Allu Arjun: అల్లు అర్జున్ నుంచి అవార్డు తీసుకోడానికి నిరాకరించిన నయనతార, ఆమె ఎందుకు అలా చేసింది?
ఏదైనా సంఘటన జరిగితే.. పాత విషయాలు, కాంట్రవర్సీలు మళ్లీ బయటికి వస్తాయి. అప్పుడు కూడా ఇలా జరిగింది అంటూ చర్చించుకుంటారు. ఇప్పుడు నయనతార, అల్లు అర్జున్ విషయం అలానే వైరల్ అవుతుంది.
Nayanthara refused to accept award from Allu Arjun saying: ఏదైనా కాంట్రవర్సీ జరిగినా, సంఘటన జరిగినా వెంటనే దానికి సంబంధించి గతంలో జరిగిన విషయాలు మళ్లీ వెలుగులోకి వస్తాయి. గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ వైరల్ అవుతాయి. అలా ఇప్పుడు అల్లు అర్జున్, నయనతార మధ్య జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు తీసుకునేందుకు నయనతార నో చెప్పారు. ఆ విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒక ఆడియో ఫంక్షన్ లో ఆసిఫ్ అలీ చేతుల మీదిగా అవార్డు తీసుకునేందుకు రమేశ్ నారాయణ నో చెప్పడంతో దుమారం రేగింది. దీంతో గతంలో జరిగిన ఆ విషయం గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు.
నయనతార, అల్లు అర్జున్ ఇష్యూ ఏంటంటే?
2016లో నయనతార, అల్లు అర్జున్ ఇష్యూ జరిగింది. 2016లో నిర్వహించిన ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ అవార్డు ఇస్తుండగా నయనతార తీసుకోలేదు. నయనతార భర్త విగ్నేశ్ శివన్ డైరెక్షన్ లో ఆమె హీరోయిన్ గా వచ్చిన సినిమా 'నానుమ్ రౌడీదాన్'. ఆ సినిమాలో ఆమె యాక్టింగ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. కానీ ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఇక నయన తారకి అవార్డు ఇచ్చేందుకు అల్లు అర్జున్ ని స్టేజ్ పైకి పిలిచారు. అయితే, నయనతార ఆయన నుంచి అవార్డు తీసుకునేందుకు నిరాకరించారు. ఆ అవార్డును సినిమా డైరెక్టర్ చేతుల మీదగా తీసుకుంటాను అని అన్నారు. “మీరు ఏమీ అనుకోను అంటే.. నేను ఈ అవార్డును 'నానుమ్ రౌడీదాన్' (తెలుగులో ‘నేను రౌడి’గా విడుదలైంది) సినిమా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (ప్రస్తుతం ఆమె భర్త) చేతుల మీదుగా తీసుకుంటాను” అని అన్నారు. దీంతో అప్పట్లో అది పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ నయనతార మీద సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్‌ను అవమానించింది అంటూ ఆమెపై విమర్శలు చేశారు.
ఇప్పుడు ఏమైందంటే?
ఈ మధ్య కూడా ఇలాంటి ఘటనే జరిగిన విషయం తెలిసిందే. ‘మనోరతంగల్’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రమేశ్ నారాయణ్ అనే మ్యూజిక్ కంపోజర్ అసిఫ్ అలీ చేతుల మీదుగా అవార్డు తీసుకునేందుకు ఒప్పుకోలేదు. ఆయన ఆ అవార్డును తిరస్కరించడంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ సంఘటన దుమారం రేపుతోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప - 2' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్ లో రానుంది ఈ సినిమా. ఇప్పటికే 'పుష్ప' సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే 'పుష్ప - 2' టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 2కి వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఇక నయనతార విషయానికొస్తే ఆమె కూడా సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. 'టెస్ట్' సినిమాలో ఆమె మాధవన్ సరసన నటిస్తున్నారు. దాంతో పాటుగా 'డియర్ స్టూడెంట్స్' అనే మలయాళం సినిమా చేస్తున్నారు. నివిన్ పౌల్ సరసన నటిస్తున్నారు నయనతార.
Also Read: భారీగా పెరగనున్న సినిమా టికెట్‌ల ధరలు, OTT సబ్‌స్క్రిప్షన్‌లపైనా అదనపు భారం