అన్వేషించండి

True Lover: ఓటీటీలోకి ‘ట్రూ లవర్’ - స్ట్రీమింగ్ అందులోనే!

True Lover OTT: మణికందన్ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ట్రూ లవర్’ తాజాగా థియేటర్లలో విడుదలయ్యింది. ఇక అప్పుడే దీని ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు వైరల్ అయ్యాయి.

True Lover Movie OTT: ఈరోజుల్లో ప్రేక్షకులకు.. ముఖ్యంగా యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలే ఎక్కువగా హిట్స్‌ను అందుకుంటున్నాయి. ఎక్కువగా ప్రమోషన్స్ లేకపోయినా.. సైలెంట్‌గా వచ్చి సూపర్ హిట్స్ అవుతున్నాయి. అలాంటి కేటగిరికి చెందిన సినిమానే ‘ట్రూ లవర్’. తమిళంలో ‘లవర్’ అనే టైటిల్‌తో, తెలుగులో ‘ట్రూ లవర్’ అనే టైటిల్‌తో ఈ సినిమా విడుదలయ్యింది. తమిళ నటుడు మణికందన్ లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీ.. యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమలో వచ్చే సమస్యలపై ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా థియేటర్లలో విడుదలయిన ‘ట్రూ లవర్’.. ఏ ఓటీటీలోకి వస్తుందా అని చర్చలు మొదలయ్యాయి.

‘గుడ్ నైట్’ తరహాలోనే..

ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ‘ట్రూ లవర్’ ఇటీవల థియేటర్లలో విడుదలయ్యింది. ఎన్నో తెలుగు సినిమాల మధ్య పోటీగా ఈ తమిళ డబ్బింగ్ చిత్రం విడుదలయినా కూడా యూత్ చాలామంది దీనిని చూడడానికి థియేటర్లకు వెళుతున్నారు. అందుకే యూత్ అటెన్షన్‌ను సంపాదించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్ సినిమానే అయినా.. ‘ట్రూ లవర్’ ఓటీటీ రైట్స్ కోసం హాట్‌స్టార్ భారీగానే ఖర్చు పెట్టిందట. మణికందన్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘గుడ్ నైట్’ కూడా ఈ ఓటీటీలోనే స్ట్రీమ్ అయ్యింది. ఇప్పుడు ‘ట్రూ లవర్’ హక్కులను కూడా ఈ ఓటీటీనే దక్కించుకోవడం విశేషం.

ఆ రూల్ ప్రకారం..

‘ట్రూ లవర్’ ఓటీటీ హక్కులను హాట్‌స్టార్ దక్కించుకుందని తెలిసినా.. స్ట్రీమింగ్ ఎప్పటినుండి ప్రారంభమవుతుందో ఇంకా క్లారిటీ లేదు. మామూలుగా ఈరోజుల్లో థియేటర్లలో సినిమా విడుదలయిన 30 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ ప్రకారం చూస్తే.. ‘ట్రూ లవర్’ కూడా మార్చి రెండో వారంలో ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మూవీలో మణికందన్‌కు జోడీగా తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియా నటించింది. ఇప్పటికే ఈ భామ.. ‘రైటర్ పద్మభూషణ్’లో కీలక పాత్ర పోషిస్తూ వెండితెరకు పరిచయమయ్యింది. తాజాగా విడుదలయిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’లో కూడా ఒక హీరోయిన్‌గా అలరించింది. ఇప్పుడు ఏకంగా సోలో హీరోయిన్‌గా కోలీవుడ్‌లో అడుగుపెట్టింది.

తెలుగు మార్కెట్‌పై ఫోకస్..

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. 'ట్రూ లవర్'లో యువతీ యువకులు రిలేట్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి. సీన్లతో కనెక్ట్ కావచ్చు. కానీ, కథతో కనెక్ట్ కావడం కష్టం. కాంటెంపరరీగా తీశారు కానీ కథను కన్విన్సింగ్‌గా చెప్పలేదు. హీరో హీరోయిన్లు బాగా చేశారు. మ్యూజిక్ బావుంది. ప్రచార చిత్రాలు, పాటలు చూసి ఎక్కువ అంచనాలు పెట్టు‌కోవద్దు. యువతను మెప్పించే, వాళ్లతో విజిల్స్ వేయించే సన్నివేశాలకు 'ట్రూ లవర్'లో లోటు లేదు. మణికందన్ హీరోగా నటించిన ‘గుడ్ నైట్’ చిత్రాన్ని హాట్‌స్టార్‌లో తెలుగులో చూసి తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. అందుకే ఇతర తమిళ హీరోల్లాగా తాను కూడా టాలీవుడ్ మార్కెట్‌పై ఫోకస్ చేయాలనే ఉద్దేశ్యంతో తమిళంలో ‘లవర్’గా తెరకెక్కించిన సినిమాను తెలుగులో ‘ట్రూ లవర్’ పేరుతో విడుదల చేశాడు.

Also Read: ఆ సమయంలో నా పక్కనే ఉంది - రెజీనాతో రిలేషన్‌పై సందీప్ కిషన్ క్లారిటీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget