News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

విజయ్ సేతుపతి కుటుంబానికి బెదిరింపులు - అందుకే ఆయన అలా చేశారు: ముత్తయ్య మురళీధరన్

ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా '800' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య మురళిధరన్ ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించారు.

FOLLOW US: 
Share:

లెజెండరీ క్రికెటర్, శ్రీలంకన్ ప్లేయర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా '800' అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎం.ఎస్ శ్రీపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్ గా 'స్లమ్ డాగ్ మిలీనియర్' ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. అలాగే మది మల్లర్ పాత్రలో మహిమ నంబియార్ కనిపించనున్నారు. అక్టోబర్ 6 న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్ పాత్ర కోసం మొదట తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారు.

శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధర్ ని పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారనే విషయం బయటికి రావడంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అటు రాజకీయ విశ్లేషకులు కూడా విజయ్ సేతుపతి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలు కారణాలవల్ల విజయ్ సేతుపతి ఈ బయోపిక్ నుంచి తప్పుకోగా, అతని స్థానంలో 'స్లమ్ డాగ్ మిలీనియర్' ఫేమ్ మధుర్ మిట్టల్ నటించాడు. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ముత్తయ్య మురళీధరన్ విజయ్ సేతుపతి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 800 మూవీ నుంచి విజయ్ సేతుపతి తప్పడానికి గల కారణాలను వెల్లడించారు.

"800 మూవీని చేయాలని మేము ఎప్పుడో అనుకున్నాం. ఐపీఎల్ ఆడుతున్న రోజుల్లోనే ఓసారి మేము ఉన్న హోటల్లో విజయసేతుపతి కూడా ఉన్నారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన హోటల్ లో ఉండాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసి మా డైరెక్టర్ విజయ్ సేతుపతితో నాకు సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు ఐదు రోజుల తర్వాత ఆయన మాకు రెండు గంటల పాటు సమయం కేటాయించారు. ఆ సమయంలో నా ఆట తీరంటే ఆయనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనతో మేము 800 కథ గురించి చర్చించాం. కథ విన్నాక ఆయన ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి కథలో నటించే అవకాశాన్ని అస్సలు వదులుకోనని, తప్పకుండా ఈ సినిమాలో భాగమవుతానని చెప్పారు" అని అన్నారు.

మా మధ్యన డీల్ కూడా కుదిరింది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడం, విజయ్ సేతుపతి కుటుంబ సభ్యులు సైతం బెదిరింపులు ఎదుర్కోవడంతో ఆయన ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. నిజానికి ఇది కేవలం క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. రాజకీయ ఇతర కోణాలు లాంటివి ఈ సినిమాలో లేవు. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క ట్రూ స్టోరీ" అని మురళీధరన్ అని తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రకటించిన సమయంలో సివిల్ వార్ జరుగుతుండగా ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక గవర్నమెంట్ కి సపోర్ట్ చేశాడనే వాదనల నేపథ్యంలో రాజకీయ నాయకులతో సహా చాలామంది ముత్తయ్య మురళీధరన్ పాత్రను విజయ్ సేతుపతి పోషించడాన్ని వ్యతిరేకించారు.

Also Read : సాయి తేజ్‌కు ముద్దు పెట్టిన 'కలర్స్' స్వాతి - కాలేజీ రోజుల నుంచి ఇద్దరూ ఫ్రెండ్స్ అంట!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 26 Sep 2023 04:49 PM (IST) Tags: Vijay Sethupathi muttiah muralitharan 800 movie Muttiah muralitharan About Vijay Sethupathi Muttiah muralitharan Latest Interview

ఇవి కూడా చూడండి

Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా

Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా

Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!

Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!

రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!

రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’  - నేటి టాప్ సినీ విశేషాలివే!

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

టాప్ స్టోరీస్

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Mrunal Thakur Photos : హాయ్ మృణాల్... మరీ అంత ముద్దొస్తే ఎలా?

Mrunal Thakur Photos : హాయ్ మృణాల్... మరీ అంత ముద్దొస్తే ఎలా?
×