The Girl Friend Teaser : ఇకమీదట నువ్వే గమ్యం... 'గర్ల్ ఫ్రెండ్' టీజర్లో విజయ్ దేవరకొండ సర్ప్రైజ్
The Girl Friend : రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్' టీజర్ ను తాజాగా విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.
The Girl Friend Movie : పుష్ప, యానిమల్, పుష్ప 2 వంటి సినిమాలతో రష్మిక మందన్న వరుసగా అందిన సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. పాన్ ఇండియా హీరోయిన్ గా ఈ సినిమాలతో ఆమె క్రేజ్ ఇప్పుడు పీక్స్ కి చేరింది. వరుసగా 1000 కోట్ల సినిమాలను తన ఖాతాలో వేసుకుని లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది నేషనల్ క్రష్. ప్రస్తుతం థియేటర్లలో అల్లు అర్జున్ తో కలిసి రష్మిక మందన్న చేసిన 'పుష్ప 2' జాతర కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది డిసెంబర్ రష్మిక మందన్నకి బాగా కలిసి వచ్చాయని చెప్పాలి. అందుకే ఈ డిసెంబర్లోనే తన నెక్స్ట్ మూవీ టీజర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయింది ఈ బ్యూటీ. తాజాగా రష్మిక మందన్న నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' టీజర్ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.
Launching #TheGirlfriendteaser to the world :)https://t.co/45kCAMAJqV
— Vijay Deverakonda (@TheDeverakonda) December 9, 2024
I love every visual of this teaser.
I am so excited to see this drama unfold.
She has been a lucky charm for so many of us actors, being part of our biggest successes. Growing fiercely as an actor, a…
హీరోగా పరిచయమై, ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా తెరకెక్కుతోంది. దీనిని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. రష్మిక మందన్న తన కెరీర్ లోనే ఫస్ట్ టైం చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా ఇది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు 'పుష్ప 2' సక్సెస్, క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ 'ది గర్ల్ ఫ్రెండ్' టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
సర్ప్రైజ్ ఇదే
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ టీజర్ ని నేడు రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నిజానికి రష్మిక విజయ్ దేవరకొండ మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోంది, పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ గత కొన్ని నాలుగ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న గర్ల్ ఫ్రెండ్ టీజర్ ను రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రకటించినట్టుగానే మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు.
ఈ టీజర్ లో రష్మిక మందన్న లుక్ ఎప్పటిలాగే క్యూట్ గా పక్కింటి అమ్మాయిలా ఉంది. "నయనం నయనం కలిసే తరుణం... యదనం పరుగే పెరిగే వేగం... నా కదిలే మనసుని అడిగా సాయం.. ఇకమీదట నువ్వే దానికి గమ్యం... " అంటూ సర్ప్రైజింగ్ గా విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలు కాగా, అందులో రష్మిక మందన్న మాత్రమే కనిపించింది. ఇక ఈ టీజర్ లో రష్మిక రకరకాల ఎమోషన్స్ లో కనిపించింది. "ఇదేదో పికప్ లైన్ అయితే కాదు కదా... అస్సలు పడను" అంటూ రష్మిక మందన్న టీజర్ చివర్లో చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. మరి ఆమె ప్రేమ ప్రయాణం ఎలా మొదలై ఎలా పూర్తయింది అనే విషయాన్ని సినిమాలో చూడాల్సిందే.
Also Read: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?