Rashmika Mandanna: అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రశంసలు - రష్మిక నటనకు నెటిజన్లు ఫిదా
Rashmika Mandanna: ‘యానిమల్‘ ట్రైలర్ విడుదలయ్యాక రష్మిక పళ్లు కొరుకుతూ మాట్లాడే సన్నివేశంపై నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా ఆమె నటన పట్ల విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
Rashmika Mandanna: రణబీర్ కపూర్, రష్మిక మందన్న తాజా చిత్రం ‘యానిమల్‘ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి షో నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు ఏకంగా రూ.116 కోట్లు వసూళు చేసి సత్తా చాటింది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది.
రష్మిక నటన పట్ల నెటిజన్ల ప్రశంసలు
ఇక ఈ సినిమాలో రష్మిక నటనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. విమర్శకులు సైతం ఆమె నటకు ఫిదా అయ్యారు. ఎమోషనల్ సన్నివేశాల్లో రష్మిక నటన అద్భుతం అంటున్నారు. రష్మిక యాక్టింగ్ ముందు రణబీర్ నటన కూడా దిగదుడుపే అంటున్నారు. నిజానికి ‘యానిమల్‘ ట్రైలర్ విడుదలయ్యాక రణబీర్ తో వాదనకు దిగుతూ రష్మిక పళ్లు కొరుకుతూ చెప్పిన ఓ డైలాగ్ మీద పలువురు విమర్శలు గుప్పించారు. ఆమె చెప్పిన డైలాగ్ ఏంటో అస్సలు అర్థం కావట్లేని ట్రోల్ చేశారు. సినిమా విడుదల అయ్యాక మాత్రం రష్మిక నటన పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. ట్రోల్ చేయబడిన డైలాగ్ అద్భుతం అంటూ కీర్తించబడుతోంది.
అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రశంసలు
తాజాగా సోషల్ మీడియాలో ‘యానిమల్‘ ట్రైలర్ కు సంబంధించిన స్టిల్ ను నెటిజన్లు షేర్ చేస్తూ అభినందిస్తున్నారు. “ఈ సీన్ చూసి చాలా మంది రష్మికను ట్రోల్ చేశారు. కానీ, సినిమాలో ఆమె నటన చాలా నేచురల్ గా ఉంది. మొత్తం సీక్వెన్స్ లో ఆమె నటన వారెవ్వా అనిపించింది. ఇంకా చెప్పాలంటే రణబీర్ ను మించి నటించింది’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. “నవ్వు, కోపం, ఏడుపు, నిరాశ కలగలిపిన నటన చాలా ఆకట్టుకుంది. ఆమె నటన ‘అపరిచితుడు’ మాదిరిగా ఉంది” అని మరో నెటిజన్ ప్రశంసించాడు. "నటీనటులు సహజంగా యాక్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది. నెటిజన్ల ట్రోలింగ్ చూసి రష్మిక బాగా నటించలేదేమో అనుకున్నా. కానీ, ఆమె తన పాత్రలో అద్భుతంగా నటించింది. సినిమా చూసిన తర్వాత ఆమెను నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారని నాకు అర్థం అయ్యింది” మరొకరు వెల్లడించారు.
రష్మిక సన్నివేశంపై సందీప్ ఏమన్నారంటే?
ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ‘యానిమల్’ ట్రైలర్ లో రష్మిక సన్నివేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇది చాలా ఎమోషనల్ సీన్ కాబట్టి, ఆమె మాటలు అస్పష్టంగా అనిపించాయి. ఈ సీన్ పట్ల చర్చ జరుగుతుందని నాకు తెలుసు. కానీ, ఎవరైనా భావోద్వేగానికి గురైనప్పుడు పళ్లు కొరుకుతూనే మాట్లాడుతారు. ట్రైలర్ లో ఈ సన్నివేశాన్ని ఉంచడం పట్ల చాలా చర్చ జరిగింది. సినిమా చూసిన తర్వాత మరింత అద్భుతంగా ఉంటుంది” అని వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషించారు. రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Read Also: ఇప్పటి 20 సార్లు పెళ్లి చేసుకున్నా అస్సలు బోర్ కొట్టలేదు - అవికా గోర్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply