అన్వేషించండి

Vidya Vasula Aham Trailer: ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ విడుదల - భార్యాభర్తల గొడవలు, రొమాన్స్, ఇంకా చాలా!

Vidya Vasula Aham Trailer: రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రమే ‘విద్య వాసుల అహం’. భార్యాభర్తల మధ్య ఈగోపై తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది.

Vidya Vasula Aham Trailer Is Out Now: హీరో, హీరోయిన్‌కు పెళ్లి అవ్వడం, ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య గొడవలు మొదలవ్వడం.. ఈ కాన్సెప్ట్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు సినిమాలు హిట్‌ను కూడా సొంతం చేసుకున్నాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మరో చిత్రమే ‘విద్య వాసుల అహం’. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకోగా.. తాజాగా దీని ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు మేకర్స్. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఆహాలో విడుదల కానుంది. తాజాగా విడుదలయిన ట్రైలర్ ద్వారా సినిమాలోని అసలు కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాడు దర్శకుడు మణికాంత్ గెల్లి.

అహాలే చాలు..

శ్రీనివాస్ రెడ్డి నారదుడిగా, అవసరాల శ్రీనివాస్ విష్ణుమూర్తిగా, అభినయ లక్ష్మి దేవిగా ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ ఓపెన్ అవుతుంది. ‘‘కారణం లేని కలహం నారదుడు కూడా కల్పించలేడనుకున్నా. దంపతుల కలహాలకు వాళ్ల అహాలే చాలు’’ అంటూ శ్రీనివాస్ రెడ్డి చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత భార్యభర్తలుగా విద్య, వాసుల ఇంట్రడక్షన్. భర్త తన చెప్పినట్టే వినాలి అనుకునే భార్య విద్య పాత్రలో శివానీ రాజశేఖర్ నటించింది. భార్య అహాన్ని భరించలేక నలిగిపోయే భర్త వాసు పాత్రలో రాహుల్ విజయ్ కనిపించాడు. అలా పెళ్లయిన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా గొడవలతో వారి జీవితాన్ని కొనసాగిస్తుంటారు విద్య, వాసు.

గొడవల మధ్య రొమాన్స్..

‘విద్య వాసుల అహం’ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇందులో కామెడీ కూడా బాగా వర్కవుట్ అయ్యేలా అనిపిస్తోంది. అంతే కాకుండా ఇందులో రాహుల్, శివానీ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయని ట్రైలర్‌లోనే రివీల్ చేశారు మేకర్స్. చీరకట్టులో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది శివానీ. అలా ఎప్పుడూ గొడవపడుతూ, అప్పుడప్పుడు కలిసిపోతూ ఉంటే వాసు, విద్యల ఇంటికి అనుకోకుండా ఇరు కుటుంబాలు వస్తాయి. ‘‘మన పేరెంట్స్ ఉన్నంతవరకు మనం సరిగ్గా ఉందాం’’ అంటూ వాసుతో ఒక ఒప్పందానికి వస్తుంది విద్య. కానీ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ గొడవలు మొదలవుతాయి. అవి మెల్లగా మనస్పర్థలకు దారితీస్తాయి.

ఆకట్టుకునే డైలాగులు..

‘‘ఆవేశంలో తీసుకునే నిర్ణయం జీవితానికి అంత మంచిది కాదు. ఆలోచించి నిర్ణయం తీసుకో’’ లాంటి కొన్ని రియలిస్టిక్ డైలాగులతో ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఒంటరిగా ఎంత సాధించినా చివరికి ఒంటరితనమే మిగిలిపోతుంది’’ అంటూ తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్.. ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. అలా గొడవలు, అహంతో మొదలయిన విద్య, వాసుల పెళ్లి బంధం చివరికి ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేదే సినిమా కథ అని ‘విద్య వాసుల అహం’ ట్రైలర్‌లోనే స్పష్టంగా అర్థమవుతుంది. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 17 నుండి ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభించుకోనుంది.

Also Read: డబుల్ ఇస్మార్ట్ టీజర్ - డబుల్ ఇంపాక్ట్ & మాస్... దిమాకిక్కిరికిరి, రామ్ & పూరి కుమ్మేశారుగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget