అన్వేషించండి

Tollywood Updates Today : పవన్ ఇన్స్టా ఎంట్రీ, విజయ్ షాకింగ్ డెసిషన్, రవితేజ సినిమాలో విశ్వక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

ఇన్‌స్టాగ్రామ్‌లోకి పవర్ స్టార్ మాస్ ఎంట్రీ - అప్పుడే అంతమంది ఫాలోవర్సా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చేశారు. అయితే, ఆయన కేవలం అకౌంట్ మాత్రమే స్టార్ట్ చేశారు. ఇంకా ఎలాంటి పోస్టు పెట్టలేదు. అయితే, పవన్ కళ్యాణ్ ఇన్‌స్టా అకౌంట్ ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే ఫాలోవర్స్ రావడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు 5 లక్షల మంది పవన్ కళ్యాణ్ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. పవన్ కళ్యాణ్ యూజ్ చేసే అఫిషియల్ ట్విట్టర్‌ ఖాతాకు ఉన్న ప్రొఫైల్ చిత్రాన్నే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ కు కూడా సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాజకీయ అభిప్రాయాలతో పాటు సినిమాలకు సంబంధించిన కొత్త విషయాలను పంచుకుంటారని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇక ఆయన ఇన్ స్టా బయోలో “ఏలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో .. జై హింద్!” అనే స్లోగన్ ను చేర్చారు. ఈ నేపథ్యంలో సినిమా కంటే పొలిటికల్ అప్‌డేట్స్ మాత్రమే ఈ అకౌంట్లో ఉంటాయా అనే సందేహం కూడా ఫ్యాన్స్‌లో ఉంది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి). 

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో మెరిసిన సితార - సంతోషంతో ఉప్పొంగిపోయిన మహేష్ బాబు!

టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో సితార కి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఈమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా సితార ఓ రేర్ రికార్డుని క్రియేట్ చేసింది. తాజాగా ఆమె ఏకంగా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్ తండ్రికి తగ్గ కూతురు అంటూ సితారపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సితార ప్రస్తుతం ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ PMJ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

దళపతి విజయ్ షాకింగ్ నిర్ణయం, సినిమాలకు మూడేళ్లు బ్రేక్? కారణం అదేనా?

తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పనవసరం లేదు. ఆయనకు ఒక్క తమిళ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు తమిళ్ నాడులో ఎక్కడ చూసినా విజయ్ గురించే మాట్లాడుకుంటున్నారట. ఎందుకంటే ఆయన సినిమాలక బై బై చెప్పి రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారనే వార్త ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి విజయ్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ఆయన సినిమాలకు బ్రేక్ ఇస్తారనే ప్రచారం రావడంతో రాజకీయాల్లోకి రావడం పక్కా అంటున్నారు అక్కడి రాజకీయ నిపుణులు. ఇప్పుడు ఇదే తమిళనాట చర్చనీయాంశమైంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రవితేజ సినిమాలో శర్వా బదులు విశ్వక్ సేన్ - విలన్‌గా మంచు మనోజ్?

మల్టీస్టారర్స్ చేయడానికి, మరో కథానాయకుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)కు అభ్యంతరం లేదు. కథ, అందులో తన పాత్ర నచ్చితే చాలు... సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'వాల్తేరు వీరయ్య'లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా విశ్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే పాత్రలో రవితేజ నటించారు. నటుడిగా, హీరోగా ప్రయాణం ప్రారంభించిన కొత్తల్లో ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ మల్టీస్టారర్స్ మీద దృష్టి పెట్టారు. 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది మల్టీ హీరోస్ కథ. రవితేజతో పాటు మరో హీరోకి కూడా చోటు ఉంది. తొలుత ఆ పాత్రకు శర్వానంద్ (Sharwanand)ను అనుకున్నారు. అయితే, ఇప్పుడు శర్వా బదులు మరొక హీరో పేరు వినబడుతోంది (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి). 

‘మంగళవారం’ టీజర్ - ఆ ఊరి ప్రజలకు ఆకాశంలో ఏం కనిపించింది? హాట్ సీన్స్‌లో పాయల్!

దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తోన్న మూవీ ‘మంగళవారం’. ‘ఆర్ఎక్స్100’ లో హీరోయిన్ గా నటించి తన గ్లామర్ తో అందరి దృష్టినీ ఆకర్షించిన పాయల్ రాజ్ పుత్ ఈ మూవీలో లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ మూవీతో మరోసారి అజయ్ భూపతి డైరెక్షన్ లో నటిస్తోంది బ్యూటీ. ఇప్పటికే ‘మంగళవారం’ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ను అందించారు మేకర్స్. మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి).  

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో..
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో..
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో..
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో..
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Pushpa 2 Collection: కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
కుంభస్థలాన్ని కొట్టిన పుష్ప రాజ్... మూడు రోజుల్లో 'పుష్ప 2' ఎంత కలెక్ట్ చేసిందంటే?
T Fiber: 'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
'తక్కువ ధరకే ఇంటర్నెట్, ఇంటి నుంచే 150 రకాల సేవలు' - టీఫైబర్, మీ సేవ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
Bajaj Chetak Electric: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది - లాంచ్ డేట్ ఫిక్స్ - ధర ఎంత ఉండవచ్చు?
Embed widget