Venkatesh Trivikram Srinivas: 20 ఏళ్ల తర్వాత వెంకీతో త్రివిక్రమ్ మూవీ? - స్టార్ట్ అయ్యేది అప్పుడేనా??
Venkatesh: మరోసారి హిట్ కాంబో రిపీట్ కానుందా?.. అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. త్వరలోనే విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ప్రకటన ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

Venkatesh Trivikram Srinivas Combo Movie Launching Date Buzz Gone Viral: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ అంటేనే ఓ స్పెషల్ కాంబో. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వీరిద్దరి కాంబోలో వచ్చిన లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నువ్వు నాకు నచ్చావ్'. ఈ మూవీకి స్టోరీ, డైలాగ్స్ రాశారు త్రివిక్రమ్. ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ లిస్ట్‌లో ఈ మూవీ ఉంటుంది.
క్రేజీ కాంబో రిపీట్?
ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ మూవీ చేయబోతున్నారని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం జూన్ 6న ఈ మూవీపై అధికారిక ప్రకటన రావొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే, ఈ మూవీ కామెడీ జానర్ మరేదైనా జానర్‌లో ఉంటుందా? అనే సస్పెన్స్ నెలకొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అంతే కాకుండా.. ఈ మూవీలో 'సప్త సాగరాలు దాటి' ఫేం రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తారని తెలుస్తోంది. ఇదే నిజమైతే మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ జానర్‌లోనే మూవీ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: థియేటర్స్ బంద్ కుట్ర వెనుక ద్వారంపూడి... వైసీపీ ఆటలో 'ఆ నలుగురు' పావులు అయ్యారా?
బన్నీతో మూవీ ఆలస్యం!
నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ఓ మైథలాజికల్ మూవీ చేయాల్సి ఉంది. రామాయణం, మహాభారతం వంటి ప్రసిద్ధ ఇతిహాసాలపై కాకుండా ఎవరికీ తెలియని మైథలాజికల్ స్టోరీస్ ఆధారంగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తామని కొద్ది రోజుల క్రితం ప్రొడ్యూసర్ నాగవంశీ తెలిపారు. అయితే, బన్నీ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్నారు. హై ఆక్టేన్ పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ ఈ షూటింగ్ ఈ ఆగస్టులోనే స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేటప్పటికీ చాలా టైం పట్టే ఛాన్స్ ఉన్నందున బన్నీతో త్రివిక్రమ్ మైథలాజికల్‌కు కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అటు.. త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ వర్క్ కోసం టైం తీసుకునేలా ఉన్నందునే ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందనే మరో రూమర్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన వేరే ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా వెంకటేష్‌తో మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
మరోవైపు.. 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు వెంకటేష్. ఆయన నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు' కూడా జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక అనిల్ రావిపూడి మెగాస్టార్ కాంబో మూవీలో ఆయన ఓ కీలక రోల్ చేస్తారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం అనిల్ చిరు మూవీ షూటింగ్ కొనసాగుతోంది. దీంతో తన తర్వాత ప్రాజెక్టులపై వెంకీ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌తో మూవీకి ఓకే చెప్పగా త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.






















