Upasana Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన మెగా కోడలు - క్లింకార ట్విన్ సిస్టర్స్‌ని పరిచయం చేసిన ఉపాసన! ఫొటో వైరల్
Upasana: మెగా కోడలు ఉపాసన గుడ్‌న్యూస్ పంచుకున్నారు. తమ కూతురు క్లింకార అక్క అయ్యిందని, తనకు ఓ కంపెనీ దొరికిందంటూ ట్విన్ సిస్టర్స్ ఫొటోలు షేర్ చేశారు.
Upasana Introduce Klin Kaara Twin Sisters: మెగా కోడలు ఉపాసన గుడ్‌న్యూస్ పంచుకున్నారు. తమ కూతురు క్లింకార అక్క అయ్యిందని, తనకు ఓ కంపెనీ దొరికిందంటూ ట్విన్ సిస్టర్స్ ఫొటోలు షేర్ చేశారు. కాగా ఉపాసన కొణిదెల కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తుంది. రామ్ చరణ్, తన కూతురు క్లింకార బాండింగ్‌తో పాటు పలు ఆసక్తికర విశేషాలను రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో షేర్ చేసింది. అయితే తాజాగా ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరైన ఉపాసన ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ క్లింకార ట్విన్ సిస్టర్స్‌ని పరిచయం చేశారు.
ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా ఉపాసనకు ఒక చెల్లి ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు అన్షుపాల. ఏడాదిన్నర క్రితం ఆమె పెళ్లి పీటలు ఎక్కింది. అయితే రీసెంట్‌గా అన్షుపాల దంపతులకు ట్విన్స్ పుట్టారు. ఈ సందర్భంగా చరణ్-ఉపాసన దంపతులతో పాటు అన్షుపాల దంపతులు ఫొటోలు దిగారు. ఇందులో వారి ట్విన్స్ కూడా ఉన్నారు. ఇక వారినే పరిచయం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాసన ‘అద్భుతమైన ముగ్గురిని మీకు పరిచయం చేస్తున్నా. వీరంతా పవర్ పఫ్ గర్ల్స్. క్లీంకార తన ఇద్దరు ట్విన్ సిస్టర్స్ ఆరా పుష్ప ఇబ్రహీం, రైకా సుచరత ఇబ్రహీంలతో కలిసి జాయిన్ అయ్యింది" అంటూ రాసుకొచ్చింది. దీంతో ఉపాసన చెల్లి అన్షుపాల దంపతులకు స్నేహితులు, సన్నిహితులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: మహేష్ సినిమాను రిజెక్ట్ చేసిన రష్మి? - క్లారిటీ ఇచ్చిన యాంకర్
View this post on Instagram
కాగా మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తమ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. కాగా పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత చరణ్-ఉపాసనలకు క్లింకార జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో మెగా వారసురాలు మెగాఫ్యామిలీలోకి అడుగుపెట్టింది. ఇక మెగా వారసురాలు రాకతో మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగితేలుతుంది. ఇక ఉపాసన కూడా క్లీంకార గురించి ఆసక్తికర విషయాలు చెబుతూ వస్తుంది. ఇప్పటికే తనకోసం ఓ స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసింది. అంతే కాదు క్లింకార ఆలనపాలన కోసం ప్రత్యేకంగా కేర్ టేకర్‌ను కూడా పెట్టేసింది.
View this post on Instagram