అన్వేషించండి

Sunil: కోలీవుడ్‌లో దూసుకుపోతున్న టాలీవుడ్ యాక్టర్ సునీల్!

టాలీవుడ్ యాక్టర్ సునీల్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. తెలుగులోనే తమిళ్ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.

టాలీవుడ్ లో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి, ఈ క్రమంలో హీరో అవతారమెత్తిన నటుడు సునీల్. కొన్నేళ్ల పాటు తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను కడపుబ్బా నవ్వించిన ఆయన.. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారక్టర్ ఆర్టిస్టుగా అదరగొడుతున్నాడు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనలోని పరిపూర్ణ నటుడిని బయటకి తీస్తున్నాడు. కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ, బిజీ యాక్టర్ గా మారిపోయాడు.

హీరోగా వరుస పరాజయాలు పలకరించడంతో కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న సునీల్.. 'కలర్ ఫోటో' సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి విలనీ వేషాలు కూడా వేయగలనని నిరూపించాడు. దీంతో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్' చిత్రంలో విలన్ గా నటించే ఛాన్స్ అందుకున్నాడు. ఇందులో మంగళం శ్రీను అనే ప్రతినాయకుడి పాత్రలో భయంకరమైన లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. 

'పుష్ప పార్ట్ 1' మూవీలో సునీల్ నటనను ప్రశంసలు దక్కడమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో తమిళ్ చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు. శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన 'మావీరన్‌' మూవీలో కీలక పాత్ర ద్వారా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా సునీల్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది.

Also Read: బాలయ్య 'అన్ స్టాపబుల్' అప్డేట్ - సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరంటే?

'మావీరన్' తర్వాత వెంటనే సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడు సునీల్. ఆయన పోషించిన బ్లాస్ట్ మోహన్ పాత్రకు విశేష ఆదరణ లభించింది. ఇటీవల విశాల్ హీరోగా తెరకెక్కిన 'మార్క్ ఆంటోని' మూవీలో ఏకాంబరం అనే పాత్రలో నటించి మరో సక్సెస్ రుచి చూశారు సునీల్. ఇలా డైరెక్ట్ తమిళ్ లో నటించిన మూడు సినిమాలూ విజయం సాధించడంతో కోలీవుడ్ లో క్రేజీ యాక్టర్ గా మారిపోయాడు.

సునీల్ ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న 'జపాన్' అనే తమిళ్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ లో అతని లుక్ ఆకట్టుకుంది. అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'ఈగై' చిత్రంలోనూ కనిపించబోతున్నారు. దీంతో పాటుగా రాఘవ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ తో కలిసి 'బుల్లెట్' అనే సినిమా చేయనున్నారు. తమిళ చిత్రాలే కాదు కొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కూడా సునీల్ చేతిలో ఉన్నాయి. 

స్టార్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న 'గేమ్ ఛేంజర్' మూవీలో నటిస్తున్నారు సునీల్. 'పుష్ప: పార్ట్ 2' చిత్రంలో మంగళం శ్రీనుగా కంటిన్యూ అవుతున్నారు. అలానే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే 'గుంటూరు కారం' సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఇలా సునీల్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఏడాది పొడవునా బిజీగా గడుపుతున్నారు. మరి ఈ సినిమాలు నటుడికి ఎలాంటి పేరు తెచ్చి పెడతాయో వేచి చూడాలి.

Also Read: చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి 'భోళా శంకర్' కథ సరిపోలేదు: పరుచూరి గోపాలకృష్ణ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Dacoit Trailer Review : రోమియో జూలియట్ క్యూట్ లవ్ స్టోరీ - అడివి శేష్ డెకాయిట్ ట్రైలర్ రివ్యూ
రోమియో జూలియట్ క్యూట్ లవ్ స్టోరీ - అడివి శేష్ డెకాయిట్ ట్రైలర్ రివ్యూ
Suriya - Tovino Thomas: సూర్య మార్చాడు... టోవినో థామస్ మార్చే ఛాన్స్ లేనట్టే!
సూర్య మార్చాడు... టోవినో థామస్ మార్చే ఛాన్స్ లేనట్టే!
Rakasa Day 1 Collection : రాకాస ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్ - ఇట్స్ అఫీషియల్... మూవీ టీం ఫుల్ ఖుష్
రాకాస ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్ - ఇట్స్ అఫీషియల్... మూవీ టీం ఫుల్ ఖుష్

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 DC Vs MI Result Update: ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం.. ముంబైని చిత్తు చేసిన క్యాపిట‌ల్స్, రాణించిన రిజ్వి, నిస్సాంక‌, MI కి నిరాశ‌
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Gajwel Attack: రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
రేవంత్ ఫోటో లేదని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై ఎటాక్ - రౌడీ రాజ్యమని బీఆర్ఎస్ ఆగ్రహం
VitalID: ఇక పాస్‌వర్డ్‌లు అవసరం లేదు! కదిలితే చాలు గుర్తిస్తుంది - సరికొత్త టెక్నాలజీ ఇదీ
ఇక పాస్‌వర్డ్‌లు అవసరం లేదు! కదిలితే చాలు గుర్తిస్తుంది - సరికొత్త టెక్నాలజీ ఇదీ
Kyathanpally and Ibragimpatnam: ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!
ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!
Embed widget