అన్వేషించండి

Mrunal Thakur: ఫ్యాన్స్ ప్రేమకు ఫిదా - ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్‌లో మృణాల్ చేసిన పనికి అంతా షాక్

Family Star Pre Release Event: టాలీవుడ్‌లో మృణాల్ ఎనలేని సక్సెస్‌ను చూసింది. అందుకే ఫ్యాన్స్ ప్రేమకు ఫిదా అయిన ఈ భామ.. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందరికీ మోకాళ్లపై కూర్చొని నమస్కరించింది.

Mrunal Thakur At Family Star Pre Release Event: ‘సీతారామం’తో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే సీతగా అందరి మనసులను గెలిచేసుకుంది. ఆ తర్వాత చేసిన ‘హాయ్ నాన్న’ చూసిన ఆడియన్స్ అంతా మృణాల్ స్క్రిప్ట్ సెలక్షన్‌కు ఫిదా అయ్యారు. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి ‘ఫ్యామిలీ స్టార్’తో థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేస్తుంది ఈ భామ. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమవ్వగా హీరో విజయ్ దేవరకొండతో పాటు మృణాల్ కూడా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది. తాజాగా జరిగిన ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్ చేసిన పనికి ప్రేక్షకులు షాకయ్యారు.

మోకాళ్లపై కూర్చొని మరీ..

‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముందుగా తెలుగు ఆడియన్స్‌ను తెలుగులోనే పలకరించింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత వారి కోసం ఒకటి చేయాలని అనుకుంటున్నానని చెప్పి.. మోకాళ్లపై కూర్చొని అందరికీ తలవంచి నమస్కరించింది. ఇది చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇలా చేయలేదని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అంతే కాకుండా తనను ఇంతగా ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ కూడా చెప్పింది. ‘‘చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మీరంతా కలిసి నన్ను మీ తెలుగమ్మాయిని చేశారు. ఈరోజు నాకెంత స్పెషల్ రోజు అని మాటల్లో చెప్పలేను’’ అంటూ తన సంతోషాన్ని బయటపెట్టింది మృణాల్.

నేను మాత్రమే చేయగలను..

‘‘సీతారామం, హాయ్ నాన్న, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్. నన్ను పక్కకు పెట్టకుండా ఈ సినిమాలో క్యాస్ట్ చేసుకున్నందుకు పరశురామ్‌కు థాంక్యూ. మొదటి 15 రోజులు కష్టంగా ఉన్నాయి. కానీ ఆ తర్వాత నా మైండ్‌కు, నా మనసుకు తెలిసిపోయింది ఇందు అనే పాత్రకు నాలాగా ఎవరూ చేయలేరు అని. నాకు ఇందు అంటే చాలా ఇష్టం. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం నాకు ఇష్టం. ప్రతీ అమ్మాయికి రౌడీ విజయ్‌తో కలిసి వర్క్ చేయాలని డ్రీమ్ ఉంటుంది’’ అంటూ తనతో సినిమాలో కలిసి పనిచేసిన ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా గుర్తుచేసుకుంది. ఇది తనకు చాలా అందమైన ప్రయాణమని చెప్పుకొచ్చింది. దిల్ రాజుతో కలిసి ఇప్పటికీ రెండు సినిమాలు చేశానని, మరో సినిమా కూడా చేయాలని ఉందని తన కోరికను బయటపెట్టింది.

మాటివ్వండి..

కళ్యాణి వచ్చా వచ్చా పాటకు వస్తున్న క్రేజ్‌పై కూడా మృణాల్ ఠాకూర్ స్పందించింది. తను మొదటిసారి ఇలాంటి పాటలో నటించానని, స్టెప్పులేశానని, దానికి వస్తున్న రెస్పాన్స్ తనకు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపింది. తన తండ్రి కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాగా.. తనతో కలిసి ఈ స్పెషల్ రోజును సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది మృణాల్. ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు అందరూ ఫ్యామిలీతో వెళ్లాలని ఫ్యాన్స్ దగ్గర మాట తీసుకుంది. అందరికీ మనస్ఫూర్తిగా లవ్ యూ అని చెప్తూ తన స్పీచ్‌ను ముగించింది. ఫైనల్‌గా అందరినీ ఏవండి అని పిలిచి సంతోషపెట్టింది మృణాల్ ఠాకూర్.

Also Read: 'ఫ్యామిలీ స్టార్' సెన్సార్ రిపోర్ట్ - ఆ నాలుగు డైలాగులూ మ్యూట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget