News
News
వీడియోలు ఆటలు
X

enemy teaser: నీ కోసం అన్నీ తెలిసిన మిత్రుడే ప్రమాదకరమైన శత్రువు

సినిమాల్లో కొన్ని కాంబినేషన్ల పేర్లు వింటేనే ఓ పాజిటివ్ టాక్ వస్తుంది. అలాంటి కాంబో విశాల, ఆర్య. నిజ జీవితంలో మంచి స్నేహితులైన వీళ్లద్దరు తెరపై ఫ్రెండ్సా... ఎనిమీసా?... ఇంతకీ ఇందులో ఎనిమీ ఎవరు?

FOLLOW US: 
Share:

నీ గురించిన తెలిసిన స్నేహితుడే ప్రమాదకరమైన విలన్... అంటున్నాడు ప్రకాశ్‌ రాజ్. ఆర్య, విశాల్ కలిసి నటిస్తున్న మరో మూవీ ఎనిమీ. ఆనంద్‌ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ బేనర్‌పై వినోద్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గద్దల కొండ గణేష్‌ ఫేమ్‌ మృణాళిని రవి, మమతా మోహన్ దాస్ హీరోయిన్లుగా నటిస్తోన్నారు. 

ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. 100 సెకన్ల టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. యాకన్, సస్పెన్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా రాబోతోందీ సినిమా.   

టీజర్ రిలీజ్‌ అయిన గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీనిపై సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో విశాల్‌కు ప్రత్యేక మార్కెట్‌ ఉన్న సంగతి తెలిసిందే. 

త‌మిళ ఇండ‌స్ట్రీలో ఆర్య, విశాల్ చాలా మంచి స్నేహితులు. గతంలో వీరిద్దరూ కలిసి బాల దర్శకత్వంలో వాడు-వీడు సినిమా చేశారు. అద్భుతమైన యాక్టింగ్‌తో ఆ సినిమాలో అదరగొట్టారు. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి కాంబో తెరపై చూడబోతున్నాం.

">

ఇద్దరు స్నేహితులా.. శత్రువులా... ఇందులో విలన్ ఎవరు... హీరో ఎవరు అనే సస్పెన్స్‌ కంటిన్యూ చేస్తూ టీజర్ ఎండ్ చేశారు. ప్ర‌పంచంలోనే ప్ర‌మాద‌క‌ర‌మైన శ‌త్రువు ఎవ‌రో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే అని విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ చెప్పడం... ఆ తర్వాతే విశాల్, ఆర్య ఒకరినొకరు చూసుకుంటూ కలబడే సీన్ కనిపిస్తుంది. ఆ తర్వాతే ఎనిమీ టైటిల్ పడుతుంది. 

నిమిషం నలభై సెకన్ల వీడియో భారీ యాకన్ ఎపిసోడ్స్‌ చూపించారు. సినిమా మొత్తం ఫారిన్ బ్యాక్ డ్రాప్‌లో తీసినట్టు తెలుస్తోంది. లుక్‌ అలానే ఉంది. ఆర్య వేసుకున్న డ్రెస్‌పై చాంగీ ప్రిజన్ అని రాసి ఉంది. దీన్ని సింగపూర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నట్టు ఈ పేరు చూస్తే అర్థమవుతుంది. 

ఇందులో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలా కనిపిస్తున్నాడు ఆర్య. పోలీసులు ఛేజ్ చేయడం... వారి నుంచి ఆర్య తప్పించుకుంటూ ఫైర్ చేస్తుండటం గమనించవ్చు. ఈ టీజర్ మొత్తం విశాల్‌, ఆర్య ఎవరినో ఛేజ్ చేస్తూనే ఉంటారు. మొదటి సీన్‌లో కనిపించిన ఆర్య మళ్లీ 47 సెకన్ల వద్ద కనిపిస్తాడు. అయితే స్క్రీన్‌పై కనిపిస్తున్న ఆర్యను చూసి అక్కడి ప్రజలు ఏదో అరుస్తుంటారు. అదే డ్రెస్‌తో 53 సెకన్ల వద్ద ఎవరినో కసిదీరా పొడుస్తూ చూడొచ్చు.

 టీజర్‌లో ఎక్కువ ఆర్యపైనే ఫోకస్ పెట్టారు. లాస్ట్‌లో వచ్చే ఏమోషన్ల సీన్స్‌లో మాత్రమే విశాల్‌ను ఎక్కువ చూపించారు.  సినిమాలో మమతా మోహన్ దాస్ ప్లాష్ బ్యాక్ సీన్స్‌లో కనిపించబోతున్నట్టు టీజర్‌లోని  సీన్స్ చూస్తే అర్థమవుతుంది. 

Published at : 25 Jul 2021 11:16 AM (IST) Tags: Vishal arya enemy cinema news

సంబంధిత కథనాలు

Ileana Babymoon : డెలివరీకి ముందు పార్ట్‌నర్‌తో హాలిడేకి వెళ్లిన ఇలియానా!

Ileana Babymoon : డెలివరీకి ముందు పార్ట్‌నర్‌తో హాలిడేకి వెళ్లిన ఇలియానా!

Trivikram: సెంటిమెంట్‌ను ఫాలో అవ్వని త్రివిక్రమ్ - ‘గుంటూరు కారం’ ఫలితం ఎలా ఉంటుందో?

Trivikram: సెంటిమెంట్‌ను ఫాలో అవ్వని త్రివిక్రమ్ - ‘గుంటూరు కారం’ ఫలితం ఎలా ఉంటుందో?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!

టాప్ స్టోరీస్

Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Balineni Meet Jagan :  సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్‌- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్

వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్‌- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

తెలంగాణ ఉద్యమంలో గర్జించిన జానపదం- జనాల్ని కదిలించిన పాటలు

తెలంగాణ ఉద్యమంలో గర్జించిన జానపదం- జనాల్ని కదిలించిన పాటలు