అన్వేషించండి

Indhra Ram: ఐదు నిమిషాలు ఇచ్చిన విజయ్ సేతుపతి 45 మినిట్స్ మాట్లాడారు - హీరో ఇంద్ర రామ్ ఇంటర్వ్యూ

Chaurya Paatam Movie: కార్తీక్ ఘట్టమనేని అందించిన కథతో త్రినాథరావు నక్కిన నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా 'చౌర్య పాఠం'. ఇంద్ర రామ్ హీరోగా పరిచయమవుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు

Hero Indhra Ram Interview: ''ముందు విజయ్ సేతుపతి గారు 'చౌర్య పాఠం' టీజర్ విడుదల చేయడానికి మాకు ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. టీజర్ చూశాక ఆల్మోస్ట్ 45 నిమిషాలు మాట్లాడారు. టీజర్ గురించి, నా నటన గురించి మాట్లాడారు. వ్యక్తిగతంగా నన్ను ప్రశంసించారు. మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్ చేశానని చెప్పారు. అంత గొప్ప నటుడి నుంచి వచ్చిన ప్రశంసలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను'' అని ఇంద్ర రామ్ సంతోషం వ్యక్తం చేశారు.

'చౌర్య పాఠం' (Chaurya Paatam Movie)తో ఇంద్ర రామ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే... టాప్ సినిమాటోగ్రాఫర్, 'ఈగల్' దర్శకుడు, ప్రస్తుతం 'మిరాయ్' తెరకెక్కిస్తున్న కార్తీక్ ఘట్టమనేని కథ అందించారు. ఆ కథ నచ్చిన 'ధమాకా' దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారారు. ఇంద్ర రామ్ తొలి సినిమా వెనుక ఇద్దరు అగ్ర దర్శకులు ఉన్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా గురించి హీరో చెప్పిన విశేషాలు... 

  • నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాక హైదరాబాద్ వచ్చాను. నటనలో కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నా. చాలా ఆఫీసులు చుట్టూ తిరిగా. పలువురు దర్శకుల్ని కలిశా. చాలా రిజెక్షన్స్ చూశా. చివరకు, నేను ఎదురు చూసిన అవకాశం త్రినాథరావు నక్కిన, కార్తీక్ ఘట్టమనేని రూపంలో ఎదురైంది. 'చౌర్య పాఠం' సినిమాలో అవకాశం వచ్చింది. అందుకు, నేను వాళ్లిద్దరికీ ఎంత కృతజ్ఞత చూపించినా తక్కువే.
  • 'చౌర్య పాఠం' నాకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ప్రతిభావంతులైన ఇద్దరు దర్శకులు అండగా ఉండటంతో వాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నా. ఈ మేకింగ్ ప్రాసెస్ లో ఎన్నో విషయాలు అర్థం అయ్యాయి. సినిమా కోసం రెండేళ్లు కేటాయించా. మా టీం అంతా ఎంతో కష్టపడ్డాం. అందుకు తగ్గ ప్రతిఫలం వస్తుందని ఆశిస్తున్నాను.
  • 'చౌర్య పాఠం' కథ కొత్తగా ఉంటుంది. ఇదొక యూనిక్ స్టోరీ. కథలో యూనిక్ పాయింట్ నచ్చి త్రినాథరావు నక్కిన గారు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ల దగ్గర పలువురు హీరోల డేట్స్ ఉన్నాయి. అయినా... ఆడిషన్స్ చేసిన తర్వాత ఆ హీరో పాత్రకు నేను బావుంటానని నన్ను ఎంపిక చేశారు. నా దృష్టిలో ఎప్పుడూ కథే హీరో. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ఆ కొత్తదనం ఉండటంతో ఈ సినిమా చేశా. 'చౌర్య పాఠం' చూసేటప్పుడు కథలో పాత్రలతో పాటు వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారు.

Also Read: బేబీ లీక్స్... సాయి రాజేష్ వెన్నుపోటుపై శిరిన్ శ్రీరామ్ బుక్!

Indhra Ram: ఐదు నిమిషాలు ఇచ్చిన విజయ్ సేతుపతి 45 మినిట్స్ మాట్లాడారు - హీరో ఇంద్ర రామ్ ఇంటర్వ్యూ

  • 'చౌర్య పాఠం' సినిమాకు ముందు కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే... ఆ కథలు రొటీన్ అనిపించడంతో చేయలేదు. రెగ్యులర్ ప్యాట్రన్ సినిమాలు చేయాలని నేను తొందర పడటం లేదు. యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాను. నా నెక్స్ట్ సినిమా పెద్ద నిర్మాణ సంస్థలో ఉంటుంది. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తా.
  • సినిమా అంటే నాకు ప్రేమ కాదు, అదే నా జీవితం. యాక్టింగ్, డ్యాన్సింగ్, ఫైటింగ్ స్కిల్స్ నేర్చుకున్నాక ఇండస్ట్రీలోకి వచ్చాను. నన్ను సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉండటం నా అదృష్టం. ఓర్పు, సహనంతో వేచి ఉండటమే అసలైన శక్తి అని నేను నమ్ముతా. మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని వేచి చూస్తున్నా.

Also Readబెంగుళూరు రేవ్ పార్టీ కేసుపై విష్ణు మంచు ట్వీట్... నటి హేమపై అప్పుడు చర్యలు తీసుకుంటామని వెల్లడి

టాప్ హెడ్ లైన్స్

NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Varanasi: రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Embed widget