అన్వేషించండి

Vishwak Sen: లారీపై నుంచి కిందపడ్డ విశ్వక్ సేన్ - ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ షూటింగ్‌లో అపశృతి

ప్రస్తుతం విశ్వక్ సేన్.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో తనకు యాక్సిడెంట్ అవ్వడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

మామూలుగా సినిమా షూటింగ్స్‌లో ప్రమాదాలు జరగడం చాలా కామన్. కొందరు నటీనటులు అయితే వారికి తగిలే గాయాలను కూడా పట్టించుకోకుండా సినీ నిర్మాతలకు నష్టం కలగకూడదు అనే ఉద్దేశ్యంతో షూటింగ్‌ను కొనసాగిస్తారు. కానీ కొందరికి తగిలే గాయాల కారణంగా కొన్ని నెలలపాటు షూటింగ్స్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు కూడా తన అప్‌కమింగ్ మూవీ షూటింగ్‌లో గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాలికి గాయం..
ప్రస్తుతం విశ్వక్ సేన్.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం షూటింగ్‌లో విశ్వక్ సేన్ బిజీగా ఉన్నాడు. డిసెంబర్ మొదట్లోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీ విడుదల చేయాలని విశ్వక్ నిర్ణయించుకున్నాడు. అందుకే మిగిలిన షూటింగ్‌ను వెంటవెంటనే పూర్తి చేయాలనుకుంటున్నాడు. అదే క్రమంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలోని ఒక యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్న క్రమంలో విశ్వక్‌కు గాయాలయ్యాయి. ఇది జరిగి కొన్నాళ్లు గడిచినా.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లారీ మీద నుండి కిందకు దూకే క్రమంలో విశ్వక్ బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. దాని వల్ల తన కాలికి గాయాలయ్యాయని సమాచారం.

నేహా శర్మతో జోడీ..
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ షూటింగ్ సమయంలో విశ్వక్ సేన్‌కు గాయాలు కావడంతో తనను ఆసుపత్రిలో చేర్చారని, కొన్నిరోజులు ఆసుపత్రిలోనే ఉన్నాడని సమాచారం. విశ్వక్‌ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చేశాడని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మళ్లీ యథావిధిగా షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాడట విశ్వక్. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాన్ని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు. ‘డిజే టిల్లు’ సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న నేహా శర్మ.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం విశ్వక్‌తో జతకడుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన టీజర్, పోస్టర్స్, పాటల్లో నేహా శర్మ గ్లామర్‌కు మరోసారి యూత్ ఫిదా అయిపోతున్నారు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తర్వాత ‘గామి’..
విశ్వక్ హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం చాలాకాలం తర్వాత టాలీవుడ్‌కు తిరిగొస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. డిసెంబర్‌లో ఈ మూవీ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత పలు కారణాల వల్ల మూవీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేయాలని ఒత్తిడిలు పెరిగాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు అనుకున్న డేట్‌కే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని విశ్వక్ శపథం చేశాడు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా ప్రకటించింది. అయితే ముందు అనుకున్న రోజుకే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ని రిలీజ్ చేస్తానని లేకపోతే ఇంకెప్పుడు ప్రేక్షకుల ముందుకు రానని సీరియస్‌గానే పోస్ట్ చేశాడు. దీంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విషయంలో విశ్వక్ సేన్ చాలా సీరియస్‌గా ఉన్నాడని అర్థమవుతోంది. ఇక తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ షూటింగ్ పూర్తవ్వడంతో తన తరువాతి చిత్రం ‘గామి’ షూటింగ్‌ను ప్రారంభించాడు విశ్వక్ సేన్. కానీ తన ఫ్యాన్స్ మాత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రమోషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: LCU ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ - లోకేష్ కనగరాజ్ నుంచి ఇది అస్సలు ఊహించలేదే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget