అన్వేషించండి

Chiranjeevi AD: ఊరికినే మెగాస్టార్ అయిపోరు... నెట్టింట వైరల్ అవుతున్న చిరంజీవి కొత్త యాడ్

Chiranjeevi Country delight Ad: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరీష్ శంకర్ డైరెక్షన్ చేసిన ఈ యాడ్ లో చిరు లుక్ అదిరిపోయింది.

వినాయక చవితి సందర్భంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ పోస్టర్ మెగా అభిమానులకు ఫీస్ట్ గా నిలిచింది. అయితే అంతకంటే ఎక్కువ సంతోషాన్నిచ్చే వీడియో  ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరంజీవి చేసిన ఓ అడ్వర్టైజ్ మెంట్ ట్రెండింగ్ లోకి వచ్చింది. మిల్క్ బ్రాండ్ కోసం చిరు ఈ యాడ్ చేశారు. హరీష్ శంకర్ దీనికి డైరెక్టర్. ఈ యాడ్ లో చిరు పర్ఫామెన్స్ అదుర్స్ అంటున్నారు. కమర్షియల్ యాడ్ సంగతి పక్కనపెడితే... ఇది అభిమానులకు విజువల్ ఫీస్ట్ లా ఉంది. ఊరికినే మెగాస్టార్ అయిపోరు అంటూ చివర్లో వినిపించే డైలాగ్ ఈ యాడ్ కే హైలైట్. 

మిల్క్ బ్రాండ్ అడ్వర్టైజ్ మెంట్ ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. అడ్వర్టైజ్ మెంట్ మేకింగ్ నే ఫైనల్ యాడ్ గా ప్రజెంట్ చేశారు. ఇందులో తన డైలాగ్ వెర్షన్ ప్రిపేర్ అవుతుంటారు చిరంజీవి. ఒరిజినల్ యాడ్ తీసింది దర్శకుడు హరీష్ శంకర్ అయితే, ఈ యాడ్ లో కనిపించే యాడ్ ఫిలిం మేకర్ కమెడియన్ సత్య.

సత్య షాట్ రెడీ అనగానే చిరంజీవిలో నుంచి ఆత్మారావు బయటకొస్తాడు. ఈ ఆత్మారావు మనకు అన్నయ్య సినిమాలో కనపడతాడు. అన్నయ్య మూవీలో కామెడీని ఓ రేంజ్ కి తీసుకెళ్లింది ఈ ఆత్మారావే. సరిగ్గా ఆ క్యారెక్టర్ ని ఇక్కడ యాడ్ కోసం వాడుకున్నారు. యాడ్ లో నటించే చిరంజీవి క్లాస్ గా ఉంటే, ఆత్మారావుది మాస్ క్యారెక్టర్. గీతల చొక్కా, లుంగీ, కళ్లద్దాలు పెట్టుకుని ఆత్మారావు ఎంట్రీ ఇస్తాడు. వీరిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ లోనే పాల బ్రాండ్, దాని గొప్పదనం, పాలను బుక్ చేసుకునే యాప్... అన్ని వివరాలు చెప్పించారు. 

ఇప్పటి వరకు మనం సగటు కమర్షియల్ యాడ్స్ చాలానే చూసి ఉంటాం. చిరంజీవి చేసిన యాడ్స్ కూడా చాలానే చూశాం. కానీ వాటన్నిటికీ డిఫరెంట్ గా ఈ యాడ్ ఉంది. అందులోనూ ఇద్దరు మెగాస్టార్స్ స్క్రీన్ పై కనపడి చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంది. కేవలం 60 సెకన్ల యాడ్ గురించి మనం ఇంతలా మాట్లాడుకుంటున్నామంటే... అది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో చిరంజీవి పర్ఫామెన్స్, ఆయన్ను హరీష్ శంకర్ బాగా చూపించారని అభిమానులు అంటున్నారు.

Also Readతమ్ముడికి తారక్ వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవలు అంటూ వచ్చే పుకార్లకు చెక్!

మెగాస్టార్ వరుస సినిమాలు చేస్తున్నా ఆయన్నుంచి అభిమానులు ఇంకా ఏదో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆమధ్య వచ్చిన వాల్తేరు వీరయ్య ఆ లోటుని కాస్త భర్తీ చేసింది. ఇప్పుడీ యాడ్ లో చిరంజీవి స్టైల్, గ్రేస్, మాస్ క్యారెక్టరైజేషన్ అభిమానులకు బాగా నచ్చాయి. అన్నయ్యను తాము ఇలాగే స్క్రీన్ పై చూడాలనుకుంటున్నామని, ఈ విషయంలో హరీష్ శంకర్ కి థ్యాంక్స్ అని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. చిరంజీవి తమ బ్రాండ్ కి ప్రచారం కల్పించడం ఒక ఎత్తు అయితే, దానికి ఈ స్థాయిలో ఫ్రీ ప్రమోషన్ రావడం నిజంగా ఆ సంస్థకు డబుల్ బొనాంజా అనే చెప్పాలి. 

Also Read: ట్రోలింగ్‌ను తట్టుకుని మరీ ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర సాంగ్... ఎన్టీఆర్ పవర్ అంటే ఇదీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Embed widget