Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ వీడియోలో ఏముంది? ఎందుకు వైరల్ అవుతోంది?
Mrunal Thakur Viral Video: నెట్టింట మృణాల్ ఠాకూర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పుచ్చకాయ ముక్క తింటే అంత స్పెషల్ ఏముంది? అనుకుంటున్నారా! అసలు, వైరల్ కావడం వెనుక ఏముందో తెలుసుకోండి.
తెలుగు ప్రేక్షకులకు అందాల భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను చూస్తే వెంటనే సీత గుర్తుకు వస్తుంది. సీత అంటే రామాయణంలో సీత కాదు... దుల్కర్ సల్మాన్ సరసన హను రాఘవపూడి దర్శకత్వంలో నటించిన 'సీతా రామం'లో చేసిన సీత పాత్ర! తర్వాత 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్' సినిమాలు చేశారు. ఆ అమ్మాయి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఎందుకో తెలుసా?
View this post on Instagram
పుచ్చకాయ ముక్క తింటే అంత రచ్చ ఎందుకు?
మృణాల్ ఠాకూర్ వైరల్ వీడియోలో కాంట్రవర్సీ ఏమైనా ఉందా? అంటే... అసలు లేనే లేదు. పోనీ ఎక్స్‌పోజింగ్ ఏమైనా చేసిందా? అంటే... అదీ లేదు. ఫుల్ హుడీ టీ షర్ట్ వేసుకుని ఉంది. మరి, ఎందుకు వైరల్ అవుతుంది? అంటే... వీడియో చివరి వరకు చూస్తే గానీ అర్థం కాదు.
చాలా సేపు సస్పెన్స్ తర్వాత కానీ అర్థం కాలేదు!
మృణాల్ ఠాకూర్ పుచ్చకాయ తిన్నారు. అయితే, తినే సమయంలో సాయం చేసిన చేతులు మాత్రం ఆవిడవు కాదు. అవును... అది నిజమే! నోటిలోకి వెళ్లిన చేతులు మృణాల్ చేతులు కాదు. ఆవిడ వెనుక మరొక మహిళ ఉన్నారు, స్నేహితురాలు అట! మృణాల్ ఠాకూర్ సూచనలు ఇస్తుంటే... వెనుక ఉన్న మహిళ ఫాలో అవుతూ తినిపించారు.
Also Read: స్విమ్ సూట్ లో దిల్ రాజు కుమార్తె... నెట్టింట్ వైరల్ అవుతున్న ఫోటోలు చూశారా?
మృణాల్ వెనుక మరొక మహిళ ఉన్న సంగతి చాలా సేపటి సస్పెన్స్ తర్వాత గానీ జనాలకు అర్థం కాలేదు. దాంతో మృణాల్ ఠాకూర్ మీద కొందరు ట్రోల్స్ చేస్తుంటే... మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. అదీ సంగతి!
Also Read: హను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ రోల్ అదేనా - ఎన్టీఆర్, బన్నీ తర్వాత ఆ లిస్టులోకి రెబల్ స్టార్!?
Chalasepu suspense tarvata naaku Ardhamaindhi!!pic.twitter.com/Zv5ddcg50N
— Milagro Movies (@MilagroMovies) July 23, 2024
ఏం జరుగుతుంది రా ఇక్కడ 😶🌫️😳 pic.twitter.com/FMJvvT9EwF
— Movies4u Official (@Movies4u_Officl) July 23, 2024