Shiv Kumar Subramaniam Death: నటుడు శివ్ కుమార్ సుబ్రమణియం మృతి - కుమారుడు మరణించిన రెండు నెలలకు
హిందీ నటుడు, రచయిత శివ్ కుమార్ సుబ్రమణియం మరణించారు. ఆయన కుమారుడు రెండు నెలల క్రితం మరణించారు.
నటుడు, రచయిత శివ్ కుమార్ సుబ్రమణియం ఇకలేరు. ముంబైలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రెండు నెలల క్రితం ఆయన కుమారుడు బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించారు. ఆ అబ్బాయి వయసు 15 ఏళ్ళు. ఇప్పుడు ఆయన మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది.
ఇటీవల విడుదలైన 'మీనాక్షీ సుందరేశ్వర్' సినిమాలో సాన్యా మల్హోత్రా తండ్రిగా శివ్ కుమార్ సుబ్రమణియం కనిపించారు. ఇంతకు ముందు '2 స్టేట్స్'లో ఆలియా భట్ తండ్రి పాత్ర చేశారు. రాణీ ముఖర్జీ 'హిచ్కీ'లో కూడా నటించారు. శివ్ కుమార్ నటుడు మాత్రమే కాదు, రచయిత కూడా! విధు వినోద్ చోప్రా 'పరిందా'తో రచయితగా ఆయన కెరీర్ స్టార్ట్ అయ్యింది. తర్వాత పలు చిత్రాలకు రచనా విభాగంలో పని చేశారు. '1942: ఏ లవ్ స్టోరీ'కి ఆయన స్క్రీన్ ప్లే రాశారు.
Also Read: తల్లి కాబోతున్న బాపు బొమ్మ, భర్త బర్త్ డేకు స్పెషల్ న్యూస్
శివ్ కుమార్ సుబ్రమణియం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రతిభ గురించి కొనియాడారు.
Also Read: 'జెర్సీ' విడుదల వాయిదా - 'కెజియఫ్' క్రేజ్ కారణమా?
Terrible news to wake up to. Shiv Subramaniam gone. Heartbreaking.
— Hansal Mehta (@mehtahansal) April 11, 2022
— Hansal Mehta (@mehtahansal) April 11, 2022
Extremely shocked and pained to know about the tragic demise of our dear friend, a great actor and a brilliant human being Shiv Subramaniam.
— Ashoke Pandit (@ashokepandit) April 11, 2022
My heartfelt condolences to his wife Divya. May God give you enough energy to face this tragedy .
ॐ शान्ति !
🙏 pic.twitter.com/LvTM0mZhFi
Gutted to hear this news. Incredibly tragic, esp as it happened just two months after the passing of his and Divya’s only child - Jahaan, taken by a brain tumour 2 weeks before his 16th birthday.
— beena sarwar (@beenasarwar) April 10, 2022
RIP #ShivkumarSubramaniam https://t.co/GkW6ATUhhN