Tiger 3 : 'టైగర్ 3' ఫస్ట్ షో ఎన్నింటికి పడుతుందంటే?
సల్మాన్ ఖాన్ హీరోగా యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన 'టైగర్ 3' నవంబర్ 3న విడుదల కానుంది. ఆదివారం ఉదయం ఎన్ని గంటలకు ఫస్ట్ షో పడుతుందో తెలుసా?
Tiger 3 First Show Timing : సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన లేటెస్ట్ స్పై ఫిల్మ్ 'టైగర్ 3'. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందీ సినిమా. నవంబర్ 12న థియేటర్లలోకి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మరి, ఫస్ట్ షో ఎన్ని గంటలకు పడుతుందో తెలుసా?
ఆదివారం ఉదయం ఏడు గంటలకు...
Tiger 3 Movie First Show November 12 : సాధారణంగా సినిమాలు శుక్రవారం నాడు విడుదల అవుతుంటాయి. కానీ, ఆదివారం 'టైగర్ 3' విడుదల అవుతోంది. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఫస్ట్ షో వేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.
'టైగర్ 2' సినిమాలో కత్రినా కైఫ్ (Katrina Kaif) కథానాయికగా నటించారు. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్ సరసన ఆమె నటించిన చిత్రమిది. ఆ సినిమాలతో పాటు 'వార్', 'పఠాన్' తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో రూపొందిన చిత్రమిది. అందుకని, 'టైగర్ 3' సినిమాపై హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read : ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో జాన్వీ కపూర్ - నయా అతిలోక సుందరి!
BREAKING: @yrf to screen #Tiger3 from 7 am in the morning on Sunday, Nov 12 - its release date owing to unprecedented demand! Advance booking opens on Nov 5! It will release across Premium Formats like: 2D, IMAX 2D, 4DX 2D, PVR P[XL], DBOX, ICE, 4DE Motion!! pic.twitter.com/UyvaaheIPg
— Vamsi Kaka (@vamsikaka) November 1, 2023
'టైగర్ 3' చిత్రానికి మనీష్ శర్మ (Manish Sharma) దర్శకుడు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత, యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా నిర్మాత. ఈ సినిమా నిర్మించడంతో పాటు ఆయన కథ అందించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : శ్రీధర్ రాఘవ, ఛాయాగ్రహణం : అనయ్ ఓం గోస్వామి, సంగీతం : ప్రీతమ్.
ఆల్రెడీ విడుదలైన 'టైగర్ 3' సినిమా టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్ మరోసారి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయమని అర్థం అవుతోంది. ఇండియాలోని న్యూస్ ఛానళ్లలో టైగర్ దేశ ద్రోహి అని, ఇండియాకు శత్రువు అని ఎందుకు చెబుతున్నారు? టైగర్ మీద ఆర్మీ ఎందుకు ఎటాక్ చేసింది? అసలు ఏమైంది? అనేది సినిమా కథగా తెలుస్తోంది. ''టైగర్ జీవించి ఉన్నంత వరకు ఓటమి ఒప్పుకోడు'' అని సల్మాన్ ఖాన్ చెప్పిన డైలాగ్ హీరోయిజం ఎలివేట్ చేసింది.
Also Read : 'కీడా కోలా' ఫస్ట్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది - బ్రహ్మి, తరుణ్ భాస్కర్ సినిమా ఎలా ఉందంటే?
'టైగర్ 3' వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందా? లేదా?
ఇప్పుడు అందరి దృష్టి 'టైగర్ 3' ఎంత కలెక్ట్ చేస్తుంది? అనే దాని మీద ఉంది. ఎందుకంటే... అమీర్ ఖాన్ 'దంగల్' 2024 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే... ప్రభాస్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2' ఆల్మోస్ట్ ఆ రికార్డుకు దగ్గర దగ్గరగా వెళ్ళింది. రూ. 1810 కోట్లు కలెక్ట్ చేసింది. 'దంగల్'కు చైనాలో వచ్చిన కలెక్షన్స్ తీసేస్తే... ఇండియా వరకు 'బాహుబలి 2' మొదటి స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'తో మరోసారి రాజమౌళి 1000 కోట్ల మేజిక్ మార్క్ అందుకున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆయన తీసిన ట్రిపుల్ ఆర్ రూ. 1258 కోట్లు కలెక్ట్ చేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన 'కెజియఫ్ 2' రూ. 1250 కోట్ల వసూళ్లు రాబట్టింది.