Ustaad Bhagat Singh Glimpse : పాతబస్తీలో పోలీసుగా పవన్ కళ్యాణ్, పెర్ఫార్మన్స్ బద్దలే - 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ వచ్చేసింది
Ustaad Bhagat Singh First Glimpse Review : పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ విడుదలైంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు దర్శకుడు హరీష్ శంకర్ వీరాభిమాని. ఈ విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. అభిమాన హీరో అవకాశం ఇవ్వాలే గానీ ఎటువంటి సినిమా తీస్తాననేది 'గబ్బర్ సింగ్'తో చూపించారు. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' తీస్తున్నారు.
హరీష్ శంకర్ పదకొండేళ్ళ కల!
ఉస్తాద్ భగత్ సింగ్... హరీష్ శంకర్ పదకొండేళ్ళ కల! 'గబ్బర్ సింగ్' తర్వాత మళ్ళీ అభిమాన కథానాయకుడితో ఆయన చేస్తున్న చిత్రమిది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 'గబ్బర్ సింగ్' విడుదలై పదకొండు ఏళ్ళు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు 'ఉస్తాద్ గబ్బర్ సింగ్' ఫస్ట్ గ్లింప్స్ (Ustaad Bhagat singh First Glimpse) విడుదల చేశారు. అది ఎలా ఉంది అంటే...
పాతబస్తీలో పోలీస్ అధికారిగా పవన్ కళ్యాణ్ కనిపించారు. లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్... 'ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది' అని చెప్పే డైలాగ్ హైలైట్ అని చెప్పాలి.
'ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో... అధర్మము వృద్ధిన ఉండునో... ఆయా సమయముల అందు, ప్రతి యుగమున అవతారాము దాల్చుచున్నాను' అని ఘంటసాల వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ మొదలైంది. ఆ తర్వాత 'భగత్ సింగ్... మహంకాళి పోలీస్ స్టేషన్, అఫ్జల్ గంజ్! పాతబస్తీ' అని పవన్ కళ్యాణ్ చెప్పే మాట, ఆ వాకింగ్ స్టైల్, కళ్ళజోడు పెట్టుకుని చేతులు ఊపే స్వాగ్ సూపర్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. లాస్ట్ షాట్ అయితే హైలైట్!
''గబ్బర్ సింగ్' పదేళ్ళ అభిమానుల ఆకలి తీరిస్తే... ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నా పదకొండేళ్ల ఆకలి'' అని హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య 35 ఎంఎం థియేటర్లో జరిగిన గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ వ్యాఖ్యానించారు. అది ఫైట్ సీక్వెన్సులో లుక్ అని అర్థం అవుతోంది. పవన్ కళ్యాణ్ వెనుక చాలా మంది ముస్లింలు ఉన్నారు. చెక్ పోస్ట్ దగ్గర సీన్ అనుకుంట!
గ్లింప్స్ కంటే ముందు లుక్కుతో కిక్!
'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ విడుదల చేయడానికి కొన్ని గంటల ముందు పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పవన్ మాస్ స్టైల్, ఆ స్వాగ్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చింది.
Also Read : మహేష్ సినిమా టైటిల్ అదేనా? సెంటిమెంట్ కంటిన్యూ చేసిన త్రివిక్రమ్
పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల ఓ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అశుతోష్ రాణా, నవాబ్ షా, 'కేజీఎఫ్' అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, 'టెంపర్' వంశీ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : చోటా కె. ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : ఆనంద్ సాయి, యాక్షన్ (పోరాటాలు) : రామ్ - లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రావిపాటి చంద్రశేఖర్, హరీష్ పాయ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం : అయనంకా బోస్, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, నిర్మాతలు : నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, రచన - దర్శకత్వం : హరీష్ శంకర్ ఎస్.
Also Read : శకుంతలే కాదు, సమంత 'శాకుంతలం' కూడా అనాథే