GOAT Bday Shots: ‘గోట్’ స్పెషల్ గ్లింప్స్ - ఒకే బైక్‌పై ఇద్దరు విజయ్‌లు, యాక్షన్ సీన్ అదిరిందిగా!
GOAT Bday Shots: విజయ్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ ‘గోట్’ నుండి బర్త్ డే షాట్స్ పేరుతో చిన్న గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఫుల్ యాక్షన్‌తో డబుల్ ధమాకా ఇస్తున్నాడు విజయ్.
GOAT Bday Shots Out Now: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ అయిన ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (G.O.A.T) నుండి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. ఇక ఫ్యాన్స్ సంతోషం కోసం ‘గోట్’ నుండి ఒకటి కాదు.. రెండు అప్డేట్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా నుండి ఒక పాటతో పాటు చిన్న గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే పాటకు సంబంధించిన ప్రోమో విడుదలయ్యి అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా విజయ్ స్పెషల్ బర్త్ డే గ్లింప్స్ అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
డబుల్ యాక్షన్..
వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రమే ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు బయటికొచ్చాయి. అందులోని ఒక పోస్టర్‌లో విజయ్ డబుల్ యాక్షన్ చేస్తున్నాడనే విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్. అయితే దర్శకుడు వెంకట్ ప్రభు ఆలోచనలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయని, అసలు ఇది నిజంగా డబుల్ యాక్షన్ అయ్యిండొచ్చా, కాదా అని ప్రేక్షకులు సందేహంలో ఉండిపోయారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయిన ‘గోట్’ బర్త్ డే గ్లింప్స్‌లో విజయ్ డబుల్ యాక్షన్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
ఫుల్ యాక్షన్..
‘ది గోట్ బర్త్ డే షాట్స్’ పేరుతో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ నుండి విజయ్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఒక బైక్ ఛేజింగ్‌తో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. కొందరు వ్యక్తులు.. బైక్‌లో వెళ్తున్న ఇద్దరిని పట్టుకోవడానికి వెంటపడుతుంటారు. గన్ కాల్పులు కూడా జరుపుతుంటారు. చివరిగా డబుల్ ధమాకాగా విజయ్ రెండు పాత్రల్లో కనిపించడంతో ఈ గ్లింప్స్ పూర్తవుతుంది. ‘‘మునుపెన్నడూ చూడనిది చూడడానికి, మునుపెన్నడూ విననది వినడానికి, మునుపెన్నడూ కనిపించనిది కనుక్కోవడానికి సమయం వచ్చేసింది’’ అంటూ ‘గోట్’ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ గ్లింప్స్ చూస్తుంటే సినిమా పక్కా హిట్ అని ఫ్యాన్స్ ఇప్పుడే ఫిక్స్ అయిపోతున్నారు.
పాట కూడా..
విజయ్ బర్త్ డే స్పెషల్‌గా విడుదలయిన ‘గోట్’ గ్లింప్స్‌లో మేజర్ హైలెట్‌గా నిలిచింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. హాలీవుడ్ రేంజ్‌లో ఆకట్టుకుంటున్న ఈ సంగీతాన్ని అందించింది యువన్ శంకర్ రాజా. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విజయ్‌కు జోడీగా మీనాక్షి చౌదరీ నటిస్తోంది. ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, వైభవ్ లాంటి నటీమణులతో పాటు లైలా, స్నేహ వంటి నటీమణులు కూడా ‘గోట్’లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుండి ‘చిన్న చిన్న కంగళ్’ అనే పాట కూడా విడుదలయ్యింది.
Also Read: విజయ్ ‘గోట్’ నుంచి రెండో పాట విడుదల - చనిపోయిన సింగర్ వాయిస్‌ను రీక్రియేట్ చేసిన మేకర్స్