Vijay Surprises Samantha: షూటింగ్ స్పాట్‌లో సమంతకు విజయ్ సర్‌ప్రైజ్, ఫేక్ సీన్ క్రియేట్ చేసి మరీ షాకిచ్చారు
నకిలీ సీన్ క్రియేట్ చేసి విజయ్ దేవరకొండ, చిత్రయూనిట్ సమంతాకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటో మీరే చూడండి.
సమంత మళ్లీ షూటింగులతో బిజీగా మారిపోయింది. ఆమె నటించిన ‘శకుంతలం’ మూవీ త్వరలోనే విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడిగా, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చిట్టి భరతుడి పాత్రలో కనిపించనుంది. ఇది కాకుండా ‘యశోద’ సినిమాలోనూ సమంత నటిస్తోంది. శుక్రవారం విడుదలైన ‘కణ్మని రాంబో ఖతీజా’ సినిమాకు మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
సమంత ఇటీవలే విజయ్ దేవరకొండ సినిమాకు కూడా సైన్ చేసింది. ఈ చిత్రం షూటింగ్ కోసం ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో ఉంది. గురువారం సమంత పుట్టిన రోజు నేపథ్యంలో ఆమెకు ఓ సర్‌ప్రైజ్ ఇవ్వాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. రొటీన్‌గా బర్త్ డే సర్ ప్రైజ్ ఇవ్వకుండా.. హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఒక ఫేక్ సీన్‌ను క్రియేట్ చేశారు.
సమంత ఆ సీన్‌ను నిజమనుకుని నమ్మేసింది. క్యాంప్ ఫైర్ వద్ద విజయ్‌తో సీన్‌లో లీనమైంది. పాత్రలో ఒదిగిపోయి డైలాగులు చెప్పడం మొదలుపెట్టింది. అనంతరం విజయ్ దేవరకొండ తన డైలాగ్ చెబుతూ.. ‘‘సమంత’’ అనేశాడు. దీంతో అతడు పొరపాటున సమంతా అన్నాడు కాబోలని నవ్వేసింది. ఆ వెంటనే విజయ్ ఆమెకు ‘హ్యాపీ బర్త్ డే’ సమంతా అని చెప్పాడు. చిత్రయూనిట్ కూడా పెద్ద కేక్ సమంత ముందు పెట్టి విషెస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
View this post on Instagram