Love At 65 Trailer: లేటు వయసులో లేచిపోవడం ఏమిటో - రాజేంద్ర ప్రసాద్, జయప్రదల ‘లవ్ @ 65’ ట్రైలర్ చూశారా?
రాజేంద్ర ప్రసాద్ , జయప్రద ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్ ఎట్ 65’. విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను విడుదల చేశారు.
Rajendra Prasad and Jayapradha’s Love At 65 Trailer Out: సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ ఎట్ 65’. దర్శకుడు విఎస్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కించారు. సరికొత్త కంటెంట్ తో ఫుల్ ఫన్నీగా ఈ సినిమా రూపొందింది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్ ను విడుదల చేసింది.
ఫన్నీ, ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న ‘లవ్ ఎట్ 65’ ట్రైలర్
‘లవ్ ఎట్ 65’ ట్రైలర్ పూర్తిగా ఫన్నీ, ఎమోషన్స్ తో నిండిపోయింది. 70 ఏండ్ల పురుషుడు, 65 ఏండ్ల స్త్రీ పాత్రలో రాజేంద్ర ప్రసాద్, జయప్రద నటించారు. వీరిద్దరూ కాలనీ నుంచి పారిపోయిన ఆసక్తికరమైన ఓ సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభం అవువుతుంది. మూవీ స్టోరీ అంతా.. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రేమ చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. హార్ట్ టచింగ్ సీన్స్ తో అలరిస్తోంది. లేటు వయసులో ప్రేమ పుడితే నిజంగా ఇలా ఉంటుందా? అన్నట్లు చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.
రాజేంద్ర ప్రసాద్, జయప్రద ఇంట్లో తెలియకుండా జంప్ అయిన సీన్ తో ట్రైలర్ షురూ అవుతుంది. తనకు అనుభవించే ప్రాయం ఇప్పుడే మొదలైందని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. కారులో వెళ్తున్న రాజేంద్ర ప్రసాద్, ఈ ప్రపంచాన్ని తమ ప్రేమను తిరస్కరిస్తే.. ప్రపంచాన్ని మనం బహిష్కరిస్తామని చెప్పిన డైలాగ్ క్రేజీగా ఉంది. ఆ తర్వాత ట్రైలర్ కు ఎమోషనల్ టచ్ ఇచ్చారు మేకర్స్. అందరూ నన్ను ఏడిపించిన వాళ్లే.. నీకోసం ఏడ్చింది నీవు ఒక్కడివే అంటూ జయప్రద చెప్పిన డైలాగ్ కంటతడి పెట్టిస్తుంది. మొత్తంగా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
త్వరలో విడుదలకు రెడీ అవుతున్న ‘లవ్ ఎట్ 65’
ఈ చిత్రంలో కార్తీక్ రాజు, స్పందన, క్రిష్, నిహంత్రీ రెడ్డి, నారాయణరావు, ప్రదీప్, సాయి శ్రీనివాస్, ప్రీతి నిగమ్ ముఖ్య పాత్రలు పోషించగా, అజయ్, సునీల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సుధీర్ చింటూ కథను అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్స్ అందించారు. శ్యామ్ తుమ్మలపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమమౌతుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ వరుస సినిమాలో కెరీర్ మంచి జోష్ లో కొనసాగుతుంది. ఈ సినిమాతో పాటు ఆయన మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ‘షష్టి పూర్తి’ కాగా, మరొకటి ‘లగ్గం’ మూవీ. ఈ సినిమాలు సైతం శరవేగంగా తెరకెక్కుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.