అన్వేషించండి

Klin Kaara: క్లింకార ఫస్ట్‌ కృష్ణాష్టమి - పూజలో మెగా వారసురాలు, ఎంత క్యూట్‌గా ఉందో చూడండి!

Upasana: మెగా కోడలు ఉపాసన కృష్ణాష్టమి సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మెగా వారసురాలు క్లింకార ఫోటో షేర్‌ చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. 

Upasana Shared klin Kaara Photo: దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మునిగితెలారు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఈ పండుగ వేడుకలు సంబంధించిన ఫోస్ట్స్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన చేసిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి కారణం మెగా మనవరాలు క్లింకార. క్లింకార మొదటి కృష్ణాష్టమి ఇది. ఈ సందర్భంగా తన ముద్దుల కూతురితో కలిసి మెగా దంపతులు పూజలో పాల్గొన్నారు.Klin Kaara: క్లింకార ఫస్ట్‌ కృష్ణాష్టమి - పూజలో మెగా వారసురాలు, ఎంత క్యూట్‌గా ఉందో చూడండి!

ఇందుకు సంబంధించిన ఫోటోలు ఉపాసన ట్విటర్‌లో షేర్‌ చేయగా ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. అమ్మ & కార స్వీట్‌ సింపుల్‌ పూజ అంటూ ఉపాసన ఈ ఫోటో రిలీజ్‌ చేసింది. అంతేకాదు అందరికి కృష్ణాష్టమి  శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఫొటోల్లో బుల్లి క్లింకార దేవుడు ముందు కూర్చోని క్యూట్‌గా కనిపించింది. ఈ ఫోటోకు సోషల్‌ మీడియాలో నెటిజన్లను నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇక మెగా వారసురాలిని ఇలా చూసి మెగా ఫ్యాన్స్‌ అంతా మురిసిపోతున్నారు. 

అయితే ఈ ఫోటోల్లోనూ ఉపాసన క్లింకార ఫేస్‌ రివీల్‌ కాకుండ జాగ్రత్త పడింది. దీనిపై నెటజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. క్లింకరా ఈ ఫోటోల్లో చాలా క్యూట్‌గా ఉందని, తనని ఎప్పుడు చూపిస్తారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా క్లింకార పుట్టి ఏడాది గడిచిన ఇంకా తనని మీడియాకు పరిచయం చేయలేదు. ఈ విషయంలో ఫ్యాన్స్‌ కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్భంగా కుటుంబ సమేతంగా చరణ్‌ తిరుపతి వెళ్లాడు. అక్కడ మొక్కులు చెల్లించుకుంటుండగా క్లింకార ఫేస్‌ కాస్తా రివీల్‌ అయ్యింది. అది ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. ఈ లేటెస్ట్‌ ఫోటోల్లో బుల్లి క్లింకార తల్లిదండ్రులు(రామ్‌ చరణ్‌, ఉపసాన)తో పాటు నానమ్మ(చిరంజీవి సతీమణి) సురేఖతో పూజలో పాల్గొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.


రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈ సినిమాను క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తామని నిర్మాత దిల్‌ రాజు ఓ ఈవెంట్‌లో వెల్లడించాడు. అయితే రిలీజ్‌ డేట్‌ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. పైగా ఇప్పటి వరకు దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే భారతీయుడు 2 డిజాస్టర్‌ తర్వాత గేమ్‌ ఛేంజర్‌ విషయంలో ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విషయంలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ బాగా రాలేదని, వాటిని మళ్లీ రీషూట్‌ చేయాల్సి ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై శంకర్‌ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.

Also Read: అర్థరాత్రి ఫోన్ చేసి నాతో పడుకుంటావా అన్నాడు.. ‘తులసి’ నటుడు రియాజ్‌పై నటి రేవతి ఆరోపణలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Ram Charan Upasana: రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP DesamInd vs nz First Half Highlights | Champions Trophy 2025 Final లో భారత్ దే ఫస్ట్ హాఫ్ | ABP DesamInd vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాంInd vs Nz Champions Trophy 2025 Final | MS Dhoni కథకు క్లైమాక్స్ ఈరోజే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Ram Charan Upasana: రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
Prabhas Prashanth Varma Movie: బ్రహ్మ రాక్షస కాదు... ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు కొత్త టైటిల్
బ్రహ్మ రాక్షస కాదు... ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు కొత్త టైటిల్
BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు- మరింత లోతుకు వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు 
Embed widget