Manchu New Movie Ginna Controversy: తిరుమల కొండపై ‘జిన్నా’ టైటిల్, వివాదంలో మంచు విష్ణు సినిమా టైటిల్ - బీజేపీ నేతలు ఆగ్రహం
విష్ణు మంచు కొత్త సినిమా టైటిల్ 'జిన్నా' వివాదంలో చిక్కుకుంది. టైటిల్ వెల్లడికి తిరుమల కొండలను ఎంపిక చేసుకోవడం కూడా వివాదాస్పదం అవుతోంది.
'దేశద్రోహి జిన్నా పేరుతో సినిమా తీయడం ఏమిటి?' అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజకీయ నాయకులు మాత్రమే కాదు... స్వాతంత్య్ర సమరయోధులు, దేశభక్తి కల ఉన్నవారు సైతం 'జిన్నా' పేరుతో సినిమా రూపొందిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమాకు 'జిన్నా' (Ginna Movie) టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో హీరో పేరు గాలి నాగేశ్వరరావు. దానిని షార్ట్ కట్‌లో 'జిన్నా' చేశారు. తిరుమల తిరుపతి ఏడుకొండల మధ్య నుంచి టైటిల్ లోగో వస్తున్న విజువల్స్ చూపించారు. దీనిపై హిందుత్వ వాదులు, దేశభక్తి కల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
''మహమ్మద్ అలీ జిన్నా ఎవరు? దేశ విభజనకు కారకుడు. ఐదు వేల మంది ఊచకోతకు కారకుడు. వేలకోట్ల రూపాయల లూటీకి కారకుడు. భారత దేశానికి ద్రోహం చేసినటువంటి మత ఛాందసవాది. అటువంటి జిన్నా పేరుతో సినిమా తీయడం ఏమిటి? హిందువుల పవిత్ర క్షేత్రం తిరుమల కొండను టైటిల్ లోగో విడుదలకు నేపథ్యంగా వాడతారా? దేశద్రోహి పేరుతో సినిమా తీయాల్సిన గత్యంతరం ఏమిటి?'' అని బీజేపీ నాయకుడు సామంచి శ్రీనివాస్ ప్రశ్నించారు.
విష్ణు మంచు చరిత్ర తెలుసుకోవాలని సామంచి శ్రీనివాస్ సలహా ఇచ్చారు. 'జిన్నా' కారణంగా ప్రాణాలు - మానాలు కోల్పోయిన హిందువుల గురించి తెలుసుకోవాలని అన్నారు. విష్ణు మంచుకు టంగుటూరి ప్రకాశం పంతులు, కందుకూరి వీరేశలింగం గారు తెలియదని ఎద్దేవా చేశారు.
'జిన్నా' టైటిల్ లోగో విడుదలకు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండలను ఉపయోగించడం వల్ల జరిగే పరిణామాలకు విష్ణు మంచు బాధ్యత వహిస్తారా? అని సామంచి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. ఆ పేరుతో సినిమా తీయడం మానుకోవాలని చెప్పారు.
Also Read: 'అంటే సుందరానికీ' రివ్యూ: కామెడీలో సిక్సర్ - మరి కథ? నాని, నజ్రియా సినిమా ఎలా ఉందంటే?
'జిన్నా' పేరు వింటే పాకిస్తాన్ నేత గుర్తుకు వస్తారు. విష్ణు మంచు కూడా దీనిని ముందుగా ఊహించినట్టు ఉన్నారు. ''ఇదేమైనా పాకిస్తాన్ మీద సినిమానా? మహ్మద్ అలీ జిన్నా గారి గురించా?'' అని ఆయన ప్రశ్నించారు. అందుకు బదులుగా ''ఇది అచ్చమైన స్వచ్ఛమైన తిరుపతి సినిమా. హీరో పేరు గాలి నాగేశ్వరరావు'' అని కోన వెంకట్ చెప్పారు. ''హీరోకి కూడా తన పేరు అస్సలు నచ్చదు. అందుకే, చిన్నగా మార్చి 'జిన్నా' అని పెట్టుకున్నాడు'' అని కోన చెప్పారు. వివరణ ఇవ్వడానికి ట్రై చేశారు. ఈ వివరణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాళ్ళకు సంతృప్తి ఇచ్చినట్టు లేదు.
Also Read: 'కిన్నెరసాని' రివ్యూ: కళ్యాణ్ దేవ్ అండ్ టీమ్ సర్‌ప్రైజ్ చేసింది, ఈ సినిమా ఎలా ఉందంటే?