Vasudheva Sutham Movie: అప్పుడు అమ్మోరు... ఇప్పుడు 'వసుదేవసుతం'... హీరోగా మహేంద్రన్ కొత్త సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్
Master Mahendran New Movie: 'అమ్మోరు' సహా తెలుగు తమిళ భాషల్లో పలు సినిమాల్లో బాల నటుడిగా చేసిన మహేంద్రన్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'వసుదేవ సుతం'. టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.

'అమ్మోరు' సహా పలు తెలుగు, తమిళ సినిమాల్లో మహేంద్రన్ (Master Mahendran) బాల నటుడిగా మెరిశారు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా మారారు. 'బేబీ' చైత్ర శ్రీ బాదర్ల, 'మాస్టర్' యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల ప్రొడ్యూస్ చేస్తున్న 'వసుదేవసుతం' చేశారు. దీనికి వైకుంఠ్ బోను దర్శకుడు. ఇదొక మైథలాజికల్ మూవీ. ఇందులో టైటిల్ సాంగ్‌ను యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ విడుదల చేశారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతంలో...
'వసుదేవ సుతం' చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడు. ఆయన స్వరకల్పనలో 'వసుదేవ సుతం దేవం' అంటూ సాగే గీతాన్ని ఆకాష్ జగన్నాథ్ విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా... పవన్ - శృతిక సముద్రాల ఆలపించారు.
దేవాలయం నేపథ్యంలో 'వసుదేవ సుతం దేవం' పాటను చితీకరించారు. లిరికల్ వీడియో చూస్తే... హీరో తల్లిగా తులసి కనిపించారు. హీరో మహేంద్రన్, హీరోయిన్ అంబికా వాణి జంట బావుంది.
Also Read: తేజస్విని నందమూరి యాడ్ చేసిన కంపెనీ ఎవరిదో తెలుసా? బాలకృష్ణ చిన్న కుమార్తె ఆ యాడ్ ఎందుకు చేశారంటే?
పాట విడుదల చేశాక ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ... ''మహేంద్రన్ అద్భుతమైన నటుడు. 'వసుదేవ సుతం దేవం' పాట బావుంది. చైతన్య ప్రసాద్ గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం చాలా బావున్నాయి. సినిమా హిట్ అవ్వాలి'' అని అన్నారు. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read: అల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ - మరి ఉపాసన సీమంతంలో అల్లు కుటుంబం ఎక్కడ?
Vasudheva Sutham Movie Cast And Crew: మాస్టర్ మహేంద్రన్ హీరోగా వస్తున్న ఈ 'వసుదేవ సుతం' సినిమాలో అంబికా వాణి, జాన్ విజయ్, 'మైమ్' గోపి, సురేష్ చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, భద్రమ్, 'జబర్దస్త్' రామ్ ప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్), సాహిత్యం: చైతన్య ప్రసాద్ - శ్రీ హర్ష ఈమని, నిర్మాణ సంస్థ: రెయిన్ బో సినిమాస్, సంగీతం: మణిశర్మ, నిర్మాత: ధనలక్ష్మి బాదర్ల, రచన, దర్శకుడు: వైకుంఠ్ బోను.





















