Aadikeshava Trailer : వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' ట్రైలర్ వచ్చేది ఆరోజే?
Aadikeshava Movie : వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'ఆదికేశవ' మూవీ ట్రైలర్ నవంబర్ 17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
Aadikeshava Trailer Update : 'ఉప్పెన'(Uppena) సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ తేజ్ మొదటి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. మెగా ఫ్యామిలీ హీరోల్లోనే బెస్ట్ డెబ్యూ వైష్ణవ్ కి ఉప్పెన రూపంలో దక్కడం విశేషం. 'ఉప్పెన' తర్వాత ఈ హీరో నటించిన 'కొండపొలం'(Kondapolam) 'రంగ రంగ వైభవంగా'(Ranga Ranga Vaibhavamga) వంటి సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయాయి.
ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా సాలిడ్ కొట్టాలనే ఉద్దేశంతో త్వరలోనే 'ఆదికేశవ'(Aadikeshava) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు వైష్ణవ్ తేజ్. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈసారి 'ఆదికేశవ' తో మాస్ హీరోగా మెప్పించేందుకు రెడీ అయ్యాడు వైష్ణవ్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్' సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు ట్రైలర్ అప్డేట్ ని అందించారు మేకర్స్. 'ఆదికేశవ' యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ ని నవంబర్ 17న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Get ready for an action-packed ride, #Aadikeshava theatrical trailer dropping on Nov 17th! 🔥 😎
— Sithara Entertainments (@SitharaEnts) November 15, 2023
In Cinemas #AadikeshavaOnNov24th 💥#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #JojuGeorge @aparnaDasss #SrikanthNReddy @NavinNooli @dudlyraj @vamsi84 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/eSim0iEtUI
ఈ మేరకు సినిమాకు సంబంధించి ఓ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ యాంగ్రీ లుక్ తో రెండు చేతుల్లో కత్తులు పట్టుకొని ఉండడం, వెనకాల మలయాళ నటుడు భోజు జార్జ్ సీరియస్ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పోస్టల్ బట్టి ఈ మూవీ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ సరసన యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ యాక్టర్స్ బోజు జార్జ్, అపర్ణ దాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. డడ్లీ, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని మొదట దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ ఆ సమయంలో వరల్డ్ కప్ మ్యాచ్ ఉండడంతో కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో సినిమాని నవంబర్ చివర్లో విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని నిర్మాత నాగ వంశీ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. నవంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 'ఉప్పెన' తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న వైష్ణవ తేజ్ కి 'ఆదికేశవ' ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.
Also Read : 'జవాన్' టైటిల్ సాంగ్‌కు మెగాస్టార్ డ్యాన్స్ - చిరుని ఎంకరేజ్ చేసిన చరణ్, వీడియో వైరల్!