Ranveer Singh - Urfi Javed : రేప్ చేస్తామన్నారు, చంపేస్తామన్నారు! రణ్‌వీర్‌ను సపోర్ట్ చేయడానికి నన్ను లాగడం ఎందుకు? - ఉర్ఫీ జావేద్
రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వైరల్ కావడం, ఆయనపై ఓ స్వచ్ఛంద సంస్థ కేసు వేయడం తెలిసిందే. రణ్‌వీర్ చేసింది తప్పు అయితే ఉర్ఫీ జావేద్ చేసేది ఏంటి? అంటూ కొందరు కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు.
![Ranveer Singh - Urfi Javed : రేప్ చేస్తామన్నారు, చంపేస్తామన్నారు! రణ్‌వీర్‌ను సపోర్ట్ చేయడానికి నన్ను లాగడం ఎందుకు? - ఉర్ఫీ జావేద్ Why are you dragging me to support Ranveer Singh, Urfi Javed slams Ranveer supporters netizens for comparing her photos with Hero Nude Photoshoot Ranveer Singh - Urfi Javed : రేప్ చేస్తామన్నారు, చంపేస్తామన్నారు! రణ్‌వీర్‌ను సపోర్ట్ చేయడానికి నన్ను లాగడం ఎందుకు? - ఉర్ఫీ జావేద్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/27/5acd97803b878e973880e2b6d54723c21658892196_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ (Ranveer Singh Nude Photoshoot) తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆయన ట్రెండ్ ఫాలో అవుతూ తమిళ హీరో విష్ణు విశాల్, తెలుగులో నటుడు నందు సెమీ న్యూడ్ ఫోటోషూట్స్ చేశారు. మొత్తం మీద రణ్‌వీర్ ఫోటోలు వైరల్ అయ్యాయి. కొంత మంది ఆయన చేసిన పని ఏమాత్రం బాలేదని కామెంట్స్ చేస్తే... కొందరు సపోర్ట్ చేశారు. ఒక స్వచ్ఛంద సంస్థ అయితే ఆయనపై కేసు వేసింది.
రణ్‌వీర్ మీద కేసు వేయడంతో ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు చేయడం స్టార్ట్ చేశారు. అందులో ఒకరు ఉర్ఫీ జావేద్ (Urfi Javed) ఫోటోల ప్రస్తావన తీసుకు వచ్చారు. రణ్‌వీర్ న్యూడ్ ఫోటో షేర్ చేసి... ''ఈ ఫోటోషూట్ మనోభావాలను దెబ్బ తీస్తే? ఉర్ఫీ జావేద్ ఫోటోషూట్స్ ఎందుకు మనోభావాలను గాయపరచడం లేదు?'' అంటూ ప్రశ్నించారు. దుస్తులు ధరించకుండా కేవలం పువ్వులను మాత్రమే అడ్డుపెట్టుకుని ఉర్ఫీ జావేద్ దిగిన ఫోటోలను షేర్ చేశారు. మనోభావాల విషయంలో లింగ వివక్ష చూపించకూడదని పేర్కొన్నారు.
Also Read : నేను వైఎస్సార్ అభిమానినే కానీ కమ్మ, కాపులను తిట్టలేదు - నితిన్ దర్శకుడు
Urfi Javed On Ranveer Singh Nude Photoshoot Controversy: ''వివాదంలోకి నన్ను లాగకుండా రణ్‌వీర్‌కు ప్రజలు మద్దతు తెలుపవచ్చు. ఇక్కడ అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే... జాలి, దయ, కనికరం లేకుండా నన్ను ట్రోల్ చేశారు. రేప్ చేస్తామని బెదిరించారు. చంపేస్తామన్నారు. ఇప్పుడు అందరూ ఈ ప్రపంచం నన్ను చక్కగా చూసుకున్నట్టు చెబుతున్నారు. నేనూ ట్రోలింగ్ ఎదుర్కొన్నాను. రణ్‌వీర్‌కు వ్యతికరేకంగా ఒక స్టుపిడ్ ఎన్జీవో కేసు వస్తే... ఈ వివాదంలోకి అందరూ నన్ను ఎందుకు లాగుతున్నారు? ఇది మీ హిపోక్రసీ చూపిస్తోంది'' అని ఉర్ఫీ జావేద్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు (Urfi Javed Slams Netizens).
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)