అన్వేషించండి

Natti Kumar: నిర్మాతలకు సినిమా తీయడం రాక కార్మికులను టార్గెట్ చేస్తున్నారు: నట్టికుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

సినీ ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికులు మాకు భారంగా మారారని నిర్మాతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలేంటి.ప్రొడక్షన్ కాస్ట్ ఎందుకు పెరుగుతోంది. నిర్మాత నట్టికుమార్ తో ABP Desam ఇంటర్వ్యూ

ఏబిపి దేశం.. టాలీవుడ్ లో ఏం జరుగుతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ తో నిర్మాతల చర్చలు జరిపినా ప్రయోజనం లేదు. కార్మికులు అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలా.. ఓ నిర్మాతగా నట్టికుమార్ ఏమంటారు...

నట్టి కుమార్, నిర్మాత: కార్మికుడికి సమ్మె చేసే హక్కు ఉంది. జీతాలు ఏడాదికి 30శాతం పెంచుతామని  2022 అగ్రిమెంట్ లో ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం జీతాలు పెంచాల్సిన భాద్యత నిర్మాతలపై ఉంది.  కానీ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది.చిన్న నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. అందరికీ ఓరకంగా జీతాలు పెంచుతామని నిర్మాతలు ముందుకు రాకపోవడంతోనే సమ్మె ఇంకా కొనసాగుతోంది. మూడు యూనియన్లకు మేము ఇవ్వలేమని చెప్పడం సరికాదు. 24 ఆకులు వేసి ,21 మందికి భోజనం పెట్టి మరో ముగ్గురికి వదిలేయడం అనేది విభజించి పాలించడం.  అలా చేయడం నిర్మాతలకు కరెక్ట్ కాదు. 

నిర్మాతల వైపు న్యాయం ఉంది. కార్మికుల అడిగేది కూడా కరెక్టే.కానీ ఇక్కడ డ్రామా ఆడుతున్నది నాయకులు మాత్రమే. అటు నిర్మాతల్లో కొందరు,ఇటు కార్మికుల్లో కొందరు నాయకులు కావాలనే సమస్యను పెద్దది చేస్తున్నారు. నిజమైన  కార్మికుడు డ్రామా ఆడటంలేదు. నిజమైన నిర్మాత సైతం డ్రామాలు ఆడటంలేదు. 

ఏబిపి దేశం..

మీరు నిర్మాతగా అనేక సినిమాలు తీసారు. మీరు సినిమాలు తీసిన సమయంలో కార్మికులతో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారా.. కార్మికులు ఇప్పుడు ఎందుకు సమస్యగా మారారు.

నట్టి కుమార్, నిర్మాత:  మేము సినిమాలు తీస్తున్నప్పడు ఇలాంటి సమస్య ఎదుర్కోలేదు. మాకు సినిమాలు తీయడం వచ్చు. ప్రొడక్షన్ కాస్ట్ పెరగకుండా సినిమా పూర్తి చేయడం తెలుసు.సినిమా ఎంత బిజినెస్ చేస్తోందో, ఎంత ఖర్చుతో సినిమా తీయాలో మాకు అవగాహన ఉంది. సినిమా నిర్మాణంలో ఓ నిర్మాతగా మా పాత్ర మేము పోషించాము. చేతులు కట్టుకుని కూర్చోలేదు. నిర్మాతకు పూర్తి స్దాయి అవగాహన ఉంటే కార్మికులతో సమస్య రాదు. ఓ సీన్ తీసేందుకు ఎంత మంది ఆర్టిస్టులు కావాలి, ఎంత మంది కార్మికుల కావాలో తెలియని పరిస్దితుల్లో కొందరు నిర్మాతలున్నారు. ఖర్చు అదుపుచేయలేని పరిస్దితిలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాారు. 

నిర్మాత ,దర్శకులు సినిమా నిర్మాణంలో రధసారధులు. సినిమా ఎన్నిరోజుల్లో పూర్తవుతుంది, ఎంత మంది కాావాలి,ఎంత ఖర్చు అవుతుంది అనేది నిర్మాత,దర్శకులకు పూర్తి అవగాహాన ఉండాలి. హీరోకి ఎంత మార్కెట్ ఉంది.హీరోయిన్ కు ఎంత మార్కెట్ ఉంది. ఓటీటీ నుండి ఎంత వస్తుంది.మన బడ్జెట్ ఎంతుంది. ఓ 10శాతం అటూ ఇటుగా నిర్మాత అంచనా వేసుకోవాలి.షూటింగ్ లొకేషన్ చెప్పిన చోట చేస్తున్నారా,  చెప్పిన ఖర్చులోపు దర్శకుడు తీస్తున్నాడా లేదా అనే అవగాహన లేనప్పుడు అటువంటి నిర్మాతలు సినిమా తీయడం మానేస్తే బెటర్. లైట్ మ్యాన్ ఎంత మంది ఉండాలి. డీఓపీ ఎంత మంది కావాలి అనేది మీకు తెలియాలి. ఇంతమంది వస్తామని కార్మికులు చెప్పడం కాదు,ఎంత మంది రావాలో మీరే వారికి చెప్పేలా పూర్తి స్దాయి అవగాహన దర్శక,నిర్మాతలకు ఉండాలి. ఓక్క క్రైన్ మోయాలంటే ఒక్కడు చేయలేడు. ఓ యాభై మందికి భోజనాలు ఓక్కడే వడ్డించలేడు. ఇవన్నీ ఆచరణలో ఉండేాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఏబిపి దేశం..

మీరు నిర్మాతగా ఉన్నారు , ఎందుకు నిర్మాతలకు వ్యతిరేకంగా మాట్లడుతున్నారు. మేం నష్టపోతున్నామంటూ నిర్మాతలంటున్నారు.. మీడియాలో మీరు ట్రెండ్ అవ్వడం కోసం ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా.. 

నట్టి కుమార్, నిర్మాత: సినిమా తీయమని కార్ములు అడిగారా, సినిమా తీసి నష్టపోమ్మని నిర్మాతలకు కార్మికులు చెప్పారా..అనేక మంది నిర్మాతలు , ఇదే కార్మికుల యూనియన్ల సహాయంతో హిట్ సినిమాలు తీసాము. మంచి లాభాలు సాధించాము. ఇప్పుడు 98శాతం నష్టాల్లో ఇండస్ట్రీ ఉంది. పెద్ద సినిమా , చిన్న సినిమా అని తేడా లేదు. థియేటర్లకు ఆడియన్స్ రావడం తగ్గిపోవడమే సినిమా ఇండస్ట్రీ ఇంతలా నష్టపోవడానికి కారణం.నేను ట్రెండ్ అవ్వడానకి చెప్పడంలేదు. నిజాలు మాత్రమే చెబుతున్నాను. 100 రూపాయల టిక్కెట్ 500 రూపాయలకు పెంచుకుంటున్నాం కానీ కార్మికుల జీతాలు పెంచమంటే కుదరదంటున్నాం. హీరోల ప్రక్కన వస్తున్న సైడ్ ఆర్టిస్టులకు , ఫ్లైట్ టిక్కెట్ లకు, లగ్జరీ కార్లు,స్టార్ హోటల్స్ కు  గట్టిగానే ఖర్చు పెడుతున్న నిర్మాతకు 5శాతం జీతాలు పెంచడం అంత భారం కాదు.

కార్మికుల జీతాలు పెరిగితే రోజుకు ఓ షూటింగ్ లో పాల్గొనే కార్మికుల జీాతాలు మొత్తంగా లక్ష రూపాయలు అవుతుంది. పెద్ద సినిమాకు అయితే 2లక్షలు అవుతుంది.ఇలా సినిమా 60 రొోజులు షూటింగ్ జరిగితే మహా అయితే కోటి 20లక్షలు ఖర్చవుతుంది. 750కోట్లతో సినిమా తీస్తున్నప్పుడు రెండు కోట్లు అనేది నష్టపోవడమా..  ఇవన్నీ వాస్తవాలు. కార్మికులకు వెయ్యి ఇస్తున్నాం., మరో రెండు వందలు పెంచితే పెద్ద నష్టం కాదు. మీరు అంతలా నష్టపోతున్నామంటే సినిమా ఎందుకు తీయాలి. టెక్నీషియన్లు,కార్మికులు మీ మాట వినకపోతే సినిమా తీయడంలో నిర్మాత,దర్శకుడు విఫలమైనట్లే. ఈ పరిస్దితుల్లో మార్పు రావాలి. సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget