అన్వేషించండి

Maharaja OTT: ఓటీటీకి వచ్చేస్తోన్న విజయ్‌ సేతుపతి బ్లాక్‌బస్టర్‌ మూవీ 'మహారాజ' - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Maharaja Movie OTT: విజయ్‌ సేతుపతి లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ మహారాజ ఓటీటీకి వచ్చేస్తోంది. ఇప్పటికీ థియేటర్లో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతున్నఈ సినిమా త్వరలోనే డిజిటల్‌ ప్రీమియర్‌కి సిద్ధం అవుతుంది..

Vijay Sethupathi Maharaja Movie OTT Release and Streaming Details: తమిళ స్టార్‌ హీరో, విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఇటీవల నటించిన చిత్రం 'మహారాజ' . ఇది విజయ్‌ సేతుపతి 50వ చిత్రం కావడం విశేషం. ఇక జూన్‌ 14న థియేటర్‌లోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. లాంగ్‌ గ్యాప్ తర్వాత విజయ్‌ సేతుపతికి ఈ చిత్రం ఓ సాలిడ్‌ హిట్‌ పడింది. ప్రస్తుతం మహారాజ మూవీ రూ.100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ దిశగా వెళుతుంది. తెలుగులో ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 20 కోట్ల వరకు గ్రాస్ చేసిందని సమాచారం. 

దీంతో విజయ్‌ సేతుపతి కెరీర్‌లో తెలుగులో అత్యధిక వసూళ్లు చేసిన తొలి చిత్రంగా 'మహారాజ' నిలిచింది. కానీ, తమిళంలో మాత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో థియేటర్లో ఇంకా సక్సెఫుల్‌గా దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కి రెడీ అవుతుందంటూ సోషల్‌ మీడియాలో ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. మహారాజ మూవీ ఓటీటీ రైట్స్‌ ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ డీల్‌కి ఈ మూవీ అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్‌ చేస్తుందట. వచ్చేనెల జూలై 19న ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానుందట. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజుల ఓటీటీలో విడుదల కానుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందన సమాచారం. 

'మహారాజ'  కథ
మహారాజ (విజయ్ సేతుపతి) ఓ సామాన్య బార్బర్. తన కూతురితో కలిసి సిటీకి దూరంగా నివసిస్తుంటాడు. అయితే మహారాజ కూతురు జ్యోతి నెలల పసికందుగా ఉన్నప్పుడు అతడి భార్య (దివ్య భారతి) ఓ ప్రమాదంలో మరణిస్తుంది. అయితే ఆ ప్రమాదంలో పాప మాత్రం ప్రాణాలతో బయటపడుతుంది. అయితే ఆమె ప్రాణాలతో ఉండటానికి కారణమైన చెత్త బుట్ట కారణం అవుతుంది. దాంతో అప్పటి నుంచి దానికి లక్ష్మి అని పేరు పెట్టి బాగా మహారాజాను కొంతమంది దొంగలు కొట్టి చెత్త బుట్టను తీసుకువెళతారు.

దాంతో తన కుమార్తె తిరిగి వచ్చేసరికి  ఎలాగైనా లక్ష్మీని(చెత్త బుట్టను) వెతికి పెట్టమని పోలీసు ఫిర్యాదు చేస్తాడు. పోలీసు స్టేషన్‌కి వెళ్లిన మహారాజ పోలీసులతో చెత్త బుట్ట పోయిందని చెప్పేసరికి వారు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ చెత్త బుట్టలో ఏం దాచాడు? ఎలక్ట్రిక్ షాప్ యజమానిగా పగలు మంచివాడిగా నటిస్తున్న సెల్వ(అనురాగ్‌ కశ్వప్‌) రాత్రుళ్లు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అతడి ముఠాకు, మహారాజ ఇంటిలో లక్ష్మీకి దొంగలించడానికి సంబంధం ఏమైనా ఉందా? నిజంగా మహారాజ, లక్ష్మి (చెత్తబుట్ట) కోసమే పోలీసుల దగ్గరకు వెళ్లాడా? మరే కారణమైన ఉందా? తెలియాలంటే సినిమా చూసి  తెలుసుకోవాల్సిందే. 

Also Read: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకున్న సూర్య 'కంగువ' - సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాకు పోటీగా..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget