By: ABP Desam | Updated at : 24 Jun 2022 05:48 PM (IST)
అనసూయ భరద్వాజ్
స్టార్ యాంకర్, ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో 'పేపర్ బాయ్' ఫేమ్ జయ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'అరి'. నో బడీ నోస్... అనేది ఉపశీర్షిక. ఇందులో సాయి కుమార్, 'వైవా' హర్ష, 'శుభలేఖ' సుధాకర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ రోజు టైటిల్ లోగో విడుదల చేశారు.
అన్నట్టు... 'అరి' అంటే మీనింగ్ ఏంటో తెలుసా? 'శత్రువు' అని దర్శకుడు జయ శంకర్ చెప్పారు. అరి అనేది సంస్కృత పదం అన్నారు. అనసూయ శత్రువు ఎవరనేది సినిమాలో చూడాలన్నమాట.
'అరి' సినిమా గురించి అనసూయ మాట్లాడుతూ ''లాక్‌డౌన్‌లో జూమ్‌లో ఈ సినిమా కథ విన్నాను. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో అద్భుతమైన కంటెంట్ బేస్డ్ సినిమాలు చూసినప్పుడు... 'మన దగ్గర ఇటువంటివి ఎందుకు రావు?' అనిపించేది. ఈ కథ విన్నాక మనమూ అటువంటి సినిమాలు తీయగలమని అనిపించింది. ఇందులో హ్యూమానిటీతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వుంది. నా కోసం క్యారెక్టర్లు రాయడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు. మనిషి ఎలా బతకకూడదో చూపించే చిత్రమిదని నిర్మాతలు చెప్పారు.
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
ఈ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి, 'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, 'ఉప్పెన' దర్శకుడు సానా బుచ్చిబాబు, మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్, 'చమ్మక్' చంద్ర, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Also Read : చోర్ బజార్ సినిమా రివ్యూ: బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా? లేదా?
Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!
Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!
Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
Taapsee Pannu : నా శృంగార జీవితం ఆయనకు ఆసక్తికరంగా అనిపించలేదు ఏమో!? - తాప్సీ పన్ను
Samantha: సమంతకి క్రేజీ ఛాన్స్ - డేట్స్ అడ్జస్ట్ చేయగలదా?
Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!
Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!
Lakshya Sen Wins Gold: బ్యాడ్మింటన్‌లో రెండో స్వర్ణం - మొదట సింధు, ఇప్పుడు లక్ష్యసేన్
AP ICET 2022 Results: ఏపీ ఐసెట్ - 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి!