అన్వేషించండి

Anushka Shetty: రూ.5 కోట్ల మూవీ ఆఫర్‌కు సింపుల్‌గా నో చెప్పేసిన అనుష్క, ఎందుకు అలా చేశావ్ స్వీటీ?

ఒక్క సినిమాకు రూ.5 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామంటే ఏ హీరోయిన్ అయినా ఇట్టే ఓకే చెప్పేస్తుంది. కానీ, స్టార్ హీరోయిన్ అనుష్క మాత్రం సింపుల్ గా నో చెప్పింది. ఇంతకీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసా?

Actress Anushka Shetty Rejected 5 Crore Movie Offer: సినిమా పరిశ్రమలో హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ డ్యురేషన్ చాలా తక్కువ. గతం హీరోయిన్లు 10 నుంచి 15 ఏండ్లు కొనసాగినా.. ఇప్పుడు వస్తున్న హీరోయిన్లు ఇలా వచ్చి అలా మాయం అవుతున్నారు. కొద్ది మంది మాత్రమే సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు అనుష్క శెట్టి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె, ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు అదిరిపోయే ఆఫర్ వచ్చిందట. కానీ, ఆమె సింపుల్ గా నో చెప్పిందట. ఇంతకీ ఆమెకు వచ్చిన ఆఫర్ ఏంటి? ఎందుకు నో చెప్పిందంటే?  

రూ. 5 కోట్ల ఆఫర్ ను రిజెక్ట్ చేసిన అనుష్క

రీసెంట్ గా ఓ స్టార్ హీరో సినిమాలో నటించాలని అనుష్కను మేకర్స్ సంప్రదించారట. ఈ మూవీకి ఓకే చెప్తే ఏకంగా రూ. 5 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారట. కానీ, వారి ఆఫర్ ను అనుష్క ఒప్పుకోలేదట. తాను ఈ సినిమా చేయాలేనని చెప్పిందట. దానికి కారణం లేకపోలేదు. నిజానికి చాలా కాలంగా అనుష్క నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తోంది. నటనకు స్కోప్ లేకుండా కేవలం అందాల ప్రదర్శన చేసే పాత్రలకైతే నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. తాజాగా వచ్చిన రూ. 5 కోట్ల ఆఫర్ కూడా ఇంచుమించు అలాంటిదేనట. స్టార్ హీరో సినిమాలో తన క్యారెక్టర్ కు అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత లేదని గుర్తించిన అనుష్క చేయలేనని చెప్పిందట. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం వల్ల తనకు ఉన్న క్రెడిబులిటీ దెబ్బతింటుందని చెప్పుకొచ్చిందట. 

అనుష్క నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసలు

కెరీర్ అనుకున్న స్థాయిలో కొనసాగకున్నా, మంచి క్యారెక్టర్లు మాత్రమే చేయాలనే తన నిర్ణయానికి కట్టుబడి ఈ సినిమాను రిజెక్ట్ చేసిన అనుష్క మీద సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. డబ్బులు ఇస్తే చాలా ఏమైనా చేయడానికి రెడీ అనుకున్న హీరోయిన్లు అనుష్కను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.  

వరుస సినిమాలు చేస్తున్న అనుష్క

ప్రస్తుతం అనుష్క మూడు సినిమాల్లో నటిస్తోంది. వాటిలో రెండు తెలుగు సినిమాలు ఉండగా, మరొకటి మలయాళం సినిమా. క్రిష్ జాగర్లమూడితో కలిసి ‘గాటీ’ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ కు మంచి క్రేజ్ లభించింది. సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అటు మలయాళంలో ‘కథనార్’ అనే మూవీలో నటిస్తోంది. రోజిన్ థామన్ ఈ సినిమాను పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఇందులో అనుష్క దెయ్యంగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అనుష్క తెలుగులో చివరగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో కనిపించింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లు వసూళు చేసింది. 

Also Read: విజయ్ ‘గోట్’ నుంచి రెండో పాట విడుదల - చనిపోయిన సింగర్ వాయిస్‌ను రీక్రియేట్ చేసిన మేకర్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget