Victory Venkatesh : వెంకటేష్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ - లెజెండరీ క్రికెటర్‌తో వెంకీ మామ సెల్ఫీ వైరల్!
Victory Venkatesh : వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివిన్ రిచర్డ్స్ తో సెల్ఫీ దిగిన పిక్ ని ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు విక్టరీ వెంకటేష్.
![Victory Venkatesh : వెంకటేష్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ - లెజెండరీ క్రికెటర్‌తో వెంకీ మామ సెల్ఫీ వైరల్! venkateshs fanboy selfie with cricket legend viv richards at the ind vs nz semi final Victory Venkatesh : వెంకటేష్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ - లెజెండరీ క్రికెటర్‌తో వెంకీ మామ సెల్ఫీ వైరల్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/15/f1247dad46cb6967e25ebcb16e10e5071700052479623753_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Venkatesh Fan Boy Moment : టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్(India Vs Newzeland) వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వెంకటేష్ ముంబై వెళ్లారు. ఈ క్రమంలోనే తన ఫేవరెట్ క్రికెటర్ తో వెంకి సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పిక్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ వెంకటేష్ ఏ క్రికెటర్ తో సెల్ఫీ దిగాడు? డీటెయిల్స్ లోకి వెళ్తే.. టాలీవుడ్ సినీ తారల్లో క్రికెట్ ని అమితంగా ఇష్టపడే వారిలో విక్టరీ వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. ప్రొఫెషనల్ లైఫ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే వెంకీ మామ క్రికెట్ లవర్ అనే విషయం అందరికీ తెలిసిందే.
ఎక్కడైనా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉందంటే చాలు షూటింగ్ సైతం పక్కనపెట్టి మరి స్టేడియం లోకి వాలిపోతుంటాడు. ఇక హైదరాబాదులో మ్యాచ్ ఉంటే అసలు మిస్ అవ్వడు. తాజాగా ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో విక్టరీ వెంకటేష్ సందడి చేశాడు. ఈ క్రమంలోనే తన ఫేవరెట్ క్రికెటర్స్ లో ఒకరైన వెస్టిండీస్ లెజెండరీ మాజీ క్రికెటర్ వివిన్ రిచర్డ్స్(Vivi Richards) తో కలిసి సెల్ఫీ దిగాడు. "ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో దిగ్గజ క్రికెటర్ వివిన్ రిచర్డ్స్ తో కలిసి ఉండడం ఎంతో ఆనందంగా ఉంది" అంటూ ట్వీట్ చేశాడు వెంకటేష్. వెంకీ మామ సెల్ఫీ పిక్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.
Delighted to be with the legendary Viv Richards at the #IndvsNZ Semi-final 😎❤️ pic.twitter.com/6A5MvqRZrn
— Venkatesh Daggubati (@VenkyMama) November 15, 2023
ఈ సెల్ఫీ పిక్ చూసిన నెటిజన్స్.. ‘‘వెంకటేష్ నిజమైన క్రికెట్ ఫ్యాన్, ఇవాళ ఇండియా విన్ అవ్వడం గ్యారంటీ’’, ‘‘మీరు వెళ్లారు కదా, ఇక మ్యాచ్ మనదే’’, ‘‘ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లెజెండ్స్’’ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక దగ్గుబాటి ఫ్యాన్స్ అయితే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ముంబైలో జరుగుతున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం హాజరవ్వడం విశేషం. ఈ సెమీ ఫైనల్ వీక్షించేందుకు కొందరు సెలెబ్రెటీలకు గోల్డెన్ పాస్ లు జారీ చేశారు. ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వారిలో రజినీకాంత్ కూడా ఒకరు.
ఇక ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ ని వీక్షించేందుకు చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చారు. రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహం తదితరులు సందడి చేశారు. ఇక విక్టరీ వెంకటేష్ విషయానికొస్తే.. ప్రస్తుతం శైలేష్ కొలను 'సైంధవ్'(Saindhav) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే? యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది.
రుహాని శర్మ, ఆండ్రియ జెర్మియా, కోలీవుడ్ హీరో ఆర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Also Read : వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' ట్రైలర్ వచ్చేది ఆరోజే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)