అన్వేషించండి

VenkyAnil3 SHOOT BEGINS: వెంకటేష్, అనిల్ రావిపూడిల సినిమా షూటింగ్ ప్రారంభం - టాలీవుడ్‌లోకి 'యానిమల్' నటుడు ఎంట్రీ, ఇదిగో మేకింగ్ వీడియో

VenkyAnil3 SHOOT BEGINS: వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా 'SVC 58' సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. 

VenkyAnil3 SHOOT BEGINS: విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'ఎఫ్ 2' 'ఎఫ్ 3' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఉగాది పండగ సందర్భంగా 'Venky Anil3' 'SVC 58' వంటి వర్కింగ్ టైటిల్స్ తో అనౌన్స్ చేయబడిన ఈ చిత్రాన్ని, ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం సోషల్ మీడియాలో మేకింగ్ వీడియోని షేర్ చేసారు. 

వెంకీ, అనిల్ రావిపూడిల సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్యాలెస్‌ సెట్ లో హీరోయిన్ తో సహా కొంతమంది ప్రధాన తారాగణం పాల్గొంటున్న కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు మేకింగ్ వీడియోలో కనిపిస్తోంది. సందడిగా జరుగుతున్న షూటింగ్ వాతావరణాన్ని మనం చూడొచ్చు. అలానే ఈ మూవీలో క్రైమ్ ఎలిమెంట్స్‌ ఉన్నాయనే విషయాన్ని సూచిస్తూ సెట్‌లో పెద్ద పెద్ద తుపాకీలను గమనించవచ్చు. 2025 సంక్రాంతికి విక్టరీ వినోదంలో కలుద్దాం అని చిత్ర బృందం వీడియో ద్వారా ప్రకటించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

ఇది ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కథతో తెరకెక్కే ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్ అని మేకర్స్ అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే క్లారిటీ ఇచ్చారు. ఇందులో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాజీ పోలీసాఫీసర్ గా వెంకీ నటిస్తుండగా.. భార్యగా ఐశ్వర్య, మాజీ ప్రేయసిగా మీనాక్షి నటిస్తున్నారు. ఇటీవల క్యారక్టర్ పోస్టర్స్ లో తాళి, గన్, గులాబీ పువ్వులను చూపించి ఆసక్తి రేకెత్తించారు. 

'వెంకీ అనిల్ 3' సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, ఉపేంద్ర లిమాయే, వీటీ గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, చైతన్య జొన్నలగడ్డ, ఆనంద్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉపేంద్ర లిమాయే గతేడాది వచ్చిన 'యానిమల్' చిత్రంలో ఫ్రెడ్డీ అనే గన్ డీలర్ పాత్రతో  'వాటే విజన్, వాటే థాట్' అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు 'SVC 58' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. నిజానికి ఉపేంద్ర 'జోగ్వా' అనే మరాఠీ చిత్రానికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. 

దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ సినిమాకి ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ గా, వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రిప్ట్ పనుల్లో భాగం అవుతున్నారు. 

వెంకటేశ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు లకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది పెద్ద పండక్కి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. దీనికి తగ్గట్టుగానే 6 నెలల్లోనే సినిమా పూర్తి చేసేలా పర్ఫెక్ట్ గా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. నవంబర్ నాటికి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చెయ్యాలని భావిస్తున్నారు. త్వరలోనే టైటిల్ ను ప్రకటించడంతో పాటుగా మరిన్ని అప్డేట్లు ఇస్తామని చిత్ర బృందం తెలిపింది. 

Also Read: ‘భారతీయుడు 2’ మూవీకి వెళ్తున్నారా? సినిమా ఎండింగ్‌లో సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన శంకర్, అది ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail Cancel: సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
సుప్రీంకోర్టుకు హైదరాబాద్ పోలీసులు - అల్లు అర్జున్ బెయిల్ రద్దు ఖాయమేనా ?
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
AIIMS: 'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది'  మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
'ఎయిమ్స్‌లో స్టూడెంట్‌గా చదవాలని ఉంది' మంగళగిరి ఆస్పత్రికి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్, ప్రథమ స్నాతకోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు
BRS MLAs Protest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - కేటీఆర్, హరీష్ దొరతనం బయటపడిందన్న మంత్రి సీతక్క
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Samyuktha Menon :  సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
Embed widget