Malayalam Star Usha: సీనియర్ యాక్టర్ తప్పుగా ప్రవర్తిస్తే చెంప మీద కొట్టా.. అప్పుడు మోహన్ లాల్ ఎమన్నారంటే - నటి ఉష
మలయాళం సినిమా ఇండస్ట్రీని క్యాస్టింగ్ కౌచ్ వివాదం షేక్ చేస్తుంది. చాలామంది నటులు బయటికి వచ్చి ఇబ్బందులు చెప్తున్నారు. సీనియర్ యాక్టరస్ ఉష 30 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని పంచకున్నారు.
Malayalam Star Usha Recalls Senior Actor Misbehaved With Her: కేరళలో ప్రస్తుతం మీటూ ఉద్యమం ఊపు అందుకుంది. కాస్టింగ్ కౌచ్ వివాదం రచ్చ లేపుతుంది. చాలామంది నటీనటులు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని, తాము ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి చెప్తున్నారు. దాంట్లో భాగంగా సీనియర్ నటి ఉష తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని మీడియాతో చెప్పారు. అప్పుడు అలా జరగడం వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని, ఛాన్సులు కూడా రాలేదని చెప్పారు ఉష. అసలు ఏం జరిగిందంటే?
సీనియర్ నటుడిని కొట్టాను..
మాలీవుడ్ లో హీరోయిన్లు, కొంతమంది లేడీ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్ హేమా కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక కేరళలో పెద్ద దుమారం రేపింది. దీంతో చాలామంది నటులు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు సీనియర్ నటి ఉష తనకు 1992లో జరిగిన ఒక విషయం గురించి చెప్పుకొచ్చారు. లిఫ్ట్ లో ఒక సీనియర్ నటుడు తనతో తప్పుగా ప్రవర్తించారని అన్నారు. “చాలామంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని నన్ను ప్రశ్నించొచ్చు. కానీ, నేను అప్పుడే దాని గురించి మాట్లాడాను. దానివల్ల నాకు చాలా ఛాన్సులు మిస్ అయ్యాయి. ఇప్పుడు సందర్భంగా వచ్చింది కాబట్టి చెప్తున్నారు. బెహ్రైన్ లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ అయిపొయి తిరుగు ప్రయాణం అవ్వాలి. అందరం అలసిపోయి ఉన్నాం. లగేజ్ అంతా తీసుకుని లాబీలోకి వస్తే కబుర్లు చెప్పుకోవచ్చు అని మోహల్ లాల్ గారు చెప్పడంతో అందరం వస్తున్నం. అప్పుడే ఒక సీనియర్ యాక్టర్ వచ్చాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు లెండి. తను కూడా నాతో పాటు కిందికి వస్తానని లిఫ్ట్ ఎక్కాడు. ఎక్కిన వెంటనే నాతో మిస బిహేవ్ చేశాడు. వెంటనే లాగి లెంపకాయ కొట్టాను ” అని చెప్పారు ఉష.
మోహన్ లాల్ కి చెప్తే..
“అప్పుడు మాతో పాటు ఈవెంట్ కి మోహన్ లాల్, మోనిషా, రేవతి, సుకుమారి అందరూ వచ్చారు. సుకుమారి నన్ను చూసి.. ఏం జరిగింది అని అడిగితే నేను జరిగింది చెప్పాను. ఆమె ఆ విషయం మోహన్ లాల్ గారికి చెప్పింది. ఆయన చాలా మంచి పని చేశారు అని అన్నారు. ఇక అదే విషయాన్ని అప్పుడు అసోసియేషన్ కి కూడా చెప్పాము. కానీ, అది నాకే రివర్స్ అయ్యింది. అప్పుడు నాపై కోపిష్టి అని ముద్ర వేశారు. చాలా రోజులు ఛాన్స్ రాలేదు. ఎవ్వరూ నాతో పని చేయను అని చెప్పారు” అని తన అనుభవాల గురించి చెప్పారు ఉష.
మలయాళ సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామలపై కలత చెందిన మోహన్ లాల్ అసోసియేషన్ ఆఫ్ మలయాళి మూవీ అసోసియేషన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కమిటీ మెంబర్స్ పైన ఆరోపణలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల తర్వాత ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు కొత్త అసోసియేషన్ ఏర్పడుతుందని చెప్పారు మోహన్ లాల్.
Also Read: సందీప్ కిషన్ రెమ్యూనరేషన్ పెంచాడా? త్రినాథరావు నక్కిన సినిమా బడ్జెట్ అంత ఎక్కువా?