Varun Tej Blessed With Baby Boy: మెగా ఫ్యామిలీ మూడో తరంలో వారసుడొచ్చాడు... పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి
Varun Tej Lavanya Tripathi Blessed With Baby Boy: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులకు మగబిడ్డ జన్మించాడు. మెగా ఇంట సందడి నెలకొంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంట వారసుడు అడుగు పెట్టాడు. మెగా బ్రదర్ నాగబాబు తాతయ్య అయ్యారు. యువ కథానాయకుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తండ్రి అయ్యారు. సెప్టెంబర్ 10వ తేదీ... ఈ రోజు ఉదయం వరుణ్ తేజ్ భార్య హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పండంటి మగ బిడ్డకు జన్మ ఇచ్చారు.
చిరంజీవి ఇంట వారసుడొచ్చాడు!
మెగాస్టార్ చిరంజీవి ఇంట మూడో తరంలో మొదటి వారసుడిగా వరుణ్ తేజ్ కుమారుడు నిలిచాడని చెప్పాలి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో పాట చిత్రీకరణ చేస్తున్న చిరంజీవి... వరుణ్ తేజ్ - లావణ్య దంపతులకు బిడ్డ జన్మించిన విషయం తెలియగానే సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. కొడుకు - కోడలుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చిరంజీవి ఇంట ఐదుగురు మనవరాళ్ళు ఉన్నారు. రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. అటు చిరు కుమార్తెలు సుస్మిత - శ్రీజ... ఇద్దరికీ ఇద్దరేసి కుమార్తెలు ఉన్నారు. దాంతో కొణిదెల కుటుంబంలో మూడో తరంలో మొదటి మగ బిడ్డ వరుణ్ తేజ్ కుమారుడు అయ్యాడు. అబ్బాయి జననంతో మెగా ఇంట సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు అందరూ మెగా మనవడిని చూడటానికి ఆసుపత్రికి వెళుతున్నారు.
Also Read: అమెరికాలో 'ఓజీ'కి అన్యాయమా? పవన్ ఫ్యాన్స్ ఫైర్... క్లారిటీ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్!
మెగా ఇంట వారసుడొచ్చాడు!#VarunTej #LavanyaTripathi #MegaFamily#Chiranjeevi #MSG #ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/YQJW08PmMJ
— ABP Desam (@ABPDesam) September 10, 2025
Varun Tej - Lavanya Tripathi Upcoming Movies: ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలకు వస్తే... మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో కొరియన్ హారర్ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు' చేస్తున్నారు. గర్భవతి కావడానికి ముందు లావణ్య త్రిపాఠి కొన్ని చిత్రాలు పూర్తి చేశారు. అందులో తమిళ హీరో అథర్వా మురళీకి జంటగా నటించిన 'టన్నెల్' ఒకటి. సెప్టెంబర్ 19... అంటే ఈ శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో ఆ సినిమా విడుదల అవుతుంది. మలయాళ కథానాయకుడు దేవి మోహన్ జంటగా మరొక సినిమా చేశారు లావణ్య త్రిపాఠి. ఆ చిత్రానికి 'సతీ లీలావతి' టైటిల్ ఖరారు చేశారు. ఇటీవల ఫస్ట్ లుక్, ఇంకా టీజర్ రిలీజ్ చేశారు.
Also Read: విజయవాడలో మెగా సందడికి రెడీ... ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ & చిరంజీవి... 'ఓజీ' ఈవెంట్ అప్టేట్





















