happy birthday trisha: త్రిషను వెంటాడిన ఆ వివాదాలు! - 'మిస్ చెన్నై' నుంచి పాన్ ఇండియా హీరోయిన్ వరకు, ఈ 'నాయకి' నట ప్రస్థానం
trisha birthday today: నేడు అందాల రాశి త్రిష బర్త్‌డే. మే 4న 40 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె వ్యక్తిగత జీవితం, నట ప్రస్థానం మీ కోసం..
Happy Birthday Trisha: త్రిష కృష్ణన్.. ఈ పేరు వింటే కుర్రకారు గుండెల్లో అలజడి.. అదే అమ్మాయిల్లో అసూయ. అంతగా తన అందంతో కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. నాలుగు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో అందరిని సర్‌ప్రైజ్ చేస్తుంది ఈ చెన్నై చంద్రం. హీరోయిన్స్ సైతం ఆమె గ్లామరస్ లుక్ చూసి కళ్లుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇక మొన్నటి వరకు మూవీ ఆఫర్స్ లేక సినిమాలకు దూరంగా ఉన్న త్రిష పొన్నియిన్ సెల్వన్‌తో మళ్లీ ఒక్కసారి మెరిసింది.
అప్పటి నుంచి వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుత చిరంజీవి విశ్వంభర సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది త్రిష. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన ఈ భామ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా పుల్ ఖుష్ అవుతున్నారు. అంతలోనే త్రిష బర్త్‌డే రావడంతో అభిమానుల ఆనందం మరింత రెట్టింపు అయ్యింది. నేడు త్రిష బర్త్‌డే. మే 4నతో త్రిష 41వ పడిలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఓ సారి ఈ 'మిస్ చెన్నై' సినీ ప్రస్థానం, వ్యక్తిగత విషయాలపై ఓ లుక్కేయండి!
ఒకే ఏడాది రెండు అందాల పోటీల్లో కీరిటం
త్రిష 1983 మే 4న కృష్ణన్ అయ్యర్-ఉమా అయ్యర్ దంపతులకు జన్మించింది. చెన్నైలోని చర్చి పార్క్‌లోని శాక్రిడ్ హార్ట్ మెట్రిక్యులేషన్ స్కూల్ విద్యాబ్యాసం చేసింది. ప్లస్ టూ వరకు ఈ స్కూల్లోనే చదివిన త్రిష యతిరాజ్ కాలేజ్ ఫర్ విమెన్‌లో బీబీఏ పూర్తి చేసింది. డిగ్రి తర్వాత త్రిష మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. మోడల్‌గా పలు షోలో పాల్గొన్న ఆమె అదే సమయంలో పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. 1999లో 'మిస్ సేలమ్' అందాల పోటీలో పాల్గోని కీరిటం గెలుచుకుంది. అదే ఏడాది 'మిస్ మద్రాస్' పోటీలోనూ గెలిచి మిస్ చెన్నైగా అందాల కీరిటాన్ని కైవసం చేసుకుంది. 2001లో జరిగిన మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న త్రిష 'బ్యూటీపుల్ స్మైల్' అవార్డును సొంతం చేసుకుంది. అందాల పోటీలో పలు అవార్టులు గెలుచుకున్న త్రిష నటనపై ఆసక్తితో ఉన్న చదువు కోసం నటనను పక్కన పెట్టింది. క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలని అనుకున్న త్రిషకు అదే సమయంలో ఫల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియో సాంగ్‌లో మేరీ చునార్ ఉద్ ఉద్ద్ జాయేలో నటించే ఆఫర్ వచ్చింది.
ఆ అల్బం సాంగ్‌తో నట ప్రస్థానం..
ఇందులో అయోషా టాకియా స్నేహితురాలిగా కొన్ని సెకన్ల పాటు కనిపించింది. వెండితెరపై త్రిషను చూసిన డైరెర్ట్ ప్రవీణ్ గాంధీ తన తమిళ చిత్రం 'జోడి'లో చిన్న పాత్ర ఇచ్చారు. ఇందులో త్రిష ఓ సీన్ అలా మెరిసి ఇలా వెళ్లిపోతుంది. ఆ కొద్దిసేపు తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకున్న త్రిష ఆ వెంటనే హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. 2003లో తమిళ డైరెక్టర్ ప్రియదర్శన్ తెరకెక్కించిన లెసా లెసా సినిమాతో హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి త్రిష మన తెలుగు డైరెక్టర్స్‌ని సైతం ఆకట్టుకుంది. దాంతో 'నీ మనసు నాకు తెలుసు' చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తరుణ్ హీరోగా నటించగా శ్రియా శరణ్ సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఆ తర్వాత నటిగా త్రిష వెనక్కి తిరిగి తీసుకోలేదు. ఈ చిత్రంలో త్రిష అందం, అభినయానికి ఆడియన్స్ మాత్రమే కాదు దర్శక-నిర్మాతలు సైతం ఫిదా అయ్యారు. దీంతో తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రెండో మూవీకే ఏకంగా ప్రభాస్‌తో జతకట్టింది. ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్‌గా వీరిద్దరి కాంబినేషన్‌తో తెరకెక్కిన తొలి చిత్రం 'వర్షం'. ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. మ్యూజిక్ పరంగానూ ఈ సినిమా అదరగొట్టింది. అప్పుట్లో వర్షం ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ప్రేమకథ చిత్రంగా వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది.
ఆ వివాదంతో కెరీర్‌కు బ్రేక్?
త్రిష-ప్రభాస్‌ల ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు ఆడియన్స్ వందకు వంద మార్కులు వేశారు. దాంతో బ్యాక్ టూ బ్యాక్ ప్రభాస్‌తో మూడు సినిమాలు తీసి హిట్ అందుకుంది త్రిష. అలా ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఇలా స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగువెలిగింది. హీరో సిద్ధార్థ్‌తో కలిసి నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ మూవీగా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. మరోవైపు తమిళంలోనూ నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే మధ్యలో త్రిషను ఓ సంఘటన తీవ్రంగా కలిచి వేసింది. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న ఆమెకు న్యూడ్ వీడియో అంటూ ఒకటి బయటకు వచ్చింది. అప్పట్లో అది సంచలనం అయ్యింది. ఆ తర్వాత కూడా త్రిష పలు వివాదాల్లో చిక్కుంది. ఒకటైంలో అర్థరాత్రి బాగా తాగి నడిరోడ్డుపై రచ్చ చేసిందంటూ త్రిష వీడియో ఒకటి వార్తల్లో నిలిచింది. అది ఆమె సినీ కెరీర్‌ను దెబ్బతిసిందని కూడా చెప్పాలి. అప్పటి వరకు స్టార్ హీరోయిన్‌గా ఉన్న త్రిష ఈ సంఘన కాస్తా అవకాలు దక్కాయనేది అభిమానుల అభిప్రాయం.
'విశ్వంభర'తో రీఎంట్రీ
అలా తెలుగు, తమిళంలో వరుసపెట్టి సినమాలు చేసిన త్రిష తెలుగులో చివరగా తీన్‌మార్ మూవీలో సందడి చేసింది. ఈ సినిమా తర్వాత త్రిష తెలుగులో చిత్రాల్లో కనిపించలేదు. కానీ అప్పుడప్పుడు తమిళంలో లేడీ ఓరియంటెట్ కథల్లో మెరిసింది. ఆ సినిమాలను డబ్బింగ్ వెర్షలో తెలుగులో చూసి మురిసిపోయేవారు ఆమె ఫ్యాన్స్. అయితే ఇక తెలుగులో త్రిష రీఎంట్రీ ఎప్పుడెప్పుడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్'లో మెరిసింది. ఇందులో త్రిష కుందవైగా యువరాణి పాత్రలో నటించింది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో త్రిషను చూసి అంతా అవాక్క్ అయ్యారు. అదే చెక్క చెదరని అందంతో అందరిని సర్‌ప్రైజ్ చేసింది త్రిష. అంతేకాదు ఈ మూవీ ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మెరిసిన ఆమె ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ సందడి చేశాయి. అప్పట్లో అంతా త్రిష అందం గురించే మాట్లాడుకున్నారు.అసలేం తింటుందబ్బా నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికే అదే గ్లామర్, యంగ్ లుక్‌ను ఎలా మెయింటైన్ చేయగలుకుతున్నారా? ఎన్నో ఇంటర్య్వూలో సైతం త్రిష ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ దెబ్బ త్రిషను మళ్లీ ఆఫర్స్ పలకరించడం మొదలైంది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతోనే త్రిష తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది.