By: ABP Desam | Updated at : 11 Jan 2022 01:40 PM (IST)
టిక్కెట్ రేట్లపై రెండు గంటల పాటు కమిటీ చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల అంశంపై హైకోర్టు సూచనలతో నియమించిన కమిటీ రెండో సమావేశం అమరావతిలో దాదాపుగా రెండు గంటల పాటు సాగింది. ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా దీనికి హాజరయ్యారు. టిక్కెట్ల అంశంపై ఆర్జీవీతో నాలుగు గంటల పాటు మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. కానీ కమిటీ మాత్రం రెండు గంటల పాటే సమావేశం అయింది. సమావేశంలో సినీ పరిశ్రమ తరపున ఎగ్జిబిటర్లు తమ వాదన వినిపించారు. ధియేటర్ల నిర్వహణ పరిస్థితులను వివరించి ప్రస్తుతం ఖరారు చేసిన టిక్కెట్ రేట్లు ఏ మాత్రం గిట్టుబాటు కావని.. పెంచాలని విజ్ఞప్తి చేశారు.
సినిమా టిక్కెట్ రేట్లు ఎంత ఉండాలనేదానిపై ఓ నివేదికను ఎగ్జిబిటర్లు అందించారు. ఈ సమావేశంలో టిక్కెట్ల ధరలతో పాటు ధియేటర్లలో వసతుల కల్పన.. ధియేటర్ల గ్రేడింగ్ కు ఏ పద్దతి పాటించాలన్న అంశంపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రత్యేకంగా ఎలాంటి భేటీలు ఉండకపోవచ్చని ప్రభుత్వానికి అధికారుల కమిటీ నివేదిక సమర్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టుకు కూడా నివేదిక సమర్పించాల్సి ఉంది.
Also Read: నాలుగు గంటల భేటీ మధ్యలో రొయ్యల బిర్యానీ లంచ్ ! చివరికి ఏమి తేల్చారంటే ?
సినిమా టిక్కెట్ల అంశం టాలీవుడ్, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదంలా మారింది. దేశంలో అన్ని రాష్ట్రాలు సినిమా టిక్కెట్ల అంశాన్ని ఇంతలా వివాదాస్పదం చేయలేదని.. కానీ ప్రభుత్వం మాత్రమే అతి తక్కువ రేట్లు నిర్ణయించారని సినీ పెద్దలు భావిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కవడంతో ఎగ్జిబిటర్లు కోర్టుకెళ్లారు. కోర్టు ప్రభుత్వం జారీ చేసిన టిక్కెట్ల జీవోను రద్దు చేసి.. కమిటీని నియమించి ఖరారు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?
ఈ కమిటీ చేసే సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం టిక్కెట్ల ధరలపై నిర్ణయం తీసుకోనుంది. ఎప్పుడు నివేదిక సమర్పిస్తుంది..? ఎంత మేర టిక్కెట్ రేట్ల పెంపునకు సిఫార్సు చేస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వ పెద్దల ప్రకటనల ప్రకారం చూస్తే టిక్కెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదేమోనని కొంత మంది భావిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.
Also Read: టిక్కెట్ల వివాదం ముదరదు.. త్వరలోనే పరిష్కారం : సజ్జల
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!
రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>