Ram Charan: ఆ రింగ్ ఏమైంది? ఆ చేప ఎక్కడుంది? సమాధానం చెప్పాల్సింది అతనేనంటోన్న గ్లోబల్ స్టార్!
Ram Charan: ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీ రిలీజ్ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఈ చిత్ర యూనిట్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన సమాధానం ఎవరి వద్ద ఉందో చెప్పేశారు.

Ram Charan: ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా పేరు వినబడిన ప్రతిసారి, సీక్వెల్ ఎప్పుడు? సీక్వెల్‌లోఎవరు నటిస్తారు? అనే డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా 35 సంవత్సరాలను పురస్కరించుకుని, సరికొత్తగా థియేటర్లలో రీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా విడుదలైన రోజునే అంటే, మే 9వ తేదీనే ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చేస్తున్న ప్రమోషన్స్‌లో ఈ సినిమా సీక్వెల్ ప్రస్తావన మరోసారి వచ్చింది. చిరంజీవి కూడా ఈ సీక్వెల్‌పై మాట్లాడారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఇంటర్వ్యూ మధ్యలో వీడియో బైట్ ద్వారా మాట్లాడుతూ.. ఈ సినిమా సీక్వెల్ ప్రస్తావన తెచ్చారు. ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా అనేది ఓ డ్రీమ్ టీమ్. చిరంజీవి, శ్రీదేవీ, అశ్వనీదత్, రాఘవేంద్రరావు, ఇళయరాజా, విన్సెంట్, యండమూరి ఇలా మహామహులంతా కలిసి ఈ మూవీని చేశారు. మళ్లీ ఇలాంటి ఓ టీమ్ కలిసి ఇలాంటి ఓ క్లాసిక్ మూవీని తీయలేదు. ఇకపై తీయలేరు కూడా. మా జనరేషన్‌కు డ్రీమ్ టీమ్ అంటే ఇదే. ఈ చిత్రంలో చివరిలో చూపించిన రింగ్ ఏమైంది? ఆ చేప ఎక్కడుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది మాత్రం నాగ్ అశ్వినే. ఇది రిక్వెస్ట్ కాదు.. ఇది మా డిమాండ్ అని చరణ్ అనడం చూస్తుంటే.. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ ఉండే అవకాశం అయితే లేకపోలేదు.
Also Read: సుక్కు చేయలేనిది... రాజమౌళి చేశాడు... మహేష్ కెరీర్‌లో ఇదొక మైల్ స్టోన్ మూమెంట్
ఇక ఈ సినిమా గురించి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. సినిమాలో హీరోయిన్ ఇంద్రలోకం నుంచి భూలోకం వస్తుంది. కానీ ఇప్పుడు రీ రిలీజ్ అంటే మేం మళ్లీ ఇంద్రలోకానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా కంటే ముందు నేను చేసిన మూడు చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. నా పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఆ టైమ్‌లోనే దత్ నాకు ఓ లైన్ వినిపించారు. నేను ఫ్లాపుల్లో ఉన్నా కూడా నన్ను నమ్మి చిరంజీవి, దత్ ఈ అవకాశం ఇచ్చారు. వారికి ఎప్పుడూ రుణ పడి ఉంటాను. సినిమా పరిశ్రమలో ఇళయరాజా కొత్త సౌండింగ్‌ను తీసుకు వచ్చారు. ఇళయరాజా జగదేక వీరుడు.. ఆయన సంగీతం అతిలోక సుందరి. నేను ఎన్టీ రామారావుతో 12 చిత్రాలు చేశాను. కానీ చిరంజీవితో 14 సినిమాలు చేశాను.
‘అందాలలో అహో మహాదయం’ పాట నాకు ఎప్పుడూ కళ్లలోనే మెదులుతుంది. ఆ పాటలో ఒక మానవుడిని, ఒక దేవతను చూపించారు. ఇళయరాజా తన మ్యూజిక్‌తో అద్భుతం చేశారు. న్యాయంగా అయితే ఈ మూవీని కాశ్మీర్‌లో తీయాలి. విన్సెంట్ కథ విని అంతా వాహినీ స్టూడియోలోని 8వ ఫ్లోర్‌లోనే తీయవచ్చని చెప్పారు. చలం వేసిన సెట్‌లకు విన్సెంట్ మెరుపులు దిద్దారు. ఒక్క గ్రాఫిక్ షాట్ కూడా వాడకుండా విన్సెంట్ కెమెరా పనితనాన్ని చూపించారు. ఇలాంటి చిత్రాన్ని మళ్లీ తీయలేం.. ఇలాంటి హిట్‌ను మళ్లీ కొట్టలేం. భయంకరమైన తుఫాన్ వచ్చినా, థియేటర్లన్నీ నీళ్లతో నిండినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూసి బ్లాక్ బస్టర్ చేశారు. ఈ చిత్రం కంటే ఎన్నో సినిమాలు ఎన్నో రెట్లు కలెక్షన్స్ సాధించి ఉండొచ్చు. కానీ తుఫాను రావాలి.. అలాంటి పరిస్థితుల్లో సినిమా వచ్చి హిట్టు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఆ టైమ్‌లో ఈ మూవీని మూడు సార్లు చూడాలని ప్రేక్షకులు చెబుతుండేవారు. ఒకసారి చిరంజీవి కోసం, ఇంకోసారి శ్రీదేవీ కోసం.. మూడో సారి ఈ ఇద్దరూ ఎలా చేశారు? అని చూడాలని అప్పట్లో ప్రేక్షకులు చెబుతుండేవారు. మళ్లీ నేను ఈ మూవీని ఫ్రెష్‌గా మే 9న చూస్తాను. ఆ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌ను మళ్లీ ఆస్వాదించాలని ఉందని అన్నారు.
Also Read: నానికి జోడీగా కాయదు లోహర్... ఇద్దరూ నటించబోయే సినిమా ఏదో తెలుసా?





















