ గా కేఎస్‌.అదయమాన్‌ దర్శకత్వంలో ‘ఏంజెల్’ అనే సినిమాని రూపొందించారు. ఆ సినిమా ఇప్పటికే 80 శాతం పూర్తయిందని, కానీ ఇప్పుడు ఉదయనిధి ఇదే తన చివరి సినిమా అని ప్రకటించడంలో తాను నష్టపోతానని పిటిషన్ లో పేర్కొన్నారు. తాను ఈ సినిమా కోసం రూ.13 కోట్లు ఇప్పటికే ఖర్చు చేశానని, ఇప్పుడు ఉదయనిధి ఈ సినిమాను పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ మూవీ 2018లో మొదలైందని, చాలా ఖరీదైన ప్రదేశాల్లో షూటింగ్ చేశామని, ఇంకా 20 శాతం మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు ‘మామన్నన్’ రిలీజ్ ను నిలిపివేయాలని, తన సినిమాను పూర్తి చేశాకే ఆ సినిమా విడుదల చేయాలని పేర్కొన్నారు. అయితే దీనిపై విచారణ చేపట్టింది కోర్టు.. వివరణ ఇవ్వాలని హీరో ఉదయనిధి స్టాలిన్ ను ఆదేశించింది. రెడ్ జాయింట్ మూవీస్ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసింది. 

‘మామన్నన్’ సినిమాను విడుదలపై స్టే కుదరదు: హైకోర్టు

నిర్మాత రామశరవణన్ వేసిన పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు కేసును జూన్ 28కు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు ‘మామన్నన్’ సినిమా విడుదలపై మధ్యంతర స్టే విధించలేమని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఈ మూవీ పై వస్తోన్న చర్చలకు తెరపడినట్లైంది. అయితే ఇప్పుడు ఉదయనిధి ‘ఏంజెల్’ సినిమాను పూర్తి చేస్తారా లేదా అనే కొత్త చర్చ మొదలైంది. మామన్నన్‌ సినిమాను మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించింది. ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించారు. కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. వడివేలు, ఫహద్ ఫాసిల్, లాల్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: ఆస్కార్ కమిటీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి - మళ్ళీ కాలర్ ఎగరేసేలా చేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget