అన్వేషించండి

Yash On KGF2 vs Beast - Vijay: ఇది రాజకీయం కాదు - 'కె.జి.ఎఫ్' వర్సెస్ 'బీస్ట్' కామెంట్స్‌పై య‌ష్ రియాక్ష‌న్‌

KGF2 hero Yash reaction when he questioned about KGF2 vs Beast: విజయ్ 'బీస్ట్' ఏప్రిల్ 13న విడుదలకు సిద్ధమైతే... 14న 'కె.జి.యఫ్ 2' విడుదలకు రెడీ అయ్యింది. రెండు సినిమాల మధ్య పోటీపై యష్ ఏమన్నారంటే...

ఒకరితో ఒకరు పోటీ పడటానికి, సినిమాతో సినిమా పోటీ పడటానికి ఇది రాజకీయం కాదని కన్నడ స్టార్ హీరో యష్ వ్యాఖ్యానించారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'కె.జి.యఫ్ 2'. ఏప్రిల్ 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కంటే ఒక్క రోజు ముందు 'బీస్ట్' విడుదలకు సిద్ధమైంది. రెండూ పాన్ ఇండియా సినిమాలే.

'కె.జి.యఫ్ 2' వర్సెస్ 'బీస్ట్' అంటూ చాలా మంది కంపేర్ చేస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలో రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. బెంగళూరులో 'కె.జి.యఫ్ 2' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఈ కామెంట్స్ మీద యష్ స్పందించారు. 
"ప్రేక్షకుల ముందుకు రెండు సినిమాలు వస్తున్నాయి... 'కె.జి.యఫ్ 2' అండ్ 'బీస్ట్'. 'కె.జి.యఫ్ 2' వర్సెస్ 'బీస్ట్' కాదు. ఇవి ఎన్నికలు కాదు. ఎన్నికలు అయితే... ప్రతి ఒక్కరికీ ఒక్క ఓటే ఉంటుంది. ఆ ఓటు ఎవరో ఒకరికి వేయాలి. ఎక్కువ ఓట్లు వచ్చినవారు గెలుస్తారు. ఇంకొకరు ఓడిపోతారు. అందుకని, ఎన్నికల్లో పోటీ ఉంటుంది. సినిమాలకు వచ్చేసరికి ప్రేక్షకులు రెండు సినిమాలూ చూడొచ్చు. మాది పాన్ ఇండియా సినిమా. ఎనిమిది నెలల క్రితమే విడుదల తేదీ ప్రకటించాం. మాకు తెలియదు... విజయ్ సార్ సినిమా వస్తుందని! 'కె.జి.యఫ్ 2' వర్సెస్ 'బీస్ట్'గా చూడొద్దు. విజయ్ సార్ ఎన్నో ఏళ్లుగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నాకంటే సీనియర్స్ కంటే నేను పెద్దోడిని అనుకున్నప్పుడు నా డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. విజయ్ సార్ అభిమానులు ఆయన సినిమాను సెలబ్రేట్ చేసుకుంటారు. మా సినిమా కూడా వాళ్లకు నచ్చుతుందనే నమ్మకం ఉంది" అని యష్ చెప్పారు.

Also Read: 'నాకు ఎవడి దోస్తీ అక్కర్లేదు' - 'కేజీఎఫ్2' ట్రైలర్ వచ్చేసిందోచ్

"నేను చాలా సింపుల్ గా చెబుతా... ఒక ఛాట్ బండి దగ్గరకు వెళ్లి తిన్నారు. అది బావుంటే స్నేహితులకు చెబుతారు. దాని అర్థం వేరే బండి దగ్గర ఛాట్ తినొద్దని కాదు కదా! అక్కడా తింటారు. ఇంకో బండి దగ్గర కూడా తింటారు. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం మీద దృష్టి పెట్టాలి, పోటీ మీద కాదు" అని యష్ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన 'కె.జి.యఫ్ 2' కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

టాప్ హెడ్ లైన్స్

Imtiaz Ali Visits Hyderabad: హైదరాబాద్‌లో ఇంతియాజ్ అలీ... అభిమానులతో కలిసి 'మై వాపస్ ఆవుంగా' విజయోత్సవం
హైదరాబాద్‌లో ఇంతియాజ్ అలీ... అభిమానులతో కలిసి 'మై వాపస్ ఆవుంగా' విజయోత్సవం
Jayasudha: 'సమ్మర్ హాలిడేస్'లో సహజ నటి... అమ్మమ్మ పాత్రలో జయసుధ ఫస్ట్ లుక్ రిలీజ్
'సమ్మర్ హాలిడేస్'లో సహజ నటి... అమ్మమ్మ పాత్రలో జయసుధ ఫస్ట్ లుక్ రిలీజ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Balakrishna Health Bulletin: నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?
నిలకడగా బాలకృష్ణ ఆరోగ్యం... హెల్త్ బులిటిన్ రిలీజ్ చేసిన AIG Hospital... డాక్టర్లు ఏం చెప్పారంటే?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget