అన్వేషించండి

Vijay remuneration: హాట్ టాపిక్‌గా విజయ్ రెమ్యునరేషన్ - ఏకంగా అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నాడా?

Vijay Remuneration: ప్రస్తుతం విజయ్.. తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసి రాజకీయాలపై ఫోకస్ చేయాలనుకుంటున్నారు. అదే సమయంలో తన 69వ చిత్రం కోసం ఈ హీరో ఎంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారో బయటికొచ్చింది.

Vijay Remuneration For 69th Film: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. తాజాగా తన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించారు. అయితే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలంటే సినిమాలను పక్కన పెట్టక తప్పదు. అందుకే ప్రస్తుతం తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేయగానే.. విజయ్ పూర్తిగా సినిమాలకు దూరం అవుతారని సోషల్ మీడియాలో అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా విజయ్ మరో సినిమాను ఓకే చేశారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కెరీర్‌లో ఏ హీరో ఎప్పుడు అందుకోనంత రెమ్యునరేషన్‌ను ఈ మూవీ కోసం విజయ్ అందుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో రెమ్యునేషన్ వార్త సినీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.

చివరి సినిమా..

ప్రస్తుతం విజయ్.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే మూవీలో నటిస్తున్నారు. ఇది విజయ్ కెరీర్‌లో 68వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్లు బయటికొచ్చాయి. ఇందులో హీరో డబుల్ రోల్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే విజయ్ కెరీర్‌లో ఇదే చివరి చిత్రమని చాలామంది ఫిక్స్ అయిపోయారు. కానీ దళపతి మాత్రం తన 69వ సినిమాకు సిద్ధమయినట్టు కోలీవుడ్‌లో ఇటీవల వార్తలు మొదలయ్యాయి. సీనియర్ డైరెక్టర్ హెచ్ వినోథ్ దర్శకత్వంలో నటించడానికి విజయ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పైగా ఈ చిత్రం కోసం విజయ్ రెమ్యునరేషన్ గురించి కూడా సినీ సర్కిల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మొదటిసారి..

దళపతి విజయ్.. తన కెరీర్‌లో హీరోగా తెరకెక్కనున్న 69 చిత్రం కోసం రూ.250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్టు కోలీవుడ్‌లో ఒక్కసారిగా రూమర్ మొదలయ్యింది. ఇప్పటివరకు ఏ హీరో కూడా ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకోలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు స్టార్ హీరోలు మాత్రం తమ రెమ్యునరేషన్‌ను రూ.200 కోట్ల వరకు పెంచుతున్నారు. కానీ మొదటిసారిగా విజయ్ మాత్రం ఒక సినిమా కోసం రూ.250 కోట్లను రెమ్యునరేషన్‌గా అందుకోనున్నారు. విజయ్, హెచ్ వినోథ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మించడానికి ముందుకొచ్చారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ఒక పొలిటికల్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం.

కమల్ కోసం రాసిన కథ..

ఇప్పటివరకు అజిత్‌తో 'నేర్కొండ పార్వై', 'వాలిమై' వంటి సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హెచ్ వినోథ్. కానీ ఇప్పటివరకు విజయ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ మాత్రం తనకు రాలేదు. కొన్నాళ్ల క్రితం తను కమల్ హాసన్‌తో సినిమా చేయాలని కథను కూడా సిద్ధం చేసుకున్నాడట. కానీ ప్రస్తుతం కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో అదే కథను దళపతి విజయ్ స్టార్‌డమ్‌కు తగినట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ హీరోను మూవీకి ఒప్పించాడట హెచ్ వినోథ్. ప్రస్తుతం ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న విజయ్.. అది పూర్తవ్వగానే హెచ్ వినోథ్ ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత విజయ్ పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాలపైనే శ్రద్ధపెడతారేమో చూడాలి.

Also Read: ఫ్యాన్స్ ప్రేమకు ఫిదా - ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్‌లో మృణాల్ చేసిన పనికి అంతా షాక్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget