Valentine's Day Song: 'జస్ట్ ఎ మినిట్' అంటోన్న 'ఏడు చేపల కథ' హీరో - లవర్స్ డేకి కొత్త పాటతో...
Just A Minute Telugu movie song: ప్రేమికుల రోజు సందర్భంగా 'జస్ట్ ఎ మినిట్' సినిమాలోని ప్రేమ పాటను తాజాగా విడుదల చేశారు.
'ఏడు చేపల కథ' సినిమాతో పాపులరైన యంగ్ హీరో అభిషేక్ పచ్చిపాల. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'జస్ట్ ఎ మినిట్'. ఒక్క నిమిషం మాత్రమే... అని ఆ టైటిల్ తెలుగు మీనింగ్. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నజియ ఖాన్ హీరోయిన్. జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ఇతర ప్రధాన తారాగణం. రెడ్ స్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ సంస్థలపై అర్షద్ తన్వీర్, డా. ప్రకాష్ ధర్మపురి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రెండో పాటను తాజాగా విడుదల చేశారు.
ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమ పాట
'జస్ట్ ఎ మినిట్' సినిమాకు ఎస్.కె. బాజీ సంగీత దర్శకుడు. కొన్ని రోజుల క్రితం 'నువ్వు వస్తావని అంటూ...' సాగే గీతాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా 'నువ్వంటే ఇష్టం' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం అందించగా... హైమత్ మహ్మద్ ఆలపించారు.
'నువ్వంటే ఇష్టం...' సాంగ్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ... ''ఇంతకు ముందు మేం విడుదల చేసిన 'జస్ట్ ఎ మినిట్' ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాటికి చాలా మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత టీజర్ విడుదల చేశారు. దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'జస్ట్ ఎ మినిట్' టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్ని ఇస్తోంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అందులో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన హైమత్ మహ్మద్ గారు ఈ 'నువ్వంటే ఇష్టం' సాంగ్ పాడడం చాలా ప్లస్ అయ్యింది. రాంబాబు గోసాల గారు యువతను ఆకట్టుకునే సాహిత్యం అందించారు'' అని చెప్పారు.
Also Read: రకుల్, జాకీ అదిరిపోయే నిర్ణయం - పెళ్లి వేడుకలో వాటికి అనుమతి లేదట!
'జస్ట్ ఎ మినిట్' నిర్మాతలు అర్షద్ తన్వీర్, డా. ప్రకాష్ ధర్మపురి మాట్లాడుతూ... ''మా సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. మా సినిమా నుంచి విడుదలయ్యే మిగతా పాటలు, ట్రైలర్, ప్రచార చిత్రాలకు సైతం ఇదే ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాం. సినిమాను మంచి సక్సెస్ చేయాలని ఆశిస్తున్నాం'' అని చెప్పారు.
అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్ జంటగా... జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి, ఇషిత, వినీషా, కుషి భట్, నాగిరెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఛాయాగ్రహణం: అమీర్, కళా దర్శకత్వం: శేఖర్ ఇప్పకాయల, కూర్పు: దుర్గ నరసింహ, సాహిత్యం : రాంబాబు గోసాల, సంగీతం: ఎస్.కె. బాజీ, నిర్మాణం: రెడ్ స్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్, నిర్మాతలు: అర్షధ్ తన్వీర్ - డా. ప్రకాష్ ధర్మపురి, రచన, దర్శకత్వం: పూర్ణస్ యశ్వంత్.